Feeling Hungry After Eating: భోజనం చేసిన కాసేపటికే మళ్లీ మళ్లీ ఆకలిగా అనిపిస్తుందా? ఇది దేనికి సంకేతమో తెలుసా..

కడుపు నిండుగా భోజనం చేసిన తర్వాత కూడా ఒక్కోసారి వెంటనే ఆకలి వేస్తుంది. భోజనం తిన్న తర్వాత కొద్ది సమయం గడిచిన వెంటనే, ఆకలిగా అనిపించడం ప్రారంభమవుతుంది. ఇలా అర్ధరాత్రి బాగా ఆకలి కారణంగా మెలకువ రావడం జరుగుతుంది. కడుపు నిండా తిన్నా కూడా మళ్లీ మళ్లీ ఆకలి వేయడం ఏంటో తెలియక చాలా మంది ఆందోళన చెందుతుంటారు. దీంతో చేసేది లేక.. ఎప్పుడు ఆకలి వేస్తే అప్పుడు.. చిప్ప్, బిస్కెట్లు..

Feeling Hungry After Eating: భోజనం చేసిన కాసేపటికే మళ్లీ మళ్లీ ఆకలిగా అనిపిస్తుందా? ఇది దేనికి సంకేతమో తెలుసా..
Feeling Hungry After Eating

Updated on: Sep 18, 2024 | 12:46 PM

కడుపు నిండుగా భోజనం చేసిన తర్వాత కూడా ఒక్కోసారి వెంటనే ఆకలి వేస్తుంది. భోజనం తిన్న తర్వాత కొద్ది సమయం గడిచిన వెంటనే, ఆకలిగా అనిపించడం ప్రారంభమవుతుంది. ఇలా అర్ధరాత్రి బాగా ఆకలి కారణంగా మెలకువ రావడం జరుగుతుంది. కడుపు నిండా తిన్నా కూడా మళ్లీ మళ్లీ ఆకలి వేయడం ఏంటో తెలియక చాలా మంది ఆందోళన చెందుతుంటారు. దీంతో చేసేది లేక.. ఎప్పుడు ఆకలి వేస్తే అప్పుడు.. చిప్ప్, బిస్కెట్లు.. ఇలా స్నాక్స్‌ అపరిమితంగా లాగించేస్తుంటారు. అయితే ఈ విధమైన లక్షణాలు కనిపించడం ఆరోగ్యానికి అంత మంచిది కాదంటున్నారు ఆరోగ్య నిపుణులు. పైగా ఈ అలవాటు వల్ల మీకే తెలియకుండా బరువు కూడా పెరుగుతుంది. అయితే ఇలా ఎందుకు జరుగుతుందో ముందు తెలుసుకోవడం ముఖ్యం.

శరీరంలో ప్రోటీన్ లోపం ఉంటే ఇలా జరుగుతుంది. ప్రోటీన్‌కు ఆకలిని తగ్గించే శక్తి ఉంది. ఆహారంలో తగినంత ప్రోటీన్ లేకుంటే ఎక్కువ తినాలనే కోరికకు దారితీస్తుంది. ప్రొటీన్లు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం వల్ల మీ పొట్ట ఎక్కువసేపు నిండుగా ఉంటుంది. ఫలితంగా తక్కువ కేలరీలు శరీరానికి అందుతాయి. బరువును కూడా అదుపులో ఉంచుతుంది. ఆకలిని నియంత్రించడంతో పాటు మంచి ఆరోగ్యం కోసం పగటిపూట తగినంత నిద్ర అవసరం. 7-8 గంటల నిద్ర చాలా అవసరం. మెదడు పనితీరును పెంచడానికి, రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి, దీర్ఘకాలిక వ్యాధులను నివారించడానికి తగినంత నిద్ర అవసరం. నిద్ర వల్ల మెదడు గ్రెలిన్ అనే హార్మోన్ స్రవిస్తుంది. ఈ హార్మోన్ ఆకలిని అదుపులో ఉంచుతుంది.

శరీరం పనితీరును మెరుగుపరచడానికి నీరు కూడా చాలా ముఖ్యమైనది. చర్మ ఆరోగ్యానికి నీరు ఎంత ముఖ్యమో, జీర్ణక్రియను మెరుగుపరచడానికి ఎక్కువ నీరు త్రాగడం కూడా చాలా ముఖ్యం. శరీరంలో నీటి సమతుల్యత సరిగ్గా ఉంటే, ఆకలి కూడా తగ్గుతుంది. తినే ముందు నీళ్లు ఎక్కువగా తాగినా ఆకలి తగ్గుతుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆరోగ్య సంబంధిత కథనాల కోసం క్లిక్‌ చేయండి.