AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Benefits of Body Massage: బాడీ మసాజ్‌ ఎందుకు, ఎవరికీ అవసరం..? తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు

రోజూ మనం బాడీ మసాజ్ అలవాటు చేసుకుంటే.. ఎన్నో అనారోగ్య ‌సమస్యలను రాకుండా ముందే అడ్డుకోగలం అంటున్నారు. రెగ్యూలర్ మార్నింగ్ వాక్ తరువాత ఈ రెగ్యూలర్ బాడీ మసాజ్ ఉంటే ఎన్నో విధాలుగా ఆరోగ్యానికి మేలు చేస్తుంది. బాడీ మసాజ్ వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఒకటి, రెండు కాదు.. ఏకంగా 25 రకాల లాభాలు ఉన్నాయని వైద్యులు, నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా బాడీ మసాజ్ వలన..

Benefits of Body Massage: బాడీ మసాజ్‌ ఎందుకు, ఎవరికీ అవసరం..? తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు
Body Massage
Rakesh Reddy Ch
| Edited By: Jyothi Gadda|

Updated on: Mar 28, 2024 | 7:35 AM

Share

వయసు యాభై దాటితే మీ దినచర్యలో బాడీ మసాజ్ ఓ పనిగా పెట్టుకోవాలంటున్నారు ఆరోగ్య నిపుణులు. 45, 50 దాటితే శరీరం లోపల ఉండే భాగాల ఎదుగుదల ఆగిపోయి అరుగుదల క్రమంగా మొదలవుతుంది. ఫలితంగా పని సామర్థ్యం తగ్గి కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, మెడ నొప్పులు, బ్యాక్ పెయిన్ వంటి రుగ్మతలు వేధిస్తుంటాయి. వీటికి చెక్ పెట్టాలంటే రెగ్యులర్ బాడీ మసాజ్ చాలా అవసరం. ఇందుకోసం మన ఇంట్లోనే రోజూ ఉదయం స్నానం చేయడానికి ఓ అరగంట ముందు 10-15 నిమిషాల పాము మనకు మనంగా బాడీ మసాజ్ చేసుకుంటే సరిపోతుంది. బాడీ పెయిన్స్‌ మరీ ఎక్కువగా ఉంటే ఫిజియోథెరపీ వంటివి తప్పవు. బాడీ మసాజ్‌తో ఒళ్లు నొప్పులు రాకుండా ఉంటాయి. ముందే ఒంటి నొప్పులతో ఇబ్బంది పడుతున్నట్టయితే అవి తగ్గిపోతాయంటున్నారు. ఇంట్లోనే బాడీ మసాజ్‌ ఎలా చేసుకోవాలి.. మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలేంటో కూడా తెలుసుకుందాం..

ఇంట్లోనే బాడీ మసాజ్‌ చేసుకోవాలి అనుకునే వారు కొబ్బరి నూనె లేదా బాదం నూనెను ఉపయోగించవచ్చు. ఉదయం స్నానానికి వెళ్ళేముందు ఓ పది పదిహేను నిమిషాల పాటు ఆయిల్‌తో బాడీ మసాజ్ క్రమం తప్పకుండా చేసుకుంటే..చక్కటి ఫలితం ఉంటుంది. ఇందుకోసం కావాలంటే మంచి ఆయుర్వేద పెయిన్ రిలీఫ్ ఆయిల్ వాడినా మంచి ఫలితాలే వస్తాయి. మసాజ్‌ కోసం కావాల్సిన ఆయిల్‌ తీసుకుని మన చేతి వేళ్ళతోనే రాపిడి ప్రెషర్ తో ఒళ్ళంతా పట్టించాలి. ఓ పది నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి. రోజూ క్రమం తప్పకుండా ఇలా చేస్తూ ఉంటే ఒళ్లు నొప్పులు మన దరి చేరవంటున్నారు. ఆరోగ్యంగా ఉండొచ్చు. బాడీ పెయిన్స్‌ విషయంలో ముందే జాగ్రత్త పడటం చాలా అవసరం అంటున్నారు నిపుణులు. లేదంటే ఆ తర్వాత వైద్యం కోసం, ఫిజియోథెరపీ మెడిసిన్లు అంటూ ఆస్పత్రుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. ఇలాంటి జాయింట్‌ పెయిన్స్‌, బాడీ పెయిన్స్ మరింత తీవ్రమైతే వేలకు వేలు పెట్టి ఖరీదైన సర్జరీలు, టెన్షన్లు తప్పవని నిపుణులు సూచిస్తున్నారు.

వేధిస్తున్న ఒళ్లు నొప్పుల సమస్యతో ఇబ్బంది పడుతున్న వారు అనేక మంది ఉన్నారు. కాబట్టి రోజూ మనం బాడీ మసాజ్ అలవాటు చేసుకుంటే.. ఎన్నో అనారోగ్య ‌సమస్యలను రాకుండా ముందే అడ్డుకోగలం అంటున్నారు. రెగ్యూలర్ మార్నింగ్ వాక్ తరువాత ఈ రెగ్యూలర్ బాడీ మసాజ్ ఉంటే ఎన్నో విధాలుగా ఆరోగ్యానికి మేలు చేస్తుంది. బాడీ మసాజ్ వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఒకటి, రెండు కాదు.. ఏకంగా 25 రకాల లాభాలు ఉన్నాయని వైద్యులు, నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా బాడీ మసాజ్ వలన రక్తప్రసరణ బాగా మెరుగవుతుంది. ఇది ఆరోగ్యానికి చాలా అవసరం. ఇంకా.. లో బ్లడ్ ప్రెషర్ ను నియంత్రిస్తుంది. ఒత్తిడిని బాగా తగ్గిస్తుంది. మజిల్స్ టెన్షన్ ని తగ్గిస్తాయి. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. బాడీ పెయిన్స్ రాకుండా ఉంటాయి. ఒకవేళ ఉన్నవారిలో తగ్గిపోతాయి, లైఫ్ స్టైల్ నాణ్యత పెరుగుతుంది. ఇలా అనేక ప్రయోజనాలు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది… ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..