Get Rid of White Hair: మీ తెల్ల జుట్టు నేచురల్‌గా నల్లగా మారాలంటే ఇవి తినండి..

ప్రస్తుత కాలంలో యువతను కూడా వేధించే సమస్యల్లో తెల్ల జుట్టు కూడా ఒకటి. వైట్ హెయిర్ అనేది ఇంతకు ముందు కేవలం పెద్ద వాళ్లలో మాత్రమే కనిపించేది. కానీ పెళ్లికాని అమ్మాయిలు, అబ్బాయిల్లో కూడా కనిపిస్తుంది. చిన్న వయసులోనే వైట్ హెయిర్ రావడంతో చాలా మంది ఇబ్బంది పడాల్సి వస్తుంది. వీటిని పలు రకాల హెయిర్ కేర్ ప్రాడెక్ట్స్‌లో కలర్ వేసి కవర్ చేస్తున్నారు. పెద్ద వారిలో కాకుండా చిన్న వారిలో తెల్ల జుట్టు రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా పోషకాలు నిండిన..

Get Rid of White Hair: మీ తెల్ల జుట్టు నేచురల్‌గా నల్లగా మారాలంటే ఇవి తినండి..
White Hair Problem

Updated on: Oct 24, 2024 | 4:08 PM

ప్రస్తుత కాలంలో యువతను కూడా వేధించే సమస్యల్లో తెల్ల జుట్టు కూడా ఒకటి. వైట్ హెయిర్ అనేది ఇంతకు ముందు కేవలం పెద్ద వాళ్లలో మాత్రమే కనిపించేది. కానీ పెళ్లికాని అమ్మాయిలు, అబ్బాయిల్లో కూడా కనిపిస్తుంది. చిన్న వయసులోనే వైట్ హెయిర్ రావడంతో చాలా మంది ఇబ్బంది పడాల్సి వస్తుంది. వీటిని పలు రకాల హెయిర్ కేర్ ప్రాడెక్ట్స్‌లో కలర్ వేసి కవర్ చేస్తున్నారు. పెద్ద వారిలో కాకుండా చిన్న వారిలో తెల్ల జుట్టు రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా పోషకాలు నిండిన ఆహరం తీసుకోకపోయినా కూడా తెల్ల జుట్టు అనేది వస్తుంది. కాబట్టి మీరు తీసుకునే ఆహారం కూడా చాలా ముఖ్యం. మీరు తినే ఫుడ్ మీ ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుంది. ఇప్పుడు చెప్పే కొన్ని ఆహారాలను మీ డైట్‌లో చేర్చుకోవడం వల్ల తెల్ల జుట్టు నల్లగా మారడం ఖాయ. మరి ఆ ఫుడ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.

కలోంజి:

కలోంజి చాలా మందికి తెలిసే ఉంటుంది. ఇవి చిన్నగా నల్లగా ఉంటాయి. కానీ వీటిల్లో అనేక రకాల పోషకాలు ఉంటాయి. శరీర ఆరోగ్యమే కాకుండా చర్మ, జుట్టు సమస్యలను తగ్గించడంలో ఈ కలోంజి చక్కగా పని చేస్తుంది. వీటిని ఆహారంతో పాటు తీసుకుంటే చాలా పోషకాలు అందుతాయి. అంతే కాకుండా హెయిర్ మాస్క్‌
కూడా ఉపయోగించుకోవచ్చు. మెంతులతో పాటు నానబెట్టి.. గ్రైండ్ చేసి తలకు అప్లై చేస్తే.. మంచి ఫలితాలు ఉంటాయి.

కరివేపాకు:

చాలా మందికి తెలిసిన విషయమే. కానీ తినడానికి మాత్రం ఇష్ట పడరు. కరివేపాకులో అనేక రకాల పోషకాలు నిండి ఉంటాయి. ముఖ్యంగా జుట్టును బలంగా, దృఢంగా చేయడంలో కరివేపాకు ఎంతో బాగా సహాయ పడుతుంది. కాబట్టి మీరు తీసుకునే ఆహారంలో ఖచ్చితంగా కరివేపాకు ఉండేలా చేసుకోండి. ఇది తలపై మెలనిన్‌ ఉత్పత్తి చేస్తుంది. దీంతో తెల్ల జుట్టు తగ్గుతుంది. హెయిర్ మాస్క్‌లా కూడా ఉపయోగించుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

గోధుమ గడ్డి:

గోధుమ గడ్డితో కూడా మీ జుట్టును ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. తెల్ల జుట్టును నల్లగా మార్చడంలో గోధుమ గడ్డి ఎంతో ఎఫెక్టీవ్‌గా పని చేస్తుంది. అంతే కాకుండా జుట్టు కుదుళ్లను కూడా బలంగా, దృఢంగా ఉంచడంలో సమాయ పడుతుంది. గోధుమ గడ్డిని మీ ఆహారాలతో పాటు కలిపి తిన్నా, జ్యూస్ చేసుకుని తాగినా మంచి ఫలితాలు ఉంటాయి.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే.)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..