సమయంతో సమరం అన్నవిధంగా ఉరుకులు పరుగుల ప్రస్తుత జీవనవిధానంలో ఆరోగ్య సమస్యల బారిన పడడం సర్వసాధారణ విషయంగా మారింది. ఈ క్రమంలో ప్రతి రోజు వేధించే సమస్యలలో జుట్టు రాలడం, చుండ్రు ప్రధానమైనవి. ఎందుకంటే శరీరంలోని సమస్య బయటకు కనపించదు. కానీ జుట్టు సమస్యలు పుండు మీద కారం మాదిరిగా మనల్ని అనునిత్యం భాధిస్తూ ఉంటాయి. ముఖ్యంగా చలి, వేసవి కాలల్లో జుట్టు చుండ్రు విపరీత స్థాయిలో ఉంటుంది. ఈ సమస్యను అధిగమించేందుకు యువతీయువకులు చేయని ప్రయత్నమే ఉండదు. ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న యాంటీ డాండ్రఫ్ షాంపూలన్నీ ఉపయోగించి.. ఫలితాలు లేక విసిగెత్తిపోయారు. ఇంకా ఈ షాంపూలను అధికంగా వాడడం వల్ల సమస్య మరింతగా తీవ్రతరం అయ్యే ప్రమాదం ఉందని నిపుణుల మాట.
అయితే సులభంగా చుండ్రు సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి కొన్ని రకాల ఇంటి చిట్కాలు ఎంతగానో ఉపయోగపడతాయి. ఆ నేపథ్యంలోనే ఆయుర్వేద నిపుణులు సూచించిన యాంటీ డాండ్రఫ్ ఆయిల్ అయిన ‘ఆలివ్ ఆయిల్’ను వినియోగించడం వల్ల సులభంగా చుండ్రు సమస్యల నుంచి ఉపశమనం పొందడమే కాకుండా జుట్టు రాలడాన్ని కూడా నియంత్రించుకోవచ్చు. ఆలివ్ ఆయిల్, తేనె రెండింటినీ మిక్స్ చేసి స్కాల్ప్‌పై అప్లై చేయడం వల్ల మంచి ఫలితాలు పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా ఇందులో ఉండే గుణాలు స్కాల్ప్ డ్రైనెస్ తొలగించడానికి కూడా కీలక పాత్ర పోషిస్తాయి. ఎందుకంటే ఆలివ్ ఆయిల్‌లో యాంటీ ఫంగల్ గుణాలు కూడా ఉంటాయి. కాబట్టి స్కాల్ప్‌పై ప్రతి సమస్య నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఇక ఈ నూనె తయారి విధానం ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..
యాంటీ డాండ్రఫ్ ఆయిల్ తయారీకి కావలసిన పదార్థాలు: ఆలివ్ నూనె, తేనె
తయారీ విధానం: యాంటీ డాండ్రఫ్ ఆయిల్ తయారు చేయడానికి ఒక గిన్నెలో కోల్డ్ ప్రెస్డ్ ఆలివ్ ఆయిల్, తేనెను సమాన పరిమాణంలో వేసుకోవాలి. అనంతరం ఆ రెండింటినీ బాగా కలుపుకొని మిశ్రమంలా చేసుకోవాలి. అనంతరం ఆ మిశ్రమాన్ని ఒక చిన్న బాటిల్‌లో నిల్వ చేసుకోవాలి.
ఎలా ఉపయోగించాలి..? చుండ్రు సమస్య నివారణ కోసం యాంటీ డాండ్రఫ్ ఆయిల్‌ను మీ జుట్టుకు బాగా అప్లై చేయాలి. ఆ క్రమంలో స్కాల్స్‌పై ఆలీవ్ ఆయిల్‌ను ఆప్లై చేసుకుని.. ముని వేళ్లతో సున్నితంగా మసాజ్ చేయండి. ఇలా అప్లై చేసిన తర్వాత జుట్టును వేడి టవల్‌తో చుట్టి, సుమారు 30 నిమిషాలు అలాగే ఉంచండి. ఆ తర్వాత తేలికపాటి షాంపూతో జుట్టును కడిగి శుభ్రం చేసుకోండి. ఇలా వారానికి రెండు సార్లు.. మొత్తం ఆరు చేస్తే చాలు.. మీ చుండ్రు సమస్యకు శాశ్వాత పరిష్కారం లభించినట్లే.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..