AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips: సాయంత్రం వేళ వ్యాయాయం, ఎక్సర్ సైజ్ చేయవచ్చా.. నిపుణుల సలహా ఏమిటంటే..?

సాయంత్రం వేళల్లో వ్యాయామం చేయడం మంచి ఎంపిక. ఈ సమయంలో వ్యాయామం చేయడానికి చాలా సమయం లభిస్తుంది. ఈ సమయంలో ఆఫీసుకు వెళ్లాలి అనే ఆలోచన లేదా ఇతర పని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం ఉండదు. అటువంటి పరిస్థితిలో ఎవరైనా సరే సాయత్రం వ్యాయామం చేయడం వల్ల పూర్తి ప్రయోజనం పొందుతారు.

Health Tips: సాయంత్రం వేళ వ్యాయాయం, ఎక్సర్ సైజ్ చేయవచ్చా.. నిపుణుల సలహా ఏమిటంటే..?
Exercise In Evening
Surya Kala
|

Updated on: Jun 03, 2024 | 12:20 PM

Share

ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండటానికి, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ముఖ్యం. దీనివల్ల బరువు అదుపులో ఉండటమే కాదు.. వ్యాధుల ముప్పును కూడా తగ్గిస్తుంది. వ్యాయామం చేయడం ద్వారా శారీరకంగా, మానసికంగా చురుకుగా ఉంటారు. అయితే ప్రస్తుతం బిజీ లైఫ్ స్టైల్ వల్ల వర్కవుట్ చేయడానికి సమయం దొరకడం కొంచెం కష్టంగా మారింది. ఉదయం మాత్రమే వ్యాయామం చేయాలని కొందరు నమ్ముతారు. ఉదయాన్నే వ్యాయామం చేయడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని విశ్వాసం. అయితే సాయంత్రం పూట వ్యాయామం చేయడం ద్వారా కూడా మిమ్మల్ని మీరు ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉంచుకోవచ్చని మీకు తెలుసా..! సాయంత్రం సమయంలో వ్యాయామం చేయడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఈ రోజు తెలుసుకుందాం…

ఏ సమయం బెస్ట్ అంటే.. సాయంత్రం వేళల్లో వ్యాయామం చేయడం మంచి ఎంపిక. ఈ సమయంలో వ్యాయామం చేయడానికి చాలా సమయం లభిస్తుంది. ఈ సమయంలో ఆఫీసుకు వెళ్లాలి అనే ఆలోచన లేదా ఇతర పని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం ఉండదు. అటువంటి పరిస్థితిలో ఎవరైనా సరే సాయత్రం వ్యాయామం చేయడం వల్ల పూర్తి ప్రయోజనం పొందుతారు.

బలం పెరుగుతుంది.. ఉదయం వ్యాయామం చేసే సమయంలో శరీరం వేడెక్కాలి అంటే ముందు వార్మప్ ను చేయాలి. నిద్ర లేచిన తర్వాత శరీరంలోని శక్తి స్థాయి మొత్తం తగ్గిపోతుంది. అయితే మీరు సాయంత్రం సమయంలో వ్యాయామం చేస్తే అప్పుడు శరీరం వేడెక్కాల్సిన అవసరం లేదు. దీనితో మీరు మెరుగైన పద్ధతిలో వ్యాయామం చేయవచ్చు. శరీరంలో బలం కూడా ఉంటుంది.

ఇవి కూడా చదవండి

ఒత్తిడి దూరమవుతుంది.. వ్యాయామం అతిపెద్ద ప్రయోజనం ఏమిటంటే అది శారీరక ఒత్తిడిని తగ్గిస్తుంది. ప్రస్తుతం చాలా మంది తమ బిజీ లైఫ్‌స్టైల్‌లో ఒత్తిడికి గురవుతున్నారు. సాయంత్రం వేళల్లో వ్యాయామం చేయడం వల్ల ఆ రోజు అలసట, ఒత్తిడి దూరమవుతాయి. వ్యాయామం ఒత్తిడి హార్మోన్లను తగ్గిస్తుంది. ఇది మీకు మరింత రిలాక్స్‌ని ఇస్తుంది.

నిద్ర లేమిని దూరం చేస్తుంది.. రాత్రి సముయంలో సరిగ్గా నిద్రపోలేకపోతే.. సాయంత్రం వ్యాయామం చేయండి. ఇలా చేయడం మీ ఆరోగ్యానికి మేలు చేయడమే కాకుండా మీ నిద్రను మెరుగుపరుస్తుంది. సాయంత్రం వ్యాయామం చేస్తే.. కండరాలు రిలాక్స్‌గా ఉంటాయి. అంతేకాదు సాయంత్రం పని చేయడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..