Natural Beauty Tips: సహజ పద్ధతుల్లో ముఖం, చర్మం కాంతివంతంగా మార్చే సింపుల్ చిట్కాలు తెలుసుకోండి.

Natural Beauty Tips: పుట్టుకతో వచ్చిన రంగు ఏదైనా సరే.. ముఖ వర్చస్సు బాగుండాలని.. ముఖంపై మచ్చలు మొటిమలు లేకుండా అందంగా కనిపించాలని ప్రతి మగువ కోరుకుంటుంది. ముఖం అందంగా..

Natural Beauty Tips: సహజ పద్ధతుల్లో ముఖం, చర్మం కాంతివంతంగా మార్చే సింపుల్ చిట్కాలు తెలుసుకోండి.
Natural Beauty Tips
Follow us
Surya Kala

|

Updated on: Jun 27, 2021 | 11:35 AM

Natural Beauty Tips: పుట్టుకతో వచ్చిన రంగు ఏదైనా సరే.. ముఖ వర్చస్సు బాగుండాలని.. ముఖంపై మచ్చలు మొటిమలు లేకుండా అందంగా కనిపించాలని ప్రతి మగువ కోరుకుంటుంది. ముఖం అందంగా కాంతివంతంగా కనిపించడానికి రసాయన క్రీమ్స్ కంటే సహజమైన పదార్ధాల చిట్కాలు మంచివి. ఈరోజు ఇంట్లో దొరికే వస్తువులతో ఫేస్ కు గ్లో ఇచ్చే సింపుల్ చిట్కాలను గురించి తెలుసుకుందాం

*టాన్ ను తొలగించే గుణం నిమ్మ సొంతం. నిమ్మ, తులసి ఆకుల రసం సమపాళ్ళలో తీసుకుని మిక్స్ చేసుకుని రోజూ రెండుసార్లు ముఖానికి పట్టించండి. అందమైన ముఖం మీ సొంతం. *మీగడలో పసుపు కలిపి రోజూ చర్మానికి రాయండి. పదినిమిషాల తర్వాత నెమ్మదిగా మసాజ్‌ చేయండి.. నిగనిగలాడే చర్మం మీ సొంతం. *పచ్చిపాలలో పసుపు కలిపి దానిలో దూది పింజల్ని నాన బెట్టండి. తర్వాత ఆ పాలు ఫ్రిజ్‌లో ఉంచండి. రోజూ ఒక దూది పింజను తీసుకుని నల్లని చర్మం పై రుద్దుతూ చక్కగా శుభ్రం చేసుకుంటూ ఉండాలి. పచ్చిపాలు,పసుపు మిశ్రమం చర్మంలో నునుపు కలిగించడంతో పాటు నలుపు రంగు క్రమంగా తగ్గుతుంది. *బంగాళాదుంపల రసానికి టాన్ ను తగ్గించే గుణం ఉంది. ఈ రసాన్ని ముఖానికి రాసుకుని అరగంట తర్వాత శుభ్రపరచుకోవాలి. ఇలా . వారానికి రెండు,మూడు సార్లు ఇలా చేయడం వల్ల టాన్‌ తగ్గుతుంది. *శనగపిండి, నెయ్యి, పసుపు పేస్టులా తయారుచేసి చర్మానికి అప్లై చేయాలి. కొంచెం తడిపొడిగా ఉన్న సమయంలో అరచేతితో.. మృదువుగా గుండ్రంగా మసాజ్‌ చేయాలి. ఇలా చేస్తే మీ పొడిబారిన చర్మం పై ఉన్న మురికి తొలగిపోతుంది. శరీరం కాంతి వంతంగా మారుతుంది. *గంధం పొడిని, పసుపు, రోజ్‌వాటర్‌ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేస్తే.. ముఖం కాంతివంతంగా మారుతుంది. *నానబెట్టిన బాదం పప్పుల్ని పచ్చిపాలలో కలిపి పేస్టులా చేయాలి. ఈ పేస్టును ముఖం మీద కనీసం ప్రతిరోజూ ఒక గంటసేపు ఉంచు కోవాలి.రాత్రిపూట దీన్ని రాసుకుని పడుకుని తెల్లవారిన తర్వాత ముఖాన్ని చల్లటి నీటితో శుభ్రం చేసుకుంటే ముఖానికి గ్లో వస్తుంది.

Also read: ఐరెన్ లోపంతో బాధపడుతున్నారా కొబ్బరి స్వీట్ తింటే సరి.. కోనసీమ స్టైల్ లో తయారీ ఎలా అంటే