సైనస్(Sinus).. కాలంతో సంబంధం లేకుండా వేధించే సమస్య ఇది. దీని కారణంగా కలిగే ఇబ్బందిని మాటల్లో చెప్పలేం. తల నొప్పి, ముక్కు కారడం, గొంతు నొప్పి, తుమ్ములు నరకం చూపిస్తుంటాయి. చలికాలంలో ఈ సమస్య అధికంగా ఉంటుందనుకుంటే పొరపాటే. ఎందుకంటే కాలాలతో (Health) సంబంధం లేకుండా ఈ వ్యాధి ఇప్పుడు ప్రతి ఒక్కరినీ వేధిస్తోంది. సైనస్ ను నిర్లక్ష్యం చేస్తే అది బ్రైన్ ఫీవర్‌కు దారి తీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కళ్ల దగ్గర, ముక్కు పక్క భాగంలో ఎముకలలో ఉండే సన్నని ప్రాంతాన్ని సైనస్ అంటారు. ఇందులో మెత్తటి పొర ఉంటుంది. ఇది ద్రవ పదార్థాన్ని తయారు చేస్తుంది. శ్వాస తీసుకున్నప్పుడు శరీరానికి కావాల్సిన ఉష్ణోగ్రత, తేమ ఇస్తుంది. ఈ భాగంలో ఇన్‌ఫెక్షన్లు సోకితే దానిని సైనసైటిస్ అంటారు. సైనసైటిస్ సమస్యకు చాలా కారణాలు ఉంటాయి. బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్, వైరస్, ఫంగస్ ఇన్‌ఫెక్షన్లు, ముక్కులో ఎముక పెరుగుదల, అలర్జీ, వాతావరణ మార్పులు, జలుబు, గొంతునొప్పి వంటి కారణాల వల్ల సైనస్ వచ్చే అవకాశం ఉంది. ఇన్ఫెక్షన్లు, అలర్జీలు సైనస్‌లలో ఒత్తిడిని కలిగిస్తాయి. కాబట్టి ప్రతి రెండు గంటలకు ఒకసారి ముక్కును శుభ్రం చేసుకోవాలి. ఇలా చేస్తే సైనసైటిస్ లక్షణాలను తగ్గించవచ్చు.
శరీరానికి ఎక్కించే సెలైన్ లను వాసన చూస్తే ముక్కు రంధ్రాలు క్లియర్ అవుతాయని ఓ నివేదికలో వెల్లడించింది. నీటిలో ఉప్పు, బేకింగ్ సోడా వేసి ఆ ద్రవాన్ని వాసన చూసినా మంచి ఫలితం ఉంటుంది. ఇలా రోజుకు రెండు నుంచి మూడు సార్లు చేస్తే సైనస్ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. ఆవిరి పట్టడం అనేది పాత పద్ధతే అయినా అది అద్భుతంగా పని చేస్తుంది. ఒక గిన్నెలో నీటిని మరిగించి, ఆ నీటిలో కాస్త యూకలిప్టస్ ఆయిల్ వేసి ఆవిరి పట్టాలి. సైనస్ బారిన పడకుండా కాపాడాలనుకోవాలనుకుంటే ఎక్కువ నీరు తాగాలి. సైనస్ ఇబ్బందిని తగ్గించుకోవడానికి గోరువెచ్చని నీటిని తాగాలి. విశ్రాంతి తీసుకున్నా మంచి రిలీఫ్ ఉంటుంది. ప్రశాంతంగా నిద్రపోతే త్వరగా కోలుకుంటారు.
నోట్.. ఈ కథనంలో పేర్కొన్న విషయాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. వీటిని పాటించే ముందు నిపుణులను సంప్రదించడం ఉత్తమం.
మరిన్ని హెల్త్ వార్తల కోసం చూడండి..