Same Food Problems: డైలీ ఒకే రకమైన ఫుడ్ తింటున్నారా? అయితే సమస్యలతో సావాసమే..!

|

Mar 13, 2023 | 4:00 PM

కొంతమంది రోటీన్ ఫుడ్ నుంచి తప్పించుకోడానికి భోజనాన్ని కూడా స్కిప్ చేసేస్తూ ఉంటారు. అయితే వైద్య నిపుణులు మాత్రం డైలీ ఒకేరకమైన ఆహారం తీసుకంటే చాలా ఆరోగ్య సమస్యలు వస్తాయని పేర్కొంటున్నారు. ముఖ్యంగా పోషకాహార లోపం, పేగు సమస్యలు వంటివి వేధిస్తాయని చెబుతున్నారు.

Same Food Problems: డైలీ ఒకే రకమైన ఫుడ్ తింటున్నారా? అయితే సమస్యలతో సావాసమే..!
Follow us on

అన్నం..మితంగా తింటే ఆహారం అమితంగా తింటే విషం అని కొంత మంది చెబుతూ ఉంటారు. ఎందుకంటే శరీరానికి అవసరమయ్యే పోషకాలను మనం ఆహారం ద్వారానే అందించాల్సి ఉంటుంది. అయితే కొంత మంది ఉదయమే టిఫిన్ గానీ, మధ్యాహ్నం, రాత్రి సమయాల్లో భోజనం ఒక లాంటివే తీసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా కొంత మంది ఉదయమే ఇడ్లీ మాత్రమే తింటారు. మరికొంతమంది రాత్రి సమయంలో కేవలం చపాతీపై ఆధారపడతారు. అలాగే మధ్యాహ్నం భోజనం సమయంలో కూడా రోటీన్ కూరలే ఉంటాయి. కొంతమంది రోటీన్ ఫుడ్ నుంచి తప్పించుకోడానికి భోజనాన్ని కూడా స్కిప్ చేసేస్తూ ఉంటారు. అయితే వైద్య నిపుణులు మాత్రం డైలీ ఒకేరకమైన ఆహారం తీసుకంటే చాలా ఆరోగ్య సమస్యలు వస్తాయని పేర్కొంటున్నారు. ముఖ్యంగా పోషకాహార లోపం, పేగు సమస్యలు వంటివి వేధిస్తాయని చెబుతున్నారు. కాబట్టి ప్రతిరోజూ రోటీన్ ఆహారం లేకుండా తీసుకోవాలని సూచిస్తున్నారు. అయితే డైలీ ఒకే రకమైన ఆహారం తీసుకుంటే వచ్చే ఆరోగ్య సమస్యలు ఏంటో ఓ సారి తెలుసుకుందాం.

పేలవమైన పేగు ఆరోగ్యం

ప్రతిరోజూ విభిన్నమైన ఆహారం తీసుకున్నప్పుడు మీకు పేగులకు వివిధ బ్యాక్టిరియాలను పొందుతుంది. ఇది చాలా మంచి ఆరోగ్య లక్షణం. ఒకే రకమైన ఆహారం తీసుకుంటే మైక్రోబయోమ్‌కు కొత్త బ్యాక్టీరియాను అనుభవించే అవకాశాన్ని ఇవ్వడం లేదు. అంటే మీరు తరచుగా అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా మీరు అనారోగ్యకరమైన ఆహారాన్ని నిరంతరం తింటుంటే, మీ గట్ మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచడానికి సరైన బ్యాక్టీరియా ద్వారా సైక్లింగ్ చేసే అవకాశం కూడా తక్కువగా ఉంటుంది. దీంతో జీర్ణ సంబంధిత సమస్యలు వేధిస్తాయి. కాబట్టి కచ్చితంగా డైలీ ఒకే రకమైన ఆహారం తీసుకోకూడదని నిపుణులు సూచిస్తున్నారు.

విటమిన్ లోపాలు

ఆహారం ద్వారా మనం శరీరానికి అవసరమయ్యే విటమిన్లు అందించాల్సి ఉంటుంది. ప్రతిరోజూ ఒకే రకమైన ఆహారం తీసుకోవడం వల్ల ఇది సాధ్యం కాకపోవచ్చు. ముఖ్యంగా విటమిన్ల లోపం వల్ల గుండె, ఎముకల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుంది. మీరు ప్రతిరోజూ తినే ఆహారాన్ని మార్చడం ద్వారా, మీ శరీరం మీకు అవసరమైన అన్ని విటమిన్‌లను కనీస సప్లిమెంటేషన్‌తో పొందుతున్నట్లు మీరు నిర్ధారించుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

పోషకాలను కోల్పోవడం

మీరు డైలీ ఒకేరకమైన భోజనం చేయడం వల్ల మీకు ప్రతిరోజూ అవసరమైన విటమిన్‌లను అందకుండా చేస్తుంది. ముఖ్యంగా ప్రోటీన్, ఫైబర్ వంటి ఇతర పోషకాలను కూడా అందకుండా చేస్తాయి. శరీరంలో అన్ని కణాలను ఆరోగ్యంగా ఉంచడానికి, కొత్త కణాలను సృష్టించడానికి, రక్తంలో చక్కెరను నియంత్రించడానికి ఫైబర్ అవసరం. అయితే తరచూ ఒకే రకమైన ఆహారం తీసుకోవడం వల్ల ఆహారం నుంచి పొందే ఇతర పోషకాలు కార్బోహైడ్రేట్లు, కొవ్వు కొల్పోతాం. కాబట్టి ఆరోగ్యంగా ఉండడాని ఆహార మార్పును నిపుణులు సూచిస్తున్నారు. 

ప్రతిరోజూ విభిన్నమైన ఆహారాల తినడం వల్ల శరీరానికి అవసరమైన అన్ని పోషకాహారాలు లభిస్తాయి. ఇది కడుపు, మెదడును సంతృప్తికరంగా ఉంచుతాయి. వివిధ రకాల ఆరోగ్యకరమైన ఆహారాలను సిద్ధం చేయడం వల్ల మీ శరీరాన్ని అనేక విధాలుగా ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. ముఖ్యంగా భోజన సమయం ఆసక్తికరంగా ఉంటుంది. 

నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..