Monsoon Tips: వర్షాకాలంలో పాదాలను కాపాడుకోవడానికి ఉపయోగపడే ఈ 5 అద్బుతమైన చిట్కాలు మీకోసం..

|

Jul 06, 2022 | 2:21 PM

Monsoon Foot Care Routine: మీ చర్మం, జుట్టుతో పాటు, వర్షాకాలంలో పాదాలకు కూడా ప్రత్యేక శ్రద్ధ అవసరం. తరచుగా వర్షంలో పాదాలు తడిగా ఉంటాయి. దీని కారణంగా ఫంగల్ ఇన్ఫెక్షన్, రింగ్‌వార్మ్, దురద సమస్య పాదాలలో..

Monsoon Tips: వర్షాకాలంలో పాదాలను కాపాడుకోవడానికి ఉపయోగపడే ఈ 5 అద్బుతమైన చిట్కాలు మీకోసం..
Monsoon Foot Care Routine
Follow us on

Foot Care Tips: వర్షాకాలం మొదలైందంటే చాలు ఎన్నో రకాల వ్యాదులు చుట్టుముట్టేస్తుంటాయి. అయితే ఇలాంటి సమస్యల నుంచి బటయపడాలంటే మాత్రం జాగ్రత్తలు తీసుకోవల్సిందే. అయితే.. మీ చర్మం, జుట్టుతో పాటు, వర్షాకాలంలో పాదాలకు కూడా ప్రత్యేక శ్రద్ధ అవసరం. తరచుగా వర్షంలో పాదాలు తడిగా ఉంటాయి. దీని కారణంగా ఫంగల్ ఇన్ఫెక్షన్, రింగ్‌వార్మ్, దురద సమస్య పాదాలలో మొదలవుతుంది. తడి పాదాలు కొన్నిసార్లు చెడు వాసన, అలెర్జీల కారణంగా చర్మం ఎర్రగా మారడం ప్రారంభిస్తుంది. అటువంటి పరిస్థితిలో, మీ ముఖంతో పాటు, మీ పాదాలను కూడా జాగ్రత్తగా చూసుకోండి. పాదాలు అందంగా, శుభ్రంగా ఉండాలంటే, మీరు ఈ మాన్ సూన్ ఫుట్ కేర్ చిట్కాలను తప్పనిసరిగా పాటించాలి.

1- పాదాలను శుభ్రంగా ఉంచుకోండి..

వర్షంలో మీరు మీ పాదాలను కడిగి శుభ్రం చేసి పొడిగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. మీరు ఫంగల్ ఇన్ఫెక్షన్లు, అలెర్జీలను నివారించాలనుకుంటే, పాదాలను ఎల్లప్పుడూ శుభ్రంగా, పొడిగా ఉంచాలి. ధూళి వల్ల పాదాల్లో అనేక రకాల ఇన్ఫెక్షన్లు వస్తాయి. ఆఫీసు నుంచి వచ్చే సమయంలో పాదాలు తడిగా ఉంటే బూట్లు, సాక్స్‌లను తీసివేసిన తర్వాత వెంటనే తేలికపాటి సబ్బు.. వెచ్చని నీటితో పాదాలను కడగాలి. వర్షంలో చెప్పులు లేకుండా నడవటం మానుకోండి.

ఇవి కూడా చదవండి

2-   పాదాలను ఎక్స్‌ఫోలియేట్ చేయండి..

పాదాలను ఎక్స్‌ఫోలియేట్ చేయడం అంటే మీ పాదాలను రుద్దడం వల్ల వాటి డెడ్ స్కిన్ తొలగించబడుతుంది. పాదాలకు స్క్రబ్ చేయడం వల్ల చాలా ఉపశమనం లభిస్తుంది. కావాలంటే పాదాలను గోరువెచ్చని నీటిలో కాసేపు నానబెట్టి తర్వాత స్క్రబ్ చేయండి. ఇది ఒత్తిడిని తగ్గిస్తుంది. నొప్పి, వాపు సమస్యను తగ్గిస్తుంది.

3- మాయిశ్చరైజ్-

పాదాలను ఎండబెట్టిన తర్వాత మంచి ఫుట్ క్రీమ్‌తో పాదాలను మసాజ్ చేయడం వల్ల చర్మం మృదువుగా మారుతుంది. ఇది పగుళ్లు, అలెర్జీలు, డెడ్ సెల్స్‌ను దూరంగా ఉంచడంలో సహాయపడుతుంది. రోజుకు కనీసం రెండుసార్లు మాయిశ్చరైజర్ ఉపయోగించండి. మీకు కావాలంటే, ఏదైనా యాంటీ బాక్టీరియల్ టాల్కమ్ పౌడర్‌ని కూడా ఉపయోగించవచ్చు.

4- బొటనవేలు గోళ్లను కత్తిరించండి-

కాలి గోళ్లను ఎప్పటికప్పుడు కత్తిరించుకోవలి. ఎందుకంటే ఈ వర్షాకాలంలో కాలి గోళ్ల మధ్య పట్టి పేరుకుపోతుంది. ఇది ఫంగల్ ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని పెంచుతుంది. అదే సమయంలో వర్షంలో సెలూన్‌కి వెళ్లడం ద్వారా పాదాలకు చేసే చికిత్సను నివారించండి. ఇది పాదాలలో అనేక రకాల ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని పెంచుతుంది. బదులుగా, సహజమైన పదార్థాలతో ఇంట్లోనే పెడిక్యూర్ చేయించుకోండి.

5- సరైన పాదరక్షల వాడకం- 

మీరు వర్షంలో సరైన పాదరక్షలను ఉపయోగించండి. తడిగా ఉన్నప్పుడు వాటిని పాడవదు. వర్షాకాలంలో మాసిన బూట్లు ధరించడం మానుకోండి. తడిగా ఉన్నప్పుడు ధరించడానికి అసౌకర్యంగా ఉంటాయి. ఇది పాదాలను తడిగా మార్చడమే కాకుండా.. ఫంగల్ ఇన్ఫెక్షన్ ప్రమాదాన్ని పెంచుతుంది. మీరు రబ్బరు బూట్లు, చెప్పులు, ఫ్లిప్-ఫ్లాప్స్, చెప్పులు ధరించవచ్చు.