AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hair Wash Tips: చలికాలంలో మెరిసే జుట్టు కోసం రోజూ తల స్నానం చేయాల్సిన అవసరం లేదు.. ఇది ఎలా అంటే..

చలికాలంలో రోజూ తల స్నానం చేయడం అంతగా సాధ్యం కాదు. ఇలాంటి సమయంలో జుట్టు చెల్లాచెదురుగా, వింతగా మారిపోతోంది. అయితే మీరు కావాలంటే కొన్ని ట్రిక్స్ సహాయంతో మీ జుట్టును కడగకుండా మెరిసేలా చేసుకోవచ్చు..

Hair Wash Tips: చలికాలంలో మెరిసే జుట్టు కోసం రోజూ తల స్నానం చేయాల్సిన అవసరం లేదు.. ఇది ఎలా అంటే..
Shiny Hair In Winter
Sanjay Kasula
|

Updated on: Jan 16, 2023 | 8:32 PM

Share

చలి చంపేస్తోంది. చలి పులి దాటికి జనం వణికిపోతున్నారు. దీని తోడు జలుబు.. ఈ వాతావరణంలో రోజూ స్నానం చేయాలని కూడా అనిపించదు. ఉదయాన్నే ఆఫీసుకు లేదా పనికి వెళుతున్నప్పుడు.. చాలా మంది చలి కారణంగా స్నానానికి దూరంగా ఉంటారు. కానీ రాత్రి ఆలస్యంగా ఇంటికి తిరిగి వచ్చినా.. స్నానం మాత్రం చేయరు. అయితే ఇలాంటి సమయంలో వారి జుట్టు చెల్లాచెదురుగా.. పిచ్చి పిచ్చిగా మారిపోతుంది. మహిళల్లో ఈ సమస్య ఎక్కువ. తల స్నానం చేయడం మహిళలకు పెద్ద సవాలు కంటే తక్కువ కాదు. అయితే ఇలాంటి సమయంలో మీరు చింతించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇవాళ మనం కొన్ని ప్రత్యేక ట్రిక్స్ తీసుకుందాం. దీని సహాయంతో మీరు షాంపూ లేకుండా జుట్టును శుభ్రంగా, మెరిసేలా చేయవచ్చు.. అది ఎలాగో ఇక్కడ తెలుసుకుందాం..

డ్రై షాంపూ జుట్టు మెరిసేలా చేస్తుంది

డ్రై షాంపూ వింటర్ సీజన్‌లో మీ స్నానపు ఒత్తిడిని తొలగిస్తుంది. మీరు జుట్టు శుభ్రం చేయడానికి ఉపయోగించవచ్చు. డ్రై షాంపూ మీ స్కాల్ప్ జిగటను సులభంగా గ్రహిస్తుంది. తడి లేకుండా జుట్టును తాజాగా చేస్తుంది. ఈ ఉత్పత్తి మార్కెట్లో అందుబాటులో ఉంది. మీరు దానిని కొనుగోలు చేసి ఉపయోగించుకోవచ్చు. దీన్ని ఉపయోగించడానికి, ముందుగా మీ జుట్టును పూర్తిగా బ్రష్ చేసి, ఆపై 6 అంగుళాల దూరం నుండి జుట్టు మూలాలపై స్ప్రే చేయండి. ఇది మీ జుట్టు శుభ్రంగా, మెరుస్తూ ఉంటుంది.

బేబీ పౌడర్ జుట్టును మెరిసేలా చేస్తుంది

మీకు వింటర్ సీజన్‌లో తలస్నానం చేయాలని అనిపించకపోతే.. షాంపూ లేకుండా మీ జుట్టును శుభ్రం చేసుకోవాలనుకుంటే.. బేబీ పౌడర్ మీకు సహాయపడుతుంది. ఇది పొడి షాంపూ మాదిరిగానే మీ జుట్టుపై పనిచేస్తుంది. దీన్ని ఉపయోగించే ముందు, జుట్టును తెరిచి, దాని మూలాలపై బేబీ పౌడర్‌ను స్ప్రే చేయండి. ఇలా చేయడం వల్ల జిగురు పోయి జుట్టు నిగనిగలాడుతుంది.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ న్యూస్ కోసం