Soaked Rice: నానబెట్టిన బియ్యాన్ని వండటం వల్ల మంచి నిద్ర వస్తుందట..

|

Aug 09, 2024 | 6:24 PM

భారత దేశంలో ఎక్కువగా బియ్యాన్నే ఆహారంగా తీసుకుంటారు. చాలా మంది మూడు పూటలా అన్నం తినే వాళ్లు ఉన్నారు. బియ్యాన్ని మితంగానే ఆహారంగా తీసుకోవాలి. పాలిష్ పెట్టిన బియ్యాన్ని తింటున్నారు. దీని వల్ల షుగర్ వంటి వ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అదే విధంగా అన్నం తినడం వల్ల కొన్ని లాభాలు కూడా చాలా ఉన్నాయి. అయితే మీరు అన్నాన్ని ఎలా వండుతున్నారు? అనేది కూడా ముఖ్యమని నిపుణులు అంటున్నారు. అరగంట లేదా గంట సేపు బియ్యాన్ని..

Soaked Rice: నానబెట్టిన బియ్యాన్ని వండటం వల్ల మంచి నిద్ర వస్తుందట..
Soaked Rice
Follow us on

భారత దేశంలో ఎక్కువగా బియ్యాన్నే ఆహారంగా తీసుకుంటారు. చాలా మంది మూడు పూటలా అన్నం తినే వాళ్లు ఉన్నారు. బియ్యాన్ని మితంగానే ఆహారంగా తీసుకోవాలి. పాలిష్ పెట్టిన బియ్యాన్ని తింటున్నారు. దీని వల్ల షుగర్ వంటి వ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అదే విధంగా అన్నం తినడం వల్ల కొన్ని లాభాలు కూడా చాలా ఉన్నాయి. అయితే మీరు అన్నాన్ని ఎలా వండుతున్నారు? అనేది కూడా ముఖ్యమని నిపుణులు అంటున్నారు. అరగంట లేదా గంట సేపు బియ్యాన్ని కడిగి నానబెట్టి అన్నాన్ని వండటం వల్ల చాలా మంచిది. పూర్వం అమ్మమ్మల కాలం నుంచి ఇదే పద్దతిని కొనసాగించే వారు. ఇలా బియ్యాన్ని నానబెట్టి వండటం వల్ల అన్నం కూడా త్వరగా ఉడుకుతుంది. అన్నం కూడా అవుతుందని అంటారు. అంతే కాకుండా చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయట. మరి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

షుగర్ లెవల్స్ తగ్గుతాయి:

డయాబెటీస్ పేషెంట్స్ అన్నం తినకూడదు. దీని వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అనేవి పెరుగుతాయి. కానీ బియ్యాన్ని నానబెట్టి తినడం వల్ల రక్తంలో షుగర్ లెవల్స్ అనేవి తగ్గుతాయి ఎందుకంటే బియ్యాన్ని నీళ్లలో నానబెట్టడం వల్ల గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది తగ్గుతుంది. దీంతో షుగర్ లెవల్స్ అనేవి పెరగవు.

పోషకాలు అందుతాయి:

బియ్యంలో శరీరానికి అవసరమయ్యే పోషకాలు కూడా ఉంటాయి. బియ్యాన్ని కడిగి నీటిలో నానబెట్టి అన్నాన్ని వండటం వల్ల పోషకాలు అనేవి శరీరానికి చక్కగా అందుతాయి. దీని వల్ల పోషకాలు అనేవి వృథా కాకుండా ఉండవు.

ఇవి కూడా చదవండి

మంచి నిద్ర పడుతుంది:

నానబెట్టిన బియ్యం వండి తినడం వల్ల మంచి నిద్ర కూడా పడుతుంది. నిజానికి బియ్యంలో గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇది నిద్రను చెడగొడుతుంది. కానీ బియ్యాన్ని నానబెట్టడం వల్ల గ్లైసెమిక్ ఇండెక్స్ తగ్గుతుంది. ఇలా వండిన అన్నాన్ని తినడం వల్ల రాత్రిళ్లు నిద్ర అనేది బాగా పడుతుంది.

జీర్ణ సమస్యలు రావు:

బియ్యాన్ని నానబెట్టి తినడం వల్ల జీర్ణ వ్యవస్థ కూడా ఆరోగ్యంగా ఉంటుంది. బియ్యాన్ని నానబెట్టి వండటం వల్ల అరగక పోవడం, మలబద్ధకం వంటి సమస్యలు రాకుండా ఉంటాయి.

ఎంత సేపు నానబెడితే మంచిది?

బియ్యాన్ని నానబెట్టడం మంచిదే. కానీ మరీ ఎక్కువ సేపు నానబెట్టినా.. అంత పెద్దగా ప్రయోజనం ఉండదు. బియ్యాన్ని ఎక్కువ సేపు నానబెట్టడం వల్ల అందులో ఉండే విటమిన్లు, ఖనిజాలు అనేవి నీటిలో కరిగిపోతాయి. కాబట్టి బియ్యాన్ని ఓ అరగంట సేపు నానబెడితే సరిపోతుంది.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..