గుడ్డు ఆరోగ్యానికి మేలు చేస్తుందనే సంగతి అందరికీ తెలుసు. ప్రతి ఒక్కరూ గుడ్లు తినమని వైద్యులు కూడా సలహా ఇస్తారు. గుడ్డులో ప్రొటీన్లు, మినరల్స్, విటమిన్లు ఉంటాయి. అందువల్ల గుడ్లను పోషక ఆహారంలో చేర్చారు. గుడ్లు రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి సహాయపడతాయి. ఇది ఎముకలను బలంగా ఉంచుతుంది. చర్మం, జుట్టు ఆరోగ్యంగా ఉంచడంలో గుడ్డు సహాయపడుతుంది.
ఆరోగ్యానికి మేలు చేసే పోషకాలు గుడ్డులో ఉన్నప్పటికీ అందరూ వీటిని తినడం అంత మంచిది కాదు. ముఖ్యంగా అధిక యూరిక్ యాసిడ్‌తో బాధపడేవారికి గుడ్లు తినడం హానికరం అంటున్నారు ఆరోగ్య నిపుణులు. గుడ్డులో ప్రొటీన్ ఉన్నందున ఈ ప్రొటీన్ వల్ల యూరిక్ యాసిడ్ విడుదలవుతుంది. కాబట్టి యూరిక్ యాసిడ్ సమస్య మరింత పెరిగే అవకాశం ఉంది. అలాగే గుడ్డులోని పచ్చసొనలో కొలెస్ట్రాల్ గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది. కాబట్టి యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉన్న వారు గుడ్లు తినకూడదని ఆరోగ్య నిపుణులు సలహా ఇస్తున్నారు.
డయాబెటిస్ ఉన్నవారు గుడ్డు తినడం మంచిదని అనుకుంటారు. మధుమేహ వ్యాధిగ్రస్తులు తమ ఆహారంలో గుడ్డును చేర్చుకుంటారు. గుడ్డులో కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి. అయితే మధుమేహం ఉన్నవారు గుడ్లు అధికంగా తినకూడదు. ఎందుకంటే గుడ్డులో ఉండే పచ్చసొనలో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిని పెంచే అవకాశం ఉంది. అందువల్లనే వీరు గుడ్లు ఎక్కువగా తినకూడదు.
గుడ్లు ఎక్కువగా తినడం వల్ల కొలెస్ట్రాల్ పెరుగుతుంది. కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నవారు గుడ్డులోని తెల్లసొన మాత్రమే తినాలి. తప్ప పచ్చసొన తినకూడదు. గుడ్డు పచ్చసొనలో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండటం వల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉంది. అందువల్ల కొలెస్ట్రాల్ ప్రమాదాన్ని సృష్టించకుండా ఉంగాలంటే గుడ్లు ఎక్కువగా తినకూడదు.
మరిన్ని ఆరోగ్య సంబంధిత కథనాల కోసం క్లిక్ చేయండి.