Health Tips: రోజుకు 4 గుడ్లు తింటే ఏమవుతుందో తెలుసా? మీ బాడీలో అద్భుతం చూస్తారు!
గుడ్లు తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదే అయినా.. ఎక్కువగా తీసుకుంటే ఏమైనా సమస్యలు వస్తాయా? అనేది చాలా మందిలో ఉన్న సందేహం. అయితే, రోజుకు 4 నాలుగు కోడిగుడ్లను తినడం వల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలు రావని.. మీ ఆరోగ్యానికి మరింత శక్తిని అందిస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. వారు తెలిపిన ఈ విషయాలు చాలామందిని ఆశ్చర్యపరిచేలా ఉన్నాయి.

కోడిగుడ్లు ఆరోగ్యానికి మంచిదని అందరికీ తెలిసిన విషయమే. అందుకే చాలా మంది గుడ్లను తమ ఆహారంలో తరచూ చేర్చుకుంటారు. వారంలో రెండు మూడుసార్లు అయినా గుడ్లను భుజిస్తారు. అయితే, కొందరు మాత్రం రోజుకు రెండు నుంచి నాలుగు కోడిగుడ్లను ఆహారంగా తీసుకుంటారు. గుడ్లు తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదే అయినా.. ఎక్కువగా తీసుకుంటే ఏమైనా సమస్యలు వస్తాయా? అనేది చాలా మందిలో ఉన్న సందేహం. అయితే, రోజుకు 4 నాలుగు కోడిగుడ్లను తినడం వల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలు రావని.. మీ ఆరోగ్యానికి మరింత శక్తిని అందిస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఆరోగ్య నిపుణుడు డా. దర్షన్ షా తెలిపిన ఈ విషయాలు చాలామందిని ఆశ్చర్యపరిచేలా ఉన్నాయి.
యూఎస్ బేస్డ్ బోర్డ్ సర్టిఫైడ్ సర్జన్, హెల్త్, వెల్నెస్ స్పెషలిస్ట్ డాక్టర్ దర్శన్ షా.. కోడిగుడ్లను ఎక్కువగా తినడం వల్ల కలిగే లాభాలను తన ఇన్‌స్టా పోస్టులో వివరించారు.
గుడ్లు ఆరోగ్యానికి హానికరమా?
ఇంతకుముందు గుడ్లు ఎక్కువగా తినడం కొలెస్ట్రాల్, గుండెకు ప్రమాదకరమని భావించబడినప్పటికీ.. తాజా మెటాబాలిక్, కార్డియోవాస్క్యులర్ పరిశోధనలు ఇది ఆరోగ్యకరమైన ఆహారం అని చెబుతున్నాయి. పూర్తి గుడ్లు ఒక ఆరోగ్య వయస్సు ఉన్న వ్యక్తిలో కొలెస్ట్రాల్ సమస్యను పెంచవు. శరీరానికి ప్రోటీన్ మాత్రమే కాదు, మరింత విస్తృత పోషకాలను అందిస్తాయి.
గుడ్లు మాంసం కంటే ప్రత్యేకం ఎందుకంటే?
గుడ్లు కూడా మాంసం వలే ప్రోటీన్ అధిక ప్రాముఖ్యత కలిగిన ఆహారంగా ఉంటాయి. కానీ మాంసం కంటే గుడ్లలో ఉండే ప్రోటీన్ శరీరానికి ఇంకా అధిక బయోలాజికల్ వ్యాల్యూ అందిస్తుంది. అంటే శరీరం ఈ ప్రోటీన్‌ను బాగా జీర్ణించి, శరీర నిర్మాణం కోసం సమర్థంగా ఉపయోగించగలదు.
పచ్చసొన (yolk)లో ఉండే ఫాస్ఫోలిపిడ్స్, సహజ నూనెలు వల్ల గుడ్లలో సుమారు 65% శక్తిగా శరీరం దాన్ని మార్చుకోవచ్చు. కాబట్టి కొన్ని శక్తివంతమైన ఆహారాలను కూడా పూర్తి గుడ్లతో మార్చుకోవచ్చు.
గుడ్లు choline, B12, ఫోలేట్ వంటి మైక్రోన్యూట్రియెంట్లను అందిస్తాయి. ఇవి మెదడు, లివర్ పనితీరుకు చాలా అవసరం. గుడ్లలో lutein, zeaxanthin వంటి యాంటీయాక్సిడెంట్లు ఉంటాయి. ఇవి కళ్ళ ఆరోగ్యానికి, నాడీ వ్యవస్థకి మేలు చేస్తాయి.
విటమిన్లు
గుడ్ల పచ్చసొనలో ఉన్న విటమిన్ K2, A, D వంటి పోషకాలు ఇమ్మ్యూనిటీ, ఎముకల బలం, చర్మ ఆరోగ్యానికి ఉపయోగపడతాయి.
గుడ్లను ఎలా తీసుకుంటే అదనపు ప్రయోజనం
గుడ్లను ఉల్లిగడ్డతో కలిపి వండితే శరీరం టాక్సిన్ తొలగించే మార్గాలు మెరుగవుతాయి.
మిరియాలు, సముద్ర ఉప్పు వేసి తినడం వల్ల కారోటెనాయిడ్ మెరుగవుతుంది.
పచ్చగా గుడ్ల పచ్చసొనను కొంచెం మగ్గిన స్థితిలో వదిలి ఉంచితే వేడి-సున్నితమైన పోషకాలు ఎక్కువగా నిలుస్తాయి.
“రోజుకు 3-4 గుడ్లు తినడం అనేది ఎక్కువేం కాదు.. ఒక మంచి పోషక (nutritional foundation) ఆహారాన్ని శరీరానికి అందివ్వడం జరుగుతుంది అంతే. ఇది హార్మోన్ల, మెదడు ఆరోగ్యం, మెటాబాలిక్ ఫంక్షన్, లివర్ పనితీరును, కంటి చూపును మెరుగుపరుస్తుంది. అలసట అనేది ఉండదు. సెల్యులర్ రిపేర్‌కు సహాయపడుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.
