White Hair: 20 ఏళ్లకే తెల్లబడుతున్న జుట్టు.. యువతలోనే అధికం.. కారణాలేంటో తెలుసా..

|

Feb 15, 2023 | 10:00 AM

జుట్టు బ్లాక్ కలర్ లో ఉంటేనే అందంగా ఉంటామని భావిస్తుంటారు. ఒక్క తెల్ల వెంట్రుక వచ్చినా కంగారు పడిపోయే వారు చాలా మందే ఉన్నారు. చాలా మంది తెల్ల జుట్టు వస్తే ముసలి వాళ్లు అయిపోయామని ఫీలయిపోతుంటారు...

White Hair: 20 ఏళ్లకే తెల్లబడుతున్న జుట్టు.. యువతలోనే అధికం.. కారణాలేంటో తెలుసా..
White Hair
Follow us on

జుట్టు బ్లాక్ కలర్ లో ఉంటేనే అందంగా ఉంటామని భావిస్తుంటారు. ఒక్క తెల్ల వెంట్రుక వచ్చినా కంగారు పడిపోయే వారు చాలా మందే ఉన్నారు. చాలా మంది తెల్ల జుట్టు వస్తే ముసలి వాళ్లు అయిపోయామని ఫీలయిపోతుంటారు. అయితే.. ఈ సమస్య ఇప్పుడు యువతలోనూ అధికమైంది. నిండా ఇరవై ఏళ్లు కూడా నిండకపోతే.. జుట్టు తెల్లబడిపోతోంది. ఇప్పుడు ఇది చాలా సాధారణ సమస్యగా మారిపోయింది. అయితే జుట్టు తెల్లబడటానికి చాలా కారణాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. కొందరికి జన్యుసంబంధమైన కారణాల వల్ల తెల్ల జుట్టు రావచ్చు. పోషకాలు, హార్మోన్​లలో అసమతుల్యత కారణంగానూ.. ఈ సమస్య వచ్చే అవకాశం ఉంది. జుట్టుకు రసాయనాలను వాడటం, పొల్యూషన్ వల్ల జుట్టు పాడవటం వంటివి చేయడం వల్ల తెల్లజుట్టు వస్తుంది. స్మోకింగ్ చేసినా జుట్టు తెల్లబడుతుందని హెచ్చరిస్తున్నారు నిపుణులు.

ఒత్తిడి, నిద్రలేమి, ఆందోళన, ఆకలి మందగించడం వంటి సమస్యల కారణంగానూ జుట్టు నెరసిపోతుంది. అంతే కాకుండా జుట్టు రాలిపోయే అవకాశం కూడా ఉంది. శరీరంలో అవసరమైన విటమిన్లు లేకపోవడం జుట్టు ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది. పోషకాల లోపాన్ని తీర్చడానికి గుడ్లు, డైరీ ఉత్పత్తులు, మాంసం వంటి ముఖ్యమైన ఆహారాలను తీసుకోవాలి. పొగతాగే అలవాటు చర్మం, జుట్టు ఆరోగ్యానికి కూడా హానికరం. సిగరెట్లలో ఉండే టాక్సిన్స్ వెంట్రుకల కుదుళ్లను దెబ్బతీస్తాయి. దీంతో జుట్టు తెల్లబడుతుంది.

రసాయనాలు అధికంగా ఉండే ఉత్పత్తులను ఉపయోగించడం వల్ల కూడా జుట్టు తెల్లబడుతుంది. హెయిర్​ ప్రొడక్ట్​లలో ఉండే సల్ఫేట్​లు కొన్ని ప్రయోజనాలను చేకూర్చినప్పటికీ వీటివల్ల జుట్టు పొడిబారి త్వరగా పాడయిపోయేలా చేస్తాయి. హెయిర్ స్టైల్ వల్ల వెంట్రుకలు డ్యామేజ్ అవుతూ ఉంటాయి. ఈ చికిత్సలు తరచుగా చేయించుకోవడం వల్ల జుట్టు తెల్లబడే ప్రమాదం ఉంది. కాబట్టి వీటికి దూరంగా ఉండటం చాలా అవసరం.

ఇవి కూడా చదవండి

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి