Fashion company Gucci – Kurta, Shoes: ఇటీవల ఓ ప్రముఖ బ్రాండ్ కంపెనీ చేస్తున్న ప్రకటనలు చూసి అందరూ నివ్వెరపోతున్నారు. అవునండీ.. ఎన్నడూ లేని విధంగా ఓ ఎంబ్రాయిడరీ వేసిన కుర్తాకు రూ.2 లక్షలు.. క్రోక్స్‌లాగా కనిపించే రబ్బరు షూస్‌కు రూ.40 వేలు అంటూ ప్రచారాన్ని ప్రారంభించింది ఇటలీకి చెందిన ప్రముఖ బ్రాండ్ గుచ్చి. ఈ కంపెనీ ప్రకటించిన ఆఫర్లను చూసి.. నెటిజన్లు అవాక్కవుతున్నారు. గుచ్చి కంపెనీ మొదట కుర్తాకు రూ.2 లక్షలు ప్రకటించి విమర్శల పాలైంది.
తాజాగా ఆ బ్రాండ్ రబ్బర్ షూస్‌కు రూ.40 వేలు అని చెప్పడంతో మరిన్ని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పురుషులు, స్త్రీలకు మూడేసి రంగుల్లో ఈ రబ్బర్ షూస్‌ను గుచ్చి లాంచ్ చేసింది. మరో ప్రముఖ బ్రాండ్ క్రోక్స్ ఇలాంటి షూస్‌తో పాపులర్‌గా మారింది. అయితే.. దానిని చూసి ఇప్పుడు గుచ్చి కూడా అచ్చం అలాంటి షూ నే లాంచ్ చేసి.. ఇంత భారీ ధరను నిర్ణయించడం గమనార్హం.
not GUCCI CROCS ???? make it stop pic.twitter.com/EaEJTXCGLR
— Natalie ? (@disco_lem0nade) June 3, 2021
Also read: