వ్యాధుల పద్మవ్యూహం.. నగర యువత ఆయుష్షు గాలిలో దీపం..!

జీవనశైలి వ్యాధుల పద్మవ్యూహంలో చిక్కుకుంటోన్న నగర యువత ఆయుష్ఫు గాలిలో దీపంలో మారుతోంది. ఇటీవల మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌ పట్టణంలో హెల్త్ సర్వే నిర్వహించారు. ఈ సర్వేలో తేలిన విషయాలు చూసి అటు ఆరోగ్య నిపుణులు, ఇటు ప్రభుత్వ యంత్రాంగం షాక్‌కు గురైయ్యింది. 18 నుంచి 30 ఏళ్ల మధ్య వయసున్న ప్రతి నలుగురు యువకుల్లో ఒకరు ప్రీ-డయాబెటిక్ దశలో ఉన్నట్లు తేలింది. అలాగే 40 శాతం మంది యువకులు అధిక కొలెస్ట్రాల్ బారినపడినట్లు ఆ సర్వేలో తేలింది.

వ్యాధుల పద్మవ్యూహం.. నగర యువత ఆయుష్షు గాలిలో దీపం..!
Lifestyle Diseases

Edited By: Ravi Panangapalli

Updated on: Jul 01, 2024 | 8:49 AM

డయాబెటీస్.. అధిక కొలెస్ట్రాల్.. ఇప్పుడు యావత్ ప్రపంచాన్ని ఇవి గడగడలాడిస్తున్నాయి. మరీ ముఖ్యంగా ఆధునిక జీవనశైలికి అలవాటుపడిన నగరాలలో ఇవి ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. ఇన్ ఫ్రంట్ దేరీజ్ క్రోకోడైల్ ఫెస్టివల్ అన్న రీతిలో డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయి. దీనికి సంబంధించిన ఓ తాజా సమగ్ర హెల్త్ సర్వేలో వెన్నులో వణుకుపుట్టించే షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. నగరవాసులు.. మరీ ముఖ్యంగా యువకులు డయాబెటీస్, అధిక కొలెస్ట్రాల్ పద్మవ్యూహంలో చిక్కుకుపోతున్నట్లు గణాంకాలు తేటతెల్లం చేస్తున్నాయి. ఆధునిక జీవనశైలి శాపంగా మారి నగర యువకులు వ్యాధుల బారినపడుతున్నారు. ఈ వ్యాధులతో పట్టణ యువత ఓ రకంగా పెద్ద యుద్ధమే చేయాల్సిన పరిస్థితి నెలకొంటోంది. డయాబెటీస్ వంటి వ్యాధులకు సంబంధించి ఇప్పటి వరకు మనం వింటున్న గణాంకాలు ఓ ఎత్తైతే.. అసలు గణాంకాలు గుండె దడ పుట్టించే స్థాయిలో ఉన్నట్లు తాజా అధ్యయనాల్లో తేలాయి. పట్టణ యువత ఆయుష్షును గాలిలో దీపంలా మారుస్తున్న ఈ జీవనశైలి వ్యాధులను గెలవాలంటే.. వారి ఆధునిక జీవన విధానంలో సమూల మార్పులు తప్పనిసరిగా నిపుణులు హెచ్చరిస్తున్నారు. నేరుగా విషయంలోకి వస్తే.. ఇటీవల మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌ పట్టణంలో హెల్త్ సర్వే నిర్వహించారు. ఈ సర్వేలో తేలిన విషయాలు చూసి అటు ఆరోగ్య నిపుణులు, ఇటు ప్రభుత్వ యంత్రాంగం షాక్‌కు గురైయ్యింది. 18 నుంచి 30 ఏళ్ల మధ్య వయసున్న ప్రతి నలుగురు యువకుల్లో ఒకరు ప్రీ-డయాబెటిక్ దశలో ఉన్నట్లు తేలింది. అలాగే 40...

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి