AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health: కూరగాయలు తింటే దురద, మలబద్ధకం సమస్యలా.. ఈ గింజలు చేర్చితే అంతా సెట్

ఆరోగ్యంపై ప్రజల్లో ఇప్పుడిప్పుడే అవగాహన పెరుగుతోంది. కొన్ని ఆహారాలు తీసుకున్నప్పుడు శరీరంలో కొన్ని సమస్యలు తలెత్తుతాయి. ఈ కారణంగా వాటిని తినడం మానేస్తుంటారు. అయితే, కూరగాయలను సరిగ్గా ఎలా తీసుకుంటే మంచిదో వైద్యులు చెబుతున్నారు. ఆమె తెలిపిన వివరాల ప్రకారం, ఏ కూరగాయలను ఎలా తీసుకుంటే ఆరోగ్యంగా ఉండగలమంటే..

Health: కూరగాయలు తింటే దురద, మలబద్ధకం సమస్యలా.. ఈ గింజలు చేర్చితే అంతా సెట్
Vegetable Causes Constipation Tips
Bhavani
|

Updated on: Jul 16, 2025 | 6:33 PM

Share

ఆరోగ్యంపై ప్రజల్లో ఇప్పుడిప్పుడే అవగాహన పెరుగుతోంది. కొన్ని ఆహారాలు తీసుకున్నప్పుడు శరీరంలో కొన్ని సమస్యలు తలెత్తుతాయి. ఈ కారణంగా వాటిని తినడం మానేస్తుంటారు. అయితే, కూరగాయలను సరిగ్గా ఎలా తీసుకుంటే మంచిదో వైద్యులు చెబుతున్నారు. ఆమె తెలిపిన వివరాల ప్రకారం, ఏ కూరగాయలను ఎలా తీసుకుంటే ఆరోగ్యంగా ఉండగలమంటే..

క్యాబేజీ, కాలీఫ్లవర్, బ్రకోలీ:

ఈ రకం కూరగాయలు తిన్నప్పుడు వాత దోషం పెరిగి, శరీరంలో గ్యాస్ వస్తుంది. దీనివల్ల ఇబ్బందిగా ఉంటుంది. ఇలా కాకుండా ఉండాలంటే వంటలో కొద్దిగా వాము వేయాలి. దీని వల్ల గ్యాస్ పేరుకుపోదు, తేలికగా జీర్ణమవుతుంది.

పాలకూర:

ఐరన్ అధికంగా ఉన్న కూరగాయల్లో పాలకూర ఒకటి. అయితే, ఇందులోని ఆక్సలేట్స్ ఐరన్‌ను శరీరం గ్రహించుకోకుండా చేస్తాయి. అలాంటప్పుడు కొద్దిగా నిమ్మరసం లేక నల్ల మిరియాల పొడి వేయాలి. దీనివల్ల ఐరన్ శరీరం తేలికగా తీసుకుంటుంది. పాలకూర తిన్నాక బరువుగా కూడా అనిపించదు.

వంకాయలు:

వంకాయలు తిన్నప్పుడు కొంతమందికి దురద, చర్మ సమస్యలు వస్తాయి. పిత్త దోషం ఉన్నవారికి ఈ సమస్యలు ఎక్కువగా ఉంటాయి. అలాంటి వారు వంట చేసేటప్పుడు కొద్దిగా మెంతులు వేయాలి. దీని వల్ల ఇన్‌ఫ్లమేషన్ తగ్గుతుంది. రక్తం కూడా శుభ్రపడుతుంది. అందుకే వండినప్పుడు మెంతులను లేక మెంతుల పొడి వేయడం మంచిది.

దుంపలు:

బంగాళాదుంపలు, చామదుంపలు కొంతమంది ఇష్టంగా తింటారు. ముఖ్యంగా బంగాళాదుంపలను ఎక్కువమంది ఇష్టపడతారు. అయితే, వీటిని తినడం వల్ల కొంతమందికి మలబద్ధకం లాంటి సమస్యలు రావచ్చు. ఈ సమస్యను దూరం చేయడానికి వంటలో ఆవాలు లేక ఆవ పొడి వేయడం మంచిది. దీని వల్ల కూరల రుచి కూడా అలాగే ఉంటుంది.

కాకరకాయలు:

కాకరకాయలు వండినప్పుడు చాలా పొడిగా, చేదుగా అనిపిస్తాయి. దీనిని బ్యాలెన్స్ చేయడానికి కూరలో కొద్దిగా కొబ్బరి పొడి లేక నువ్వుల పొడి వేయాలి. దీంతో కూర రుచి పెరుగుతుంది. వాత శరీరానికి కూడా ఇది మంచిది. చాలా రుచిగా కూడా ఉంటుంది.

సోరకాయ:

సోరకాయను రాత్రుళ్లు తిన్నా లేక పచ్చిగా తిన్నా శరీరం చల్లగా మారుతుంది. చలిగా ఉన్నట్లు అనిపిస్తుంది. అలాంటప్పుడు కొద్దిగా నల్ల మిరియాలను కలపాలి. దీని వల్ల శరీరంలో వేడి పెరుగుతుంది. నల్ల మిరియాలను అలాగే వేయవచ్చు, లేక పొడి చేసి కూడా వేయవచ్చు.