Ustrasana Benefits : యోగా శరీరంలోని అనేక వ్యాధులను నిర్వహిస్తుంది. మానసిక , శారీరక ప్రశాంతతను ఇస్తుంది. ఇక ఈరోజు యోగాలో ఒకరమైన ఆసనం ఉష్ట్రాసనం. ఉష్ట్రం అనేపదానికి సంస్కృతంలో ఒంటె అని అర్ధం. అందుకనే ఒంటె భంగిమలో కూడిన వ్యాయామరీతి కనుక దీనిని ఉష్ట్రాసనం అంటారు. ఈరోజు ఈ ఆయనం వేయడం ఎలా.. కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం..!
ముందుగా కూర్చుని కళ్ళను సమాంతరంగా ఆరు అంగుళాల దూరంలో వాటిని ఉంచాలి. తర్వాత వజ్రాసనంలో కూర్చోవాలి. అనంతరం కాలివేళ్లు, మడమల వంపు ఆధారంగా కూర్చొనవలెను.
నడుము కింది భాగంలో వీలైనంత వెడల్పుగా ఉంచండి. శరీరం, వెన్నెముక, మెడ నిఠారుగా ఉంచాలి. అరచేతులను సంబంధిత మోకాళ్ల మీద ఆనించాలి. అనంతరం మోకాళ్ళ మీద నిలబడాలి.
సుధీర్ఘ శ్వాస తీసుకుంటూ శరీరాన్ని తలను వెనుకకు తీసుకుని వెళ్ళాలి. చేతులను వెనుకకు తీసుకువెళ్ళి పాదములను పట్టుకొనవలయును. మోకాళ్లమీద శరీరాన్ని వెనుకకు వంచి కుడి మడమను మీ కుడి చేతితోనూ, ఎడమ మడమను ఎడమ చేతితోనూ పట్టుకోవాలి. మడమలను గట్టిగా పట్టుకుని నడుము మరియు తొడలను వెనక్కు వంచాలి. తలను, మెడను వీలైనంతగా వెనక్కు వంచాలి. కటి భాగాన్ని, నడుమును కొద్దిగా ముందుకు నెట్టాలి. శ్వాసను మామూలుగా పీల్చి వదులుతూ ఈ స్థితిలో 6-8 సెకన్ల వరకు ఈ భంగిమలో ఉండాలి. అనంతరం యాధస్థితికి రావాలి.
మెదడుకు రక్త ప్రసరణను వృద్ధి చేయును.
ముఖం కాంతివంత మగును.
కాళ్ళు, తొడలు, చేతులు, భుజాలు బలోపేతమగును.
గొంతు సమస్యలు,శ్వాస సంబంధమైన ఆస్త్మా, అలర్జీ, సైనస్ వంటి సమస్యలు తగ్గుతాయి
గుండె, నడుము, చాతి, గర్భాశయం దృఢంగా మారతాయి.
ఈ యోగాసనం శ్వాస కోశాలను, ఊపిరితిత్తుల పనితీరును, ముక్కు నాళికను, నరాల పనితీరును మెరుగుపరుస్తుంది.
ఉబ్బసాన్ని అదుపులో ఉంచుతుంది.
పదే పదే వచ్చే తలనొప్పి, గొంతు సమస్యలు, టాన్సిల్స్‌ను నిరోధించి, నివారిస్తుంది.
థైరాయిడ్ సమస్య, సర్వాయికల్ సమస్య తగ్గిస్తుంది.
యోగాసనం రోజు చేస్తే మహిళల్లో ఉండే రుతుక్రమ సమస్యలు దూరమవుతాయి.
అంతేకాదు ప్రసవం తర్వాత సాగిన అవయవాలు పూర్వస్థితికి చేరుకుంటాయి.
మడమలు, తొడలు, శరీరం, గొంతు, కటి, పొత్తి కడుపు ధృడమవుతాయి.
Also Read: