సమ్మర్‌ స్పెషల్ పుచ్చకాయ ఇలా తింటేనే ఉత్తమం..! నిపుణులు ఏం చెబుతున్నారంటే..

ఇది చర్మ కాంతిని పెంచుతుంది. పుచ్చకాయలో కేలరీలు తక్కువగా, నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. ఫైబర్, విటమిన్ ఎ, ఫోలేట్, పొటాషియం, ప్రోటీన్, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. పుచ్చకాయ గింజలు తినడం వల్ల జింక్ స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. రోగనిరోధక వ్యవస్థ కణాలను బలోపేతం చేయడానికి జింక్ పనిచేస్తుంది.

సమ్మర్‌ స్పెషల్ పుచ్చకాయ ఇలా తింటేనే ఉత్తమం..! నిపుణులు ఏం చెబుతున్నారంటే..
పుచ్చకాయ గింజల్లో ఉండే లైసిన్ మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది. అంతేకాదు.. పుచ్చకాయ గింజల్లో లైకోపీన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది.. ఇది లైకోపీన్ వల్ల క్యాన్సర్ కణాలను నియంత్రిస్తుంది. మెదడు నరాలను బలపరుస్తుంది. కామెర్లు వంటి సమస్యలలో పుచ్చకాయ గింజలను తీసుకోవడం వల్ల చాలా మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.

Updated on: Apr 29, 2025 | 1:23 PM

పుచ్చకాయ పుష్కలమైన పోషకాలు నిండివున్న అద్భుతమైన పండు. వేసవిలో శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. ఇది అధిక నీటి శాతాన్ని కలిగి ఉంటుంది. పుచ్చకాయ మాత్రమే కాదు, దాని విత్తనాలు కూడా ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. పుచ్చకాయ గింజలు తినడం వల్ల కలిగే కొన్ని ప్రయోజనాలు ఇక్కడ ఉన్నాయి. పుచ్చకాయను గింజలతోపాటుగా తినడం వల్ల జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. మలబద్ధకం వంటి సమస్యలు తగ్గుతాయి.

చర్మ సమస్యలు ఉన్నవారు కచ్చితంగా పుచ్చకాయ గింజలు తినాలి. ఎందుకంటే వాటిలో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇది చర్మ కాంతిని పెంచుతుంది. పుచ్చకాయలో కేలరీలు తక్కువగా, నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. ఫైబర్, విటమిన్ ఎ, ఫోలేట్, పొటాషియం, ప్రోటీన్, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. పుచ్చకాయ గింజలు తినడం వల్ల జింక్ స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. రోగనిరోధక వ్యవస్థ కణాలను బలోపేతం చేయడానికి జింక్ పనిచేస్తుంది.

పుచ్చకాయలో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ఈ ఆరోగ్యకరమైన కొవ్వులు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సాయపడతాయి. పుచ్చకాయ గింజలలో విటమిన్ బి ఉంటుంది. ఇది మన నాడీ వ్యవస్థ పనితీరులో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.

ఇవి కూడా చదవండి

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..