Get Rid of UTI: యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు..

|

Mar 29, 2024 | 2:11 PM

ప్రస్తుత కాలంలో చాలా మంది మహిళలు యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ల బారిన పడుతున్నారు. మారిన జీవన విధానం, ఆహారపు అలవాట్ల కారణంగా ఈ సమస్య తీవ్రమవుతుంది. ఈ సమస్య ఒక్కసారి వచ్చిందంటే.. మళ్లీ మళ్లీ వస్తూనే ఉంటుంది. కాబట్టి సరైనజాగ్రత్తలు తీసుకోవడం అవసరం. అయితే మీ డైట్‌లో కొన్ని మార్పులు చేసుకోవడం వల్ల ఈ ఇన్ ఫెక్షన్ల నుంచి బయట పడొచ్చు. అలాగే ఎండ వేడి నుంచి కూడా బయట పడొచ్చు. సమ్మర్‌లో ఎక్కువగా లభించే వాటిల్లో పుచ్చ కాయ..

Get Rid of UTI: యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు..
Get Rid Of Uti Problem
Follow us on

ప్రస్తుత కాలంలో చాలా మంది మహిళలు యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ల బారిన పడుతున్నారు. మారిన జీవన విధానం, ఆహారపు అలవాట్ల కారణంగా ఈ సమస్య తీవ్రమవుతుంది. ఈ సమస్య ఒక్కసారి వచ్చిందంటే.. మళ్లీ మళ్లీ వస్తూనే ఉంటుంది. కాబట్టి సరైనజాగ్రత్తలు తీసుకోవడం అవసరం. అయితే మీ డైట్‌లో కొన్ని మార్పులు చేసుకోవడం వల్ల ఈ ఇన్ ఫెక్షన్ల నుంచి బయట పడొచ్చు. అలాగే ఎండ వేడి నుంచి కూడా బయట పడొచ్చు. సమ్మర్‌లో ఎక్కువగా లభించే వాటిల్లో పుచ్చ కాయ కూడా ఒకటి. పుచ్చకాయ శరీరాన్ని చల్లబరుస్తుంది. కాబట్టి పుచ్చకాయ తినడం వల్ల యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ నుంచి బయట పడొచ్చు.

ఎందుకు వస్తుంది?

ఈ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్.. నీటిని తక్కువగా తీసుకోవడం వల్ల వస్తుంది. శరీరంలో నీటి పరిమాణం తక్కువగా ఉంటే ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి నీటిని ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. పుచ్చకాయలో పోషకాలతో పాటు నీటి శాతం అధికంగా ఉంటుంది. కాబట్టి ఇది తింటే శరీరానికి చల్లదనం వస్తుంది. పుచ్చకాయను సలాడ్స్ లేదా జ్యూస్ రూపంలో ఎలా తీసుకున్నా మంచిదే.

పుచ్చకాయలో పోషకాలు:

శాచ్యురేటట్ ఫ్యాట్, సోడియం, పొటాషియం, కార్బోహైడ్రేట్స్, డైటరీ ఫ్యాట్, నేచురల్ షుగర్స్, ప్రోటీన్, ఫైబర్, విటమిన్ సి, ఐరన్, విటమిన్ బి6, మెగ్నీషియం, యాంటీ ఆక్సిడెంట్లు లభిస్తాయి.

ఇవి కూడా చదవండి

అనేక ప్రయోజనాలు..

మహిళలకు యూటీఐ సమస్య వచ్చినప్పుడు.. యూరిన్‌లో బ్యాక్టీరియా అనేది పెరుగుతుంది. దీని వల్ల వైట్ డిశ్చార్జ్ అవ్వడం, కడుపులో నొప్పి, నడుము నొప్పి, కాళ్లు, చేతులు లాగడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. పుచ్చకాయ తినడం వల్ల.. యూరిన్‌లోని బ్యాక్టీరియా బయటకు పోతాయి. పుచ్చకాయను తినడం వల్ల కేవలం యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షనే కాకుండా.. ఇతర ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. శరీరాన్ని డీహైడ్రేషన్ కాకుండా చేస్తుంది. జుట్టుని, చర్మాన్ని తేమగా ఉంటుంది. అలాగే పుచ్చకాయలోని పోషకాలు.. జుట్టును బలంగా ఉంచేలా చేస్తాయి. చర్మంపై మొటిమలు, ముడతలు రాకుండా చేస్తుంది. పుచ్చకాయ తింటే ఈజీగా వెయిట్ లాస్ అవ్వొచ్చు. పలు రకాల క్యాన్సర్లు రాకుండా చేస్తుంది. గుండె పనితీరును కూడా మెరుగు పరుస్తుంది.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..