Small Pocket For Jeans : జీన్స్ ప్యాంట్‌కి ఆ చిన్న పాకెట్ ఎందుకుంటుందో తెలుసా..? దానికో ప్రత్యేక కారణం ఉంది.. అదేంటంటే..!

Small Pocket For Jeans : కొన్నేళ్ల క్రితం జీన్స్ రిచ్‌గా ఉండటానికి సంకేతం. కానీ ఇప్పుడు సాధారణమై పోయింది. ప్రతి

Small Pocket For Jeans : జీన్స్ ప్యాంట్‌కి ఆ చిన్న పాకెట్ ఎందుకుంటుందో తెలుసా..? దానికో ప్రత్యేక కారణం ఉంది.. అదేంటంటే..!
Small Pocket For Jeans

Updated on: Jun 12, 2021 | 2:38 PM

Small Pocket For Jeans : కొన్నేళ్ల క్రితం జీన్స్ రిచ్‌గా ఉండటానికి సంకేతం. కానీ ఇప్పుడు సాధారణమై పోయింది. ప్రతి ఒక్కరు ధరిస్తున్నారు. చిన్న పిల్లల నుంచి మొదలుపెడితే పండు ముదుసలి వరకు వేసుకుంటున్నారు. జీన్స్ ప్యాంట్లు అందరికి సౌకర్యవంతంగా ఉంటాయి. అంతేకాకుండా స్టైలిష్‌గా ఉంటాయి. దీంతో అందరు జీన్స్ వైపు మొగ్గు చూపుతున్నారు. యువత జీన్స్‌ వేసుకోవడానికి చాలా ఇష్టపడతారు. డ్రెస్‌ కొనాలంటే ముందుగా జీన్స్‌కే ప్రాధాన్యమిస్తారు. అందుకే కొన్నేళ్లుగా జీన్స్‌కి ఆదరణ భారీగా పెరిగిపోయింది.

జీన్స్‌లో చాలా రకాలు అందుబాటులోకి వచ్చాయి. అయితే అన్నింట్లోనూ కుడి వైపు జేబులో చిన్న పాకెట్‌ మాత్రం కామన్‌గా ఉంటుంది. దాన్ని ఎందుకు పెట్టారో..? దాని ఉపయోగమేమిటో ఇప్పటికీ చాలా మందికి తెలియదు. కానీ దానికో కారణం ఉంది. అదేమిటంటే 18, 19 శతాబ్దాల్లో ప్రజలు ఎక్కువగా గుర్రాలపై ప్రయాణించేవారు. అందులోనూ పశువుల కాపరులు ఎక్కువగా గుర్రాలపైనే తిరిగేవారు. వారు వాచీలు చేతికి బదులుగా జేబులో పెట్టుకుని తిరిగేవారు. అయితే వాళ్లు గుర్రాలపై స్వారీ చేస్తున్నప్పుడు జేబుపై చేతులు తగిలో.. ఏదైన వస్తువు తగిలో వాచీలు విరిగిపోయేవట. టైం చూసుకోవడానికి జేబులోంచి వాచీ తీస్తున్నప్పుడు కింద పడిపోయేవట. అలా వారి వాచీ భద్రంగా ఉండేలా కుడి జేబులోనే మరో చిన్న జేబును ఏర్పాటు చేశారు.

తర్వాత చైన్‌తో కూడిన వాచీని చిన్న జేబులో పెట్టుకొని బెల్టులకు కట్టుకునేవారట. దీంతో వాచీ కిందపడటం.. విరగడం వంటివి జరిగేది కాదు. అప్పుడు మొదలైన ఈ సంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతోంది. ఇప్పుడు మాత్రం అందరూ వాటిని కీ చైన్స్‌.. ఐపాడ్‌.. విలువైన చిన్న వస్తువులు పెట్టుకోవడానికి సీక్రెట్‌ పాకెట్‌గా వినియోగిస్తున్నారు. నేటి యుగంలో ఇది ఒక ఫ్యాషన్‌గా మారింది. తరచుగా ఒకరి అవసరం మరొకరికి ఫ్యాషన్ అవుతుంది.

Samudrik Shastra : కాలి బొటన వేలు కంటే మధ్యవేలు పొడవుగా ఉంటే ఏం జరుగుతుందో తెలుసా..? మీరు ఊహించలేని నిజాలు..

Exoplanet like Earth: అనంత విశ్వంలో మరో ‘భూమి’ కనిపించింది..మనకు 90 కాంతి సంవత్సరాల దూరంలో..నాసా శాస్త్రవేత్తల ప్రకటన!

Husband Caught His Wife: ప్రియుడితో కలిసి భార్య రాసలీలలు.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న భర్త..!