Teeth Care: మీ పళ్లు ఆరోగ్యంగా ఉండాలా.. అయితే ఇలా చేయండి!

|

Jun 26, 2024 | 1:00 PM

నోటి ఆరోగ్యం చాలా ముఖ్యం. నోటిని ఆరోగ్యంగా ఉంచుకుంటేనే మరింత హెల్దీగా ఉండగలం. ఎందుకంటే మనం తినే ఆహారం నేరుగా నోటి లోనుంచే లోపలికి వెళ్తుంది. కాబట్టి నోటిలో ఒక వేళ ఎలాంటి బ్యాక్టీరియా వంటివి ఉన్నా అవి కూడా లోపలికి వెళ్లవచ్చు. అదే విధంగా తరచూ మీకు పంటి సమస్యలు వస్తే. ఇతర ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. చాలా మంది దంతాలను అస్సలు పట్టించుకోరు. పళ్లు, చిగుళ్లను ఆరోగ్యంగా ఉంచుకోవడం..

Teeth Care: మీ పళ్లు ఆరోగ్యంగా ఉండాలా.. అయితే ఇలా చేయండి!
Teeth care
Follow us on

నోటి ఆరోగ్యం చాలా ముఖ్యం. నోటిని ఆరోగ్యంగా ఉంచుకుంటేనే మరింత హెల్దీగా ఉండగలం. ఎందుకంటే మనం తినే ఆహారం నేరుగా నోటి లోనుంచే లోపలికి వెళ్తుంది. కాబట్టి నోటిలో ఒక వేళ ఎలాంటి బ్యాక్టీరియా వంటివి ఉన్నా అవి కూడా లోపలికి వెళ్లవచ్చు. అదే విధంగా తరచూ మీకు పంటి సమస్యలు వస్తే. ఇతర ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. చాలా మంది దంతాలను అస్సలు పట్టించుకోరు. పళ్లు, చిగుళ్లను ఆరోగ్యంగా ఉంచుకోవడం చాలా అవసరం. ప్రతి రోజూ రెండు పూటలా బ్రష్ చేయాలి. అలాగే ఎలాంటి ఆహారం తిన్నా.. వెంటనే దంతాలను కూడా శుభ్రం చేసుకోవాలి. లేదంటే పళ్ల మధ్యలో ఆహారం ఉండిపోయి.. వైరస్, బ్యాక్టీరియా పెరగవచ్చు. దీని వల్ల కూడా పళ్ల సమస్యలు తలెత్తుతాయి. కొన్ని ఆహారాలను మీ డైట్లో చేర్చుకోవడం వల్ల పళ్లు, చిగుళ్లు అనేవి ఆరోగ్యంగా ఉంటాయి. మరి అవేంటో ఇప్పుడు చూద్దాం.

పండ్లు – కూరగాయలు:

పండ్లు – కూరగాయల్లో ఎక్కువగా పోషకాలు లభిస్తాయి. వీటిల్లో ఖనిజాలు, విటమిన్లు, మినరల్స్ వంటివి పుష్కలంగా ఉంటాయి. ఇవి దంతాలను, చిగుళ్లను బలంగా ఉంచుతాయి.

పాల ఉత్పత్తులు:

పాల ఉత్పత్తులు తీసుకోవడం వల్ల కూడా దంతాలు బలంగా ఉంటాయి. ఎందుకంటే వీటిల్లో ఎక్కువగా క్యాల్షియం ఉంటుంది. క్యాల్షియం దంతాలకు చాలా అవసరం. క్యాల్షియం ఫుడ్స్ తీసుకోవడం వల్ల దంతాలు ఎక్కువ కాలం ఆరోగ్యంగా ఉంటాయి.

ఇవి కూడా చదవండి

చేపలు:

ఫ్యాటీ ఫిష్ ఆరోగ్యానికి ఎంతో మంచిదన్న విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వీటిల్లో ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. ఇవి చిగుళ్ల వ్యాధుల బారిన పడకుండా కాపాడతాయి. అంతే కాకుండా ఇతర ఆరోగ్య ప్రయోజనాలు కూడా చాలా ఉన్నాయి.

నీటిని ఎక్కువగా తీసుకోవాలి:

నీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా పళ్లు, నోటి ఆరోగ్యం మెరుగు పడుతుంది. దంతాలు కూడా హైడ్రేట్‌గా ఉంటాయి. పంటిలో ఉండే బ్యాక్టీరియా, ఆహార పదార్థాలు తొలగిపోతాయి. అదే విధంగా చూయింగ్ గమ్స్ నమలడం వల్ల కూడా దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్‌ స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..