Ginger Garlic Paste: అల్లం-వెల్లుల్లి పేస్ట్‌ని ఇంట్లోనే తయారు చేసుకుని నిల్వ చేసుకోవచ్చు.. సింపుల్ చిట్కాలు మీకోసం

|

Nov 02, 2021 | 2:57 PM

Ginger Garlic Paste:  అల్లం వెల్లుల్లి పేస్ట్ భారతీయ వంటల్లోనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో వంటల్లో ఉపయోగించే పదార్ధం. అన్నింటిలో మార్పులు..

Ginger Garlic Paste: అల్లం-వెల్లుల్లి పేస్ట్‌ని ఇంట్లోనే తయారు చేసుకుని నిల్వ చేసుకోవచ్చు.. సింపుల్ చిట్కాలు మీకోసం
Ginger Garlic Paste
Follow us on

Ginger Garlic Paste:  అల్లం వెల్లుల్లి పేస్ట్ భారతీయ వంటల్లోనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో వంటల్లో ఉపయోగించే పదార్ధం. అన్నింటిలో మార్పులు వచ్చినట్లే.. అల్లం వెల్లుల్లి పేస్ట్ ని కూడా తాజాగా అప్పటికప్పుడు తయారు చేసుకున్నది కాకుండా ప్యాక్ చేసిన అల్లంవెల్లుల్లి పేస్టుని ఉపయోగిస్తున్నారు. అయితే అల్లం, వెల్లుల్లి పేస్ట్ లను ఇంట్లోనే సులభంగా తయారు చేసుకుని నిల్వ ఉంచుకోవచ్చు అని అంటున్నారు ప్రముఖ చెఫ్.  అల్లం వెల్లుల్లి పేస్ట్ మిశ్రమాన్ని తగిన కొలతలతో తయారు చేసుకుంటే.. రెండు మూడు నెలలు నిల్వ ఉంటుందని సెలబ్రిటీ చెఫ్ కునాల్ కపూర్  చెబుతున్నారు. అంతేకాదు తాజాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ను ఎలా తయారు చేసుకోవాలనే వీడియో ఒకటి ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేశారు.  అల్లం వెల్లుల్లిని తయారు చేసుకోవడానికి ఒక వంతు అల్లం తీసుకుంటే.. రెండు వంతుల వెల్లుల్లి తీసుకోవాలని సూచించారు.

మరొక వీడియోలో వెనిగర్  వేయకుండా అల్లం వెల్లుల్లి పేస్టులను విడిగా ఎలా తయారు చేయాలో చూపించారు. వెనిగర్ బదులు ఉప్పు, నూనెలను ఉపయోగించి పేస్టుని నిల్వచేశారు.

తయారీకి కావలసిన పదార్ధాలు: 

వెల్లుల్లి పేస్ట్ కోసం

ఒలిచిన వెల్లుల్లి -1 కప్పు
ఉప్పు- ½ టేబుల్ స్పూన్
నూనె- ½ కప్పు

అల్లం పేస్ట్ కోసం

అల్లం తరిగిన ముక్కలు 1 కప్పు
ఉప్పు- ½ టేబుల్ స్పూన్
నూనె- ½ కప్పు

తయారు చేసే పద్దతి: వెల్లుల్లిని నీళ్లతో కడగకుండా ఉప్పు, నూనె కలిపి గ్రైండర్‌లో వేయాలి. దీన్ని మెత్తగా పేస్ట్‌లా చేసుకోవాలి. అనంతరం ఈ పేస్టుని గాలి తగలని గాజు సీసాలో పెట్టి ఫ్రిజ్‌లో ఉంచండి..

అల్లం ముక్కలను ఉప్పు , నూనె కలిపి మిక్సీ లో వేసుకుని గ్రైండ్ చేయండి. ఈ పేస్ట్ ను గాలి తగలని  డబ్బాల్లో నిల్వ   నిల్వ చేసి ఫ్రిజ్‌లో ఉంచండి. అల్లం మరియు వెల్లుల్లి పేస్ట్‌లు రెండూ 1-1.5 నెలల వరకు నిల్వ ఉంటాయి.

Also Read:  దివ్యమైన దీపావళికి ముగ్గులతో ఇంటిని అలంకరించడం కోసం సింపుల్ ఐడియాలు..