పొట్ట గుట్టలా మారిందా..? అద్భుతమైన 6 ఫ్యాట్ కట్టర్ ఫుడ్స్.. నెలలోనే మాయమవుతుందట..

|

Sep 10, 2024 | 7:26 PM

మారుతున్న జీవనశైలి, అనారోగ్యకరమైన ఆహారం కారణంగా చాలా మంది ప్రజలు ఊబకాయం సమస్యతో పోరాడుతున్నారు. బరువు తగ్గడానికి చాలా మంది జిమ్‌కి వెళ్లి గంటల తరబడి చెమటోడ్చుతారు.. అంతేకాకుండా కఠినమైన డైటింగ్‌లను కూడా అవలంభిస్తారు. అయినప్పటికీ..

పొట్ట గుట్టలా మారిందా..? అద్భుతమైన 6 ఫ్యాట్ కట్టర్ ఫుడ్స్.. నెలలోనే మాయమవుతుందట..
Weight Loss Tips
Follow us on

మారుతున్న జీవనశైలి, అనారోగ్యకరమైన ఆహారం కారణంగా చాలా మంది ప్రజలు ఊబకాయం సమస్యతో పోరాడుతున్నారు. బరువు తగ్గడానికి చాలా మంది జిమ్‌కి వెళ్లి గంటల తరబడి చెమటోడ్చుతారు.. అంతేకాకుండా కఠినమైన డైటింగ్‌లను కూడా అవలంభిస్తారు. అయినప్పటికీ.. పెద్దగా ప్రభావం కనిపించడం లేదని చాలా మంది నిరాశచెందుతుంటారు. కొవ్వును వీలైనంత త్వరగా కరిగించుకోవడానికి కొన్ని సందర్భాల్లో మందులు కూడా ఉపయోగిస్తారు.. అయితే అవి శరీరంపై తీవ్ర దుష్ప్రభావాలు చూపుతాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. వాస్తవానికి, మీరు మీ జీవనశైలి, ఆహారాన్ని మార్చుకుంటే తప్ప ఊబకాయం తగ్గదని పేర్కొంటున్నారు. ఊబకాయాన్ని తగ్గించుకోవడానికి ఈ పద్ధతి చాలా ఆరోగ్యకరం.. అటువంటి పరిస్థితిలో, అటువంటి కొన్ని ఆహారాల గురించి మీకు చెప్పబోతున్నాం.. వీటిని తీసుకోవడం ద్వారా మీరు మీ శరీర ఆకృతిని, ఆరోగ్యకరమైన పరిమాణంలోకి తీసుకురావచ్చు.. అవేంటో తెలుసుకోండి..

ఫ్యాట్ కట్టర్ ఫుడ్స్..

  1. గ్రీన్ టీ వినియోగం: పొద్దున్నే నిద్ర లేవగానే టీకి బదులు గ్రీన్ టీ తీసుకుంటే.. బరువు తగ్గడంలో చాలా దోహదపడుతుంది. గ్రీన్ టీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని జీవక్రియను పెంచి, కొవ్వును కరిగించడంలో సహాయపడతాయి. మీ ఆహారంలో ప్రతిరోజూ 1 నుండి 2 కప్పుల గ్రీన్ టీని చేర్చుకోండి. ఇది బరువును తగ్గించడంలో సహాయపడుతుంది.
  2. అవిసె గింజలు: అవిసె గింజలు ఆకలిని నియంత్రించడానికి ఒక గొప్ప ఎంపిక. అవిసె గింజలలో ఫైబర్, ఒమేగా 3 పుష్కలంగా ఉంటాయి. ఇవి చాలా కాలం పాటు కడుపు నిండుగా ఉంచడంలో సహాయపడతాయి. దీనితో మీరు అతిగా తినడాన్ని నివారించవచ్చు.. బరువు తగ్గడం కూడా సులభం అవుతుంది.
  3. కూరగాయలు – ఆకు కూరలు: బ్రోకలీ, బచ్చలికూర వంటి గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్‌లో ఫైబర్, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల పొట్ట ఎక్కువసేపు నిండుగా ఉండడంతో పాటు క్యాలరీలు తక్కువగా ఉంటాయి. ఈ కూరగాయలు బరువు తగ్గించడంలో సహాయపడతాయి. ఇవి మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.
  4. అల్లం: అల్లంను న్యాచురల్ ఫ్యాట్ బర్నర్ గా చెబుతారు. ఇందులో ఉండే థర్మోజెనిక్ లక్షణాలు జీవక్రియను పెంచుతాయి. కొవ్వు తగ్గింపు ప్రక్రియను వేగవంతం చేస్తాయి. మీ ఆహారంలో అల్లంను రెగ్యులర్ గా చేర్చుకోవడం వల్ల బరువు తగ్గడంలో సహాయపడుతుంది.
  5. పెరుగు: పెరుగు తీసుకోవడం కూడా బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది. పెరుగులో ఉండే ప్రోబయోటిక్స్ పొట్టకు మంచి బ్యాక్టీరియాను పెంచి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఇది మీ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.. ఇంకా బరువు తగ్గడాన్ని సులభం చేస్తుంది.
  6. వాల్నట్స్, తృణధాన్యాలు: మీ ఆహారంలో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉన్న పదార్థాలను చేర్చుకోవడం చాలా మంచిది.. వాల్‌నట్‌లు, బాదంపప్పులు, పిస్తా వంటి ప్రొటీన్‌లు అధికంగా ఉండే గింజలను చేర్చుకోండి. ఈ గింజలు ఆకలిని నియంత్రించడంలో సహాయపడతాయి. వీటితో బరువు తగ్గడం సులభం.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..