Smart Phones: మీ ఫోన్ డిస్ ప్లే పగిలిపోయిందా.. డోంట్ వర్రీ.. ఈ టిప్స్ పాటిస్తే ఎంతో హ్యాపీ

ప్రపంచంలో పెన్నూ పేపర్ ను ముఖ్యమైన సాధనాలుగా ఉపయోగించిన రోజులు పోయాయి. ఎప్పుడైతే అరచేతిలో స్మార్ట్ ఫోన్ వచ్చి చేరిందో అప్పటి నుంచి అంతా డిజిటల్ మయమైపోయింది. చిన్నా పెద్దా ఆడా...

Smart Phones: మీ ఫోన్ డిస్ ప్లే పగిలిపోయిందా.. డోంట్ వర్రీ.. ఈ టిప్స్ పాటిస్తే ఎంతో హ్యాపీ
Phone Display
Follow us

|

Updated on: Nov 27, 2022 | 6:46 AM

ప్రపంచంలో పెన్నూ పేపర్ ను ముఖ్యమైన సాధనాలుగా ఉపయోగించిన రోజులు పోయాయి. ఎప్పుడైతే అరచేతిలో స్మార్ట్ ఫోన్ వచ్చి చేరిందో అప్పటి నుంచి అంతా డిజిటల్ మయమైపోయింది. చిన్నా పెద్దా ఆడా మగా అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఫోన్లకు అతుక్కుపోతున్నారు. అన్ లిమిటెడ్ డేటా, వైఫై సదుపాయాలతో వినియోగం ఆకాశమే హద్దుగా చెలరేగిపోతోంది. సెల్ ఫోన్లు మన జీవితంలో ఎంతగా భాగమై పోయాయంటే వాటిని విడిచి క్షణం కూడా ఉండలేకపోతున్నాం. అంతగా వాటికి అడిక్ట్ అయిపోయాం. అయితే మనం ఎంత జాగ్రత్తగా ఫోన్ ను చూసుకున్నా.. కొన్ని కొన్ని సార్లు అనుకోని కారణాలు, తప్పిదాల వల్ల సెల్ ఫోన్లు కింద పడిపోతుంటాయి. అలాంటప్పుడు ఫోన్లకు డ్యామెజ్ అవుతుంది. అయితే.. ఫోన్ స్క్రీన్, డిస్ ప్లే పగిలిపోయినా ఈ చిట్కాలను పాటించడం ద్వారా మళ్లీ మునుపటిలా మార్చుకోవచ్చు.

సిలికాన్ కవర్లు: సిలికాన్ కవర్లు రూ.100 నుంచి రూ.200 మధ్య మార్కెట్‌లో సులభంగా లభిస్తాయి. ఇది సాఫ్ట్‌గా ఉండటమే కాకుండా చాలా ఫ్లెక్సిబుల్‌గా ఉంటుంది. స్మార్ట్‌ఫోన్ బాడీకి రక్షణ అందిస్తుంది. ఈ రకమైన కవర్ స్మార్ట్‌ఫోన్‌ను సురక్షితంగా ఉంచేందుకు సహాయపడుతుంది.

అయస్కాంత కవర్లు: అయస్కాంత కవర్లు కొంచెం ఖరీదైనవి అయినప్పటికీ అవి స్మార్ట్‌ఫోన్ కు పూర్తి రక్షణను అందిస్తాయి. వీటిని స్మార్ట్‌ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేయడం చాలా సులభం. మాగ్నెటిక్ కవర్ ధర రూ.500 నుంచి రూ.1500 వరకు ఉంటుంది.

ఇవి కూడా చదవండి

లెదర్ కవర్: లెదర్ కవర్లు చాలా బలంగా ఉంటాయి. లెదర్ కవర్లు కొనుగోలుదారులకు అనుకూలమైనవి. దీని ధర రూ. 100 నుంచి రూ. 500 వరకు ఉంటుంది. కవర్ స్మార్ట్‌ఫోన్‌ను పుస్తకంలా కవర్ చేస్తుంది. పరికరాన్ని దుమ్ము నుంచి కూడా కాపాడుతుంది.

5D టెంపర్డ్ గ్లాస్: 5డి టెంపర్డ్ గ్లాసెస్ ఈ రోజుల్లో సర్వసాధారణంగా మారాయి. అయినప్పటికీ వాటి ధర సాధారణ టెంపర్డ్ గ్లాసెస్ కంటే కొంచెం ఎక్కువ. కస్టమర్లు 5డి టెంపర్డ్ గ్లాస్‌ను రూ. 200 నుంచి రూ. 500 వరకు కొనుగోలు చేస్తున్నారు. ఈ రకమైన గ్లాస్ స్మార్ట్‌ఫోన్ డిస్‌ప్లేను అద్భుతంగా రక్షిస్తుంది. స్మార్ట్‌ఫోన్ కిందకు పడిపోయినా స్క్రీన్ కు నష్టం వాటిల్లకుండా కాపాడుతుంది.

ఆర్మర్ కవర్: ఆర్మర్ కవర్లను హార్డ్ ప్లాస్టిక్ నుంచి తయారు చేస్తారు. స్మార్ట్‌ఫోన్ నేలపై పడినప్పుడు, దానిపై ఒక్క గీత కూడా పడకుండా సురక్షితంగా ఉంచడానికి ఇవి ఉపయోగపడతాయి. మార్కెట్‌లో వీటి ధర రూ.100 నుంచి రూ.400 వరకు ఉంటుంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి