Uric Acid: ఈ కూరగాయలు తింటే యూరిక్ యాసిడ్‌ కంట్రోల్ అవ్వాల్సిందే.. డోంట్ మిస్!

|

May 17, 2024 | 3:40 PM

ప్రస్తుతం ఎందరో ఇబ్బంది పడే సమస్యల్లో యూరిక్ యాసిడ్ సమస్య కూడా ఒకటి. శరీరంలో యూరిక్ యాసిడ్ లెవల్స్ పరిమాణం ఎక్కువ అవడం వల్ల ఈ సమస్య వస్తుంది. ఈ సమస్య వల్ల చేతులు, కాళ్లు నొప్పులుగా ఉంటుంది. కిడ్నీలు యూరిక్ యాసిడ్‌ను సమర్థవంతంగా తొలగించ లేనప్పుడు శరీరంలో ఈ స్థాయిలు పెరుగుతాయి. యూరిక్ యాసిడ్ అనేది శరీరం సహజంగా విసర్జించే వ్యర్థ పదార్థాల్లో ఒకటి. ఆహార పదార్థాల్లోని ప్యూరిన్ అనే రసాయనం..

Uric Acid: ఈ కూరగాయలు తింటే యూరిక్ యాసిడ్‌ కంట్రోల్ అవ్వాల్సిందే.. డోంట్ మిస్!
Uric Acid
Follow us on

ప్రస్తుతం ఎందరో ఇబ్బంది పడే సమస్యల్లో యూరిక్ యాసిడ్ సమస్య కూడా ఒకటి. శరీరంలో యూరిక్ యాసిడ్ లెవల్స్ పరిమాణం ఎక్కువ అవడం వల్ల ఈ సమస్య వస్తుంది. ఈ సమస్య వల్ల చేతులు, కాళ్లు నొప్పులుగా ఉంటుంది. కిడ్నీలు యూరిక్ యాసిడ్‌ను సమర్థవంతంగా తొలగించ లేనప్పుడు శరీరంలో ఈ స్థాయిలు పెరుగుతాయి. యూరిక్ యాసిడ్ అనేది శరీరం సహజంగా విసర్జించే వ్యర్థ పదార్థాల్లో ఒకటి. ఆహార పదార్థాల్లోని ప్యూరిన్ అనే రసాయనం విచ్ఛిన్నం అయినప్పుడు యూరిక్ యాసిడ్ ఏర్పడుతుంది. ఇది ఎప్పటికప్పుడు మూత్రం ద్వారా బయటకు వెళ్లిపోవాలి. అలా వెళ్లకపోతే శరీరంలోని కీళ్లు చుట్టూ పేరుకుపోతుంది. దీంతో మోకాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులు, డయాబెటీస్, క్యాన్సర్, కడుపులో మంట, కిడ్నీ, గుండె సమస్యల వంటివి తలెత్తుతాయి. ఈ యూరిక్ యాసిడ్ లెవల్స్‌ను తినే కూరగాయలతో కూడా తగ్గించుకోవచ్చు. అవేంటో ఇప్పుడు చూద్దాం.

టమాటా:

టమాటాలో లైకోపీన్ ఉంటుంది. ఇది శరీరంలో ఉన్న యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గిస్తుంది. టమాటా అందరి ఇళ్లలో కూడా అందుబాటులో ఉంటుంది. టమాటాలో వివిధ రకాల ఆహారాలు తయారు చేసుకుని తినవచ్చు. ఇందులో విటమిన్ సి కూడా ఉంటుంది. దీంతో శరీరంలో ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది.

పర్వాల్:

పర్వాల్‌తో కూడా యూరిక్ యాసిడ్‌ను తగ్గించుకోవచ్చు. అయితే ఇది అన్నీ సీజన్లలో దొరికే కూరగాయ కాదు. మీకు లభ్యమైనప్పుడు మాత్రం ఖచ్చితంగా కొనుగోలు చేసి తినండి. ఈ కూరగాయ తింటే.. శరీరంలో యూరిక్ యసిడ్ లెవల్స్ అనేవి తగ్గుతాయి.

ఇవి కూడా చదవండి

బూడిద గుమ్మడి కాయ:

బూడిద గుమ్మడి కాయలో ప్యూరిక్ ఎక్కువగా లభిస్తుంది. కాబట్టి ఇది తీసుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. బూడిద గుమ్మడి కాయ తినడం వల్ల యూరిక్ యాసిడ్ లెవల్స్‌ను కూడా తగ్గించుకోవచ్చు. అంతే కాకుండా శరీరంలో ఇమ్యూనిటీని కూడా పెంచుతుంది.

మష్రూమ్స్:

పుట్ట గొడుగులను చాలా మంది ఎంతో ఇష్టంగా కలిపి తింటారు. యూరిక్ యాసిడ్ సమస్యలు ఉన్నవారు.. మష్రూమ్స్ తింటే చాలా కంట్రోల్ అవుతుంది. ఇందులో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. కాబట్టి పుట్టగొడుగులు కూడా మీ డైట్‌లో చేర్చుకోండి.

కీర దోసకాయ:

కీర దోశ తినడం వల్ల కూడా చాలా మంచిది. ఇందులో నీటి శాతం కూడా అధికంగా ఉంటుంది. కీర దోశ తినడం వల్ల యూరిక్ యాసిడ్ సమస్య చాలా తగ్గిపోతుంది.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..