Skin Health: చర్మ ఆరోగ్యాన్ని దెబ్బతీసే ఫుడ్‌ ఇవే.. వీటికి దూరంగా ఉండడమే బెటర్‌

ప్రతీ ఒక్కరూ అందమైన చర్మం కావాలని కోరుకుంటారు. అందంగా కనిపించాలని ఎంతో డబ్బు ఖర్చు చేస్తుంటారు. మచ్చలు లేని, బిగుతుగా ఉండే చర్మం ఉండాలని అనుకుంటారు. ఇందుకోసం మార్కెట్లో లభించే రకరకాల బ్యూటీ ప్రొడక్ట్స్‌ను ఉపయోగిస్తుంటారు. అయితే ఎన్ని రకాల బ్యూటీ ప్రొడక్ట్స్‌ను ఉపయోగించినా తీసుకునే ఆహారంలో చేసే కొన్ని తప్పులు చర్మం..

Skin Health: చర్మ ఆరోగ్యాన్ని దెబ్బతీసే ఫుడ్‌ ఇవే.. వీటికి దూరంగా ఉండడమే బెటర్‌
Skin Health
Follow us

|

Updated on: Jun 30, 2024 | 6:51 PM

ప్రతీ ఒక్కరూ అందమైన చర్మం కావాలని కోరుకుంటారు. అందంగా కనిపించాలని ఎంతో డబ్బు ఖర్చు చేస్తుంటారు. మచ్చలు లేని, బిగుతుగా ఉండే చర్మం ఉండాలని అనుకుంటారు. ఇందుకోసం మార్కెట్లో లభించే రకరకాల బ్యూటీ ప్రొడక్ట్స్‌ను ఉపయోగిస్తుంటారు. అయితే ఎన్ని రకాల బ్యూటీ ప్రొడక్ట్స్‌ను ఉపయోగించినా తీసుకునే ఆహారంలో చేసే కొన్ని తప్పులు చర్మం ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ చర్మ ఆరోగ్యాన్ని దెబ్బతీసే ఆ ఆహార పదార్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

* చర్మ ఆరోగ్యాన్ని దెబ్బ తీయడంలో ఉప్పు ప్రధానమైంది. సాధారణంగా ఉప్పు ఎక్కువగా తీసుకుంటే బీపీ, గుండె సంబంధిత వంటి సమస్యలు వస్తాయని మనమంతా అనుకుంటాం. అయితే ఉప్పును అధికంగా తీసుకుంటే చర్మ సమస్యలు కూడా తప్పవని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఉప్పు ఎక్కువగా తీసుకుంటే.. శరీరంలో నీరు పేరుకుపోతుతుంది. ఈ కారణంగా చర్మం ఉబ్బుతుంది. ముఖ్యంగా కళ్ల చుట్టూ వాపు పెరుగుతుంది.

* ఇక వైట్ బ్రెడ్‌ను తీసుకున్నా చర్మ ఆరోగ్యం దెబ్బతింటుందని నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే అధిక గ్లైసెమిక్ ఇండెక్స్ చర్మంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. శరీరంలోని కొల్లాజెన్‌ తగ్గినప్పుడు ముఖం మీద ముడతలు ఏర్పడుతాయి.

* ఆల్కహాల్‌ ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా చర్మం దెబ్బ తింటుంది. మద్యం అధికంగా సేవించే వారిలో డీహైడ్రేషన్‌ సమస్య వేధిస్తుంది. దీనికారణంగా చర్మం పొడిబారుతుంది. అలాగే శరీరంలో ఉండే పోషకాలు కోల్పోతాయి. అందుకే ఆల్కహాల్ తీసుకునే వారిలో చర్మ సంబంధిత సమస్యలు వస్తాయి.

* పాల ఉత్పత్తులు సైతం చర్మంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. ముఖ్యంగా ప్రాసెస్‌ చేసిన చీజ్‌తో పాటు కొన్ని రకాల పాల ఉత్పత్తులు తీసుకోవడం వల్ల శరీరంలో హార్మోన్ల స్థాయిల పెరుగుతాయి. ఇది హార్మోన్ల అసమతుల్యతకు దారి తీస్తాయి. ఈ కారణంగా ముఖంపై జిడ్డు పెరిగి, మొటిమలు వచ్చే అవకాశం ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని లైఫ్‌ స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..