AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Interesting Facts: గుడ్డుతో కలిపి ఈ ఆహారాలు తీసుకుంటే అంతే సంగతులు.. బీ కేర్‌ఫుల్!

గుడ్లు పోషకాహార ఫుడ్. ప్రతి రోజూ ఉడికించిన ఒక కోడి గుడ్డు తీసుకుంటే ఎన్నో పోషకాలు అందుతాయి. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ముఖ్యంగా చిన్న పిల్లలకు ఇవ్వడం చాలా మంచిది. గుడ్డులో ప్రోటీన్, క్యాల్షియం, ఫైబర్, విటమిన్లు అనేవి పుష్కలంగా ఉంటాయి. గుడ్డు తినడం వల్ల శరీరానికి రోగ నిరోధక శక్తి అందుతుంది. మెదడు చురుగ్గా పని చేస్తుంది. శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను కూడా తగ్గించి.. గుడ్ కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది. వెయిట్ లాస్ అయ్యేందుకు..

Interesting Facts: గుడ్డుతో కలిపి ఈ ఆహారాలు తీసుకుంటే అంతే సంగతులు.. బీ కేర్‌ఫుల్!
గుడ్లు అధిక నాణ్యత గల ప్రోటీన్‌ను కలిగి ఉంటాయి. సిస్టీన్ వంటి అమైనో ఆమ్లాలను కలిగి ఉంటాయి. కాబట్టి ఆల్కహాల్ తాగేటప్పుడు కోడిగుడ్లను తినడం వల్ల ఆల్కహాల్ వల్ల విడుదలయ్యే విషపూరితమైన ఎసిటాల్డిహైడ్‌ను విచ్ఛిన్నం చేయడంలో కోడిగుడ్డులోని అమైనో ఆమ్లాలు సహాయపడతాయి. అలాగే కాలేయాన్ని కాపాడతాయి. హాంగోవర్ల తీవ్రతను తగ్గిస్తాయి.
Chinni Enni
|

Updated on: May 17, 2024 | 3:06 PM

Share

గుడ్లు పోషకాహార ఫుడ్. ప్రతి రోజూ ఉడికించిన ఒక కోడి గుడ్డు తీసుకుంటే ఎన్నో పోషకాలు అందుతాయి. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ముఖ్యంగా చిన్న పిల్లలకు ఇవ్వడం చాలా మంచిది. గుడ్డులో ప్రోటీన్, క్యాల్షియం, ఫైబర్, విటమిన్లు అనేవి పుష్కలంగా ఉంటాయి. గుడ్డు తినడం వల్ల శరీరానికి రోగ నిరోధక శక్తి అందుతుంది. మెదడు చురుగ్గా పని చేస్తుంది. శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను కూడా తగ్గించి.. గుడ్ కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది. వెయిట్ లాస్ అయ్యేందుకు కూడా సహకరిస్తుంది. గుడ్డుతో ఒక్కటేంటి.. చాలా ప్రయోజనాలే ఉన్నాయి. అయితే గుడ్డుతో కలిపి కొన్ని రకాల ఆహారాలు అస్సలు కలిపి తీసుకోకూడదట. వీటి వల్ల జీర్ణ వ్యవస్థ దెబ్బతినడమే కాకుండా.. లేని పోని అనారోగ్య సమస్యలు వస్తాయి. మరి ఆ ఫుడ్ కాంబినేషన్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

కోడి గుడ్డు – మాంసం:

మాంసంతో కలిపి గుడ్డు తినకూడదు. చాలా మంది చికెన్, ఫిష్, మటన్‌తో కలిపి గుడ్డు కూడా తింటూ ఉంటారు. బిర్యానీ వంటి వాటితో కూడా గుడ్డు తింటారు. ఈ ఫుడ్ కాంబినేషన్స్ తినడం వల్ల.. జీర్ణ సమస్యలు వస్తాయి. అజీర్తి, గ్యాస్, కడుపులో మంట, ఉబ్బరం వంటి సమస్యల్ని ఎదుర్కొనాల్సి ఉంటుంది.

అరటి పండు – గుడ్డు:

అరటి పండు అంటే చాలా మందికి ఇష్టం. ఇందులో అనేక రకాల పోషకాలు ఉంటాయి. చాలా మంది ఉదయం బ్రేక్ ఫాస్ట్‌లో అరటి పండు, గుడ్డు కలిపి తింటారు. ఈ రెండూ తినేటప్పుడు చాలా జాగ్రత్త వహించాలి. ఒకటి తిన్న మరో గంటకు తినవచ్చు కానీ.. రెండూ ఒకేసారి కలిపి తీసుకోకూడదు. అరటి పండు, గుడ్డుతో కలిపి పాన్ కేక్స్ వంటివి చేస్తారు. అలా తినడం వల్ల కూడా జీర్ణ సమస్యలు తలెత్తవచ్చు.

ఇవి కూడా చదవండి

టీ – గుడ్డు:

ప్రతి రోజూ ఉదయం టీ తాగుతూ ఉంటారు. బ్రేక్ ఫాస్ట్‌లో గుడ్డ తినే అలవాటు ఉంటుంది. అయితే ఈ రెండూ కలిపి తీసుకోవడం వల్ల కడుపు సంబంధిత వ్యాధులు, అసిడిటీ, కడుపులో నొప్పి సమస్యలకు దారి తీస్తుంది.

చక్కెర – గుడ్డు:

అదే విధంగా చక్కెర – గుడ్డు కాంబినేషన్ వల్ల సమస్యలు రావచ్చు. ఈ రెండూ కలిపి కూడా తీసుకోకూడదు. గుడ్డు కలిపి తీసుకోవడం వల్ల ప్రోటీన్ స్ట్రక్చర్ పూర్తిగా మారిపోతుంది. అందుకే ఎట్టి పరిస్థితుల్లో గుడ్డు, చక్కెర కలిపి తీసుకోకూడదు.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
చిరంజీవి భార్య సురేఖకు కీలక బాధ్యతలు అప్పగించిన తెలంగాణ సర్కార్
చిరంజీవి భార్య సురేఖకు కీలక బాధ్యతలు అప్పగించిన తెలంగాణ సర్కార్
చేపలు ఇష్టంగా తింటున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!
చేపలు ఇష్టంగా తింటున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!
నందిని రెడ్డి ఫోన్‌లో సమంత పేరుని ఏమని సేవ్ చేసుకుందో తెలుసా?
నందిని రెడ్డి ఫోన్‌లో సమంత పేరుని ఏమని సేవ్ చేసుకుందో తెలుసా?
గేమర్ల కోసం సరికొత్త హైపర్‌ఎక్స్ కస్టమైజబుల్ మౌస్
గేమర్ల కోసం సరికొత్త హైపర్‌ఎక్స్ కస్టమైజబుల్ మౌస్
కడుపులో ఉబ్బరం, అజీర్తి వేధిస్తున్నాయా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి
కడుపులో ఉబ్బరం, అజీర్తి వేధిస్తున్నాయా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి
నీళ్లలో ఇది కలిపి స్నానం చేయండి.. నెగటివ్ ఎనర్జీ మాయం
నీళ్లలో ఇది కలిపి స్నానం చేయండి.. నెగటివ్ ఎనర్జీ మాయం
స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి ఫైర్‌‌ బోల్ట్‌.. టార్గెట్‌ ఎవరంటే
స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి ఫైర్‌‌ బోల్ట్‌.. టార్గెట్‌ ఎవరంటే
సినిమాల వల్ల నాకు రూపాయి లాభం లేదు..
సినిమాల వల్ల నాకు రూపాయి లాభం లేదు..
కాకులు మనుషుల్ని గుర్తుపడతాయా? మతిపోయే నిజాలు చెబుతున్న సైన్స్!
కాకులు మనుషుల్ని గుర్తుపడతాయా? మతిపోయే నిజాలు చెబుతున్న సైన్స్!
టాలీవుడ్‌కి గుడ్ బై చెప్పేసిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.?
టాలీవుడ్‌కి గుడ్ బై చెప్పేసిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.?