ముఖంపై ముడతలను మాయం చేసే కొబ్బరి నూనె.. ఇలా వాడితే యవ్వనంగా మారిపోతారు..!

|

Oct 15, 2023 | 12:24 PM

కొబ్బరినూనె, పసుపులో చర్మానికి మేలు చేసే అనేక గుణాలు ఉన్నాయి. వీటిలో ఉండే యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు చర్మంపై ముడతలు, మచ్చలను తొలగించడమే కాకుండా ఇతర ప్రయోజనాలను కూడా అందిస్తాయి. దీన్ని అప్లై చేయడానికి, ఒక చెంచా కొబ్బరి నూనెలో ఒక చెంచా పసుపు కలపండి. రాత్రి పడుకునే ముందు చర్మానికి రాసుకోవాలి. ఇలా చేయడం వల్ల మీకు లాభాలు కనిపిస్తాయి.

ముఖంపై ముడతలను మాయం చేసే కొబ్బరి నూనె.. ఇలా వాడితే యవ్వనంగా మారిపోతారు..!
Coconut Oil For Wrinkles Re
Follow us on

ప్రతి ఒక్కరూ తమ జీవితాంతం యవ్వనంగా కనిపించాలని కోరుకుంటారు. అయితే వయసు పెరిగే కొద్దీ ముఖ చర్మంపై వృద్ధాప్య సంకేతాలు కనిపించడం ప్రారంభిస్తాయి. ముడతలు, పిగ్మెంటేషన్, ఫైన్ లైన్స్ పెరుగుతున్న వయస్సును సూచిస్తాయి. ఖరీదైన బ్యూటీ ప్రొడక్ట్స్ తో బ్యూటీ కేర్ చేసినా ప్రయోజనం ఉండదు.. మీ చర్మంపై ముడతలు, గీతలు కనిపిస్తున్నట్టయితే.. కొన్ని ఇంటి నివారణ చిట్కాలు పాటిస్తే ప్రయోజనం ఉంటుంది. ఇందుకోసం మీరు కొబ్బరి నూనె హోం రెమెడీతో వాటిని తొలగించవచ్చు. కొబ్బరి నూనె చర్మానికి చాలా మేలు చేస్తుంది. ఇందులో పసుపు కలిపి అప్లై చేయడం వల్ల ముడతల సమస్య నుంచి బయటపడవచ్చు. దాని ఉపయోగం గురించి ఇక్కడ తెలుసుకుందాం..

ముడుతలకు కొబ్బరినూనె, పసుపు:

చర్మంపై మచ్చలు, ముడతలు రూపాన్ని పాడు చేస్తాయి. అటువంటి పరిస్థితిలో వాటిని వదిలించుకోవటం చాలా ముఖ్యం. వయసు పెరిగే కొద్దీ ముడతల సమస్య ఉంటే కొబ్బరినూనెలో పసుపు కలిపి చర్మానికి రాసుకోవచ్చు. దీంతో ముడతల సమస్యను దూరం చేసుకోవచ్చు. ఇలా క్రమం తప్పకుండా చర్మంపై అప్లై చేసిన వారం రోజుల్లోనే దీని ప్రభావం కనిపిస్తుంది.

ఇవి కూడా చదవండి

కొబ్బరినూనె, పసుపును అప్లై చేసే విధానం:

కొబ్బరినూనె, పసుపులో చర్మానికి మేలు చేసే అనేక గుణాలు ఉన్నాయి. వీటిలో ఉండే యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు చర్మంపై ముడతలు, మచ్చలను తొలగించడమే కాకుండా ఇతర ప్రయోజనాలను కూడా అందిస్తాయి. దీన్ని అప్లై చేయడానికి, ఒక చెంచా కొబ్బరి నూనెలో ఒక చెంచా పసుపు కలపండి. రాత్రి పడుకునే ముందు చర్మానికి రాసుకోవాలి. ఇలా చేయడం వల్ల మీకు లాభాలు కనిపిస్తాయి.

పసుపు కాకుండా అనేక విధాలుగా ముడుతలను తొలగించడానికి మీరు కొబ్బరి నూనెను కూడా ఉపయోగించవచ్చు. దీని కోసం, కొబ్బరి నూనె, తేనె, కొబ్బరి నూనె, ఆపిల్ వెనిగర్ కూడా ఉపయోగించవచ్చు. వీటి ద్వారా కూడా మీరు మంచి ఫలితాలను పొందుతారు.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి…