AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health: ప్రాసెస్‌ ఫుడ్‌ను తీసుకుంటున్నారా.? త్వరగా వృద్ధాప్యం తప్పదు..

ప్యాకింగ్ చేసిన ఆహారం ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దీర్ఘకాలం ప్రాసెస్‌ ఫుడ్‌ను తీసుకోవడం వల్ల శరీరంపై తీవ్ర ప్రతికూల ప్రావం పడుతుందని అంటున్నారు. ఇంతకీ ప్రాసెస్‌ ఫుడ్‌ శరీరంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో ఇప్పుడు తెలుసుకుందాం..

Health: ప్రాసెస్‌ ఫుడ్‌ను తీసుకుంటున్నారా.? త్వరగా వృద్ధాప్యం తప్పదు..
Processed Food
Narender Vaitla
| Edited By: |

Updated on: Dec 08, 2024 | 10:16 PM

Share

మారిన కాలంతో పాటు తీసుకునే ఆహారంలో కూడా మార్పులు వచ్చాయి. ఫాస్ట్‌ ఫుడ్‌, ప్రాసెసింగ్ ఫుడ్‌కు ఎక్కువగా ఆదరణ పెరుగుతోంది. సూపర్ మార్కెట్లు, బేకరీలు చిన్న చిన్న పట్టణాల్లోకి కూడా అందుబాటులోకి రావడంతో ప్రజల ఆహారపు అలవాట్లలో భారీగా మార్పులు వచ్చాయి. అయితే ప్రాసెస్‌ చేసిన ఆహారం తీసుకోవడం వల్ల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుతుందని నిపుణులు చెబుతున్నారు.

ఎన్నో రకాల అనారోగ్య సమస్యలకు ప్రాసెస్‌ ఫుడ్‌ కారణమవుతుందని చెబుతున్నారు. ప్రాసెస్‌ చేసిన ఆహారాన్ని ఎక్కువగా తీసుకుంటే టైప్‌ 2 డయాబెటిస్‌ వచ్చే అవకాశం పెరుగుతుంది. సాధారణంగా ప్రాసెస్‌ చేసిన ఆహారం ఎక్కువ కాలం నిల్వ ఉండాలనే ఉద్దేశంతో చక్కెర, ఉప్పు కంటెంట్‌ను ఎక్కువగా యాడ్ చేస్తుంటారు. వీటిలో ప్రమాదకరమైన రసాయనాలతో పాటు కార్బోహైడ్రేట్లు, కొవ్వులు ఉంటాయి. ప్రాసెస్ చేసిన ఆహారాన్ని తినడం ఊబకాయం, వృద్ధాప్యం వచ్చే అవకాశాలు పెరుగుతాయని అంటున్నారు.

టిన్స్‌లో ప్యాక్‌ చేసిన ఫుడ్‌ను తీసుకోవడం వల్ల రక్తపోటు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వీటిలో ఉండే అధిక ఉప్పు కంటెంట్‌ రక్తపోటుకు దారి తీస్తుందని అంటున్నారు. ఇక టిన్స్‌లో ప్యాక్‌ చేసిన ఫుడ్‌లో నూనె శాతం ఎక్కువగా ఉంటుంది. నూనెలో ఉండే కొవ్వు కారణంగా శరీరానికి కేలరీలు రెండింతలు అధికమవుతుంది. దీంతో వేగంగా రువు పెరుగుతారు.

ప్యాకింగ్ ఫుడ్ ఎక్కువగా నిల్వ ఉండేందుకు గాను.. ఎక్కువ మొత్తంలో స్టార్చ్‌ను ఉపయోగిస్తారు. స్టార్చ్స్‌ అనేది ఒకరమైన పాలిమర్‌.. ఇది గ్లూకోజ్ చైన్‌లో ముఖ్యమైన భాగం. ఆహారంలో అధిక మొత్తంలో స్టార్చ్ ఉండటం వల్ల, శరీరంలో చక్కెర స్థాయి ప్రమాదం చాలా పెరుగుతుంది. ఇది శరీరంలో ఉన్న కణజాలాన్ని కూడా దెబ్బతీస్తుంది. చర్మ ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తుంది. టిక్ ప్యాక్‌ ఆహారాల్లో ట్రాన్స్‌ ఫ్యాట్‌ అధికంగా ఉంటాయి. ఇవి శరీరంలో కొలెస్ట్రాల్‌ స్థాయిలను పెంచుతుంది. ఇది గుండె ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతుంది.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని లైఫ్‌ స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..