Elderly Sleeping Problems: వృద్ధుల్లో సరైన నిద్ర ఎందుకు ఉండదు.. అమెరికా పరిశోధకుల అధ్యయనంలో కీలక విషయాలు

మన ఆరోగ్యంపై నిద్ర కీలక పాత్ర పోషిస్తుంది. ప్రతి మనిషికి సరైన నిద్ర ఉంటేనే ఆరోగ్యంగా ఉంటాడు. అందుకే సరైన నిద్ర అవసరమని వైద్యులు పదేపదే సూచిస్తుంటారు. ఇక వయసు పెరిగిన వారిలో సరైన నిద్ర ఉండదు. అందుకు కారణం లేకపోలేదు..

Elderly Sleeping Problems: వృద్ధుల్లో సరైన నిద్ర ఎందుకు ఉండదు.. అమెరికా పరిశోధకుల అధ్యయనంలో కీలక విషయాలు
Elderly Sleeping Problems

Updated on: May 30, 2023 | 7:00 AM

మన ఆరోగ్యంపై నిద్ర కీలక పాత్ర పోషిస్తుంది. ప్రతి మనిషికి సరైన నిద్ర ఉంటేనే ఆరోగ్యంగా ఉంటాడు. అందుకే సరైన నిద్ర అవసరమని వైద్యులు పదేపదే సూచిస్తుంటారు. ఇక వయసు పెరిగిన వారిలో సరైన నిద్ర ఉండదు. అందుకు కారణం లేకపోలేదు. ఇలాంటి సమస్య ఎక్కువ వృద్ధుల్లో ఉంటుంది. ఇటీవల దీనిపై అమెరికా శాస్త్రవేత్తలు అధ్యయనం చేపట్టారు. అధ్యయనంలో పలు కీలక విషయాలు వెల్లడయ్యాయి. అమెరికాలోని స్టాన్‌ఫోర్డ్ యూనివర్శిటీకి చెందిన శాస్త్రవేత్తలు పరిశోధనలు చేసి, ఒక వ్యక్తి నిద్ర-మేల్కొనే స్థితిని నియంత్రించే మెదడులోని భాగం వయస్సుతో ఎలా బలహీనపడుతుందో గుర్తించారు.

వృద్ధాప్యంలో నిద్రలేమి సమస్య:

వృద్ధాప్యంలో నిద్ర లేమి సమస్యను గుర్తించడానికి అమెరికన్ శాస్త్రవేత్తలు ఎలుకలపై ప్రయోగాలు చేశారు. ఇందుకోసం ఎలుకల రెండు బృందాలను చేశారు. మొదటి సమూహంలో 3 నుంచి 5 నెలల వయస్సు, రెండవ సమూహం 18 నుండి 22 నెలల వయస్సు గల ఎలుకలు ఉన్నాయి. మెదడులోని న్యూరాన్లు కాంతిని ఉపయోగించి ప్రేరేపించారు. దీని తర్వాత ఇమేజింగ్ టెక్నిక్‌లతో మెదడును పరిశీలించారు. విచారణలో పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. చిన్న ఎలుకల కంటే పెద్ద ఎలుకలు 38 శాతం ఎక్కువ హైపోక్రెటిన్‌లను కోల్పోయాయని నివేదిక వెల్లడించింది.

నిద్రలేమి సమస్యను అధిగమించేందుకు..

పరిశోధన ఫలితాల సహాయంతో నిద్రలేమి సమస్యను అధిగమించేందుకు మెరుగైన ఔషధాలను సిద్ధం చేయవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. వయస్సుతో ఔషధాల తగ్గుదల ప్రభావాన్ని నియంత్రించవచ్చు. వృద్ధులలో నిద్రలేమి సమస్యను ఎలా అధిగమించాలి అనే విషయాలను కొనుగోన్నారు శాస్త్రవేత్తలు. పరిశోధకుడు లూయిస్ డి లెసియా మాట్లాడుతూ.. 65 ఏళ్లు పైబడిన వృద్ధులకు సరైన నిద్ర రాదని చెప్పారు. మనిషి నిద్ర కూడా అధిక రక్తపోటు, గుండెపోటు, మధుమేహం, డిప్రెషన్ వంటి వ్యాధులకు దారితీస్తుందని గుర్తించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి