AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

50ఏళ్లు దాటినా జుట్టు ఊడిపోకుండా ఉండాలంటే.. ఈ ఒక్క పదార్థం రోజు తింటే చాలు..!

కరివేపాకుతో పొడి చేసి రోజు అన్నంలో లేదా టిఫిన్లు తినే చట్నీలో కూడా వేసుకోవచ్చు. తరచూ ఇలా కరివేపాకును ఆహారంలో భాగంగా తీసుకోవటం వల్ల జుట్టు ఒత్తుగా మందంగా, బలంగా పెరుగుతుంది. తెల్లజుట్టు సమస్య తగ్గుతుంది, స్కాల్ప్ ఆరోగ్యంగా ఉంటుంది. అందుకే రోజూ 5-10 కరివేపాకు ఆకులను తీసుకోవడం అలవాటు చేసుకోండి.

50ఏళ్లు దాటినా జుట్టు ఊడిపోకుండా ఉండాలంటే.. ఈ ఒక్క పదార్థం రోజు తింటే చాలు..!
curry-leaves
Jyothi Gadda
|

Updated on: Jul 05, 2025 | 2:14 PM

Share

ప్రస్తుత రోజుల్లో చాలా మంది అనేక ఆరోగ్య సమస్యలతో ఇబ్బందిపడుతున్నారు. అలాగే, ఎక్కువ మంది చర్మ, జుట్టు సమస్యలతో కూడా ఇబ్బందిపడుతున్నారు..ముఖ్యంగా చెప్పాలంటే.. ఎక్కువ మంది చిన్న వయసులోనే జుట్టు రాలిపోవటం, నెరిసిన జుట్టు సమస్యలతో ఎక్కువగా బాధపడుతున్నారు. ఆరోగ్యవంతమైన ఆహారానికి దూరం కావటం, అధిక ఒత్తడి జుట్టు సమస్యలకు ప్రధాన కారణం అంటున్నారు నిపుణులు. ఆరోగ్య నిపుణులు అభిప్రాయం ప్రకారం.. జుట్టు ఆరోగ్యానికి ప్రోటీన్, ఐరన్, జింక్, విటమిన్లు అవసరం. ఆహారంలో చేపలు, గుడ్లు, పాల ఉత్పత్తులు, ఆకుకూరలు, కాయగూరలు, పండ్లు, గింజలు వంటివి తప్పని సరిగా తీసుకోవాలని చెబుతున్నారు. అంతేకాదు.. జుట్టు ఊడిపోకుండా ఉండాలి అంటే.. రోజు కరివేపాకు తినడం వల్ల.. అది సాధ్యమవుతుంది అంటున్నారు నిపుణులు.

కరివేపాకులో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. ఇవి జుట్టును ఒత్తుగా, పొడవుగా చేస్తాయి. కరివేపాకులో ఉండే..విటమిన్ B, ఐరన్, కాల్షియం వల్ల జుట్టు రూట్లకు బలం వస్తుంది. కరివేపాకుతో పొడి చేసి రోజు అన్నంలో లేదా టిఫిన్లు తినే చట్నీలో కూడా వేసుకోవచ్చు. తరచూ ఇలా కరివేపాకును ఆహారంలో భాగంగా తీసుకోవటం వల్ల జుట్టు ఒత్తుగా మందంగా, బలంగా పెరుగుతుంది. తెల్లజుట్టు సమస్య తగ్గుతుంది, స్కాల్ప్ ఆరోగ్యంగా ఉంటుంది. అందుకే రోజూ 5-10 కరివేపాకు ఆకులను తీసుకోవడం అలవాటు చేసుకోండి.

కరివేపాకు తీసుకోవడం వల్ల జుట్టు రాలే సమస్య తగ్గిపోతుంది. కరివేపాకుతో పాటు మూడు పదార్థాలు కలిపి రాస్తే జుట్టు బాగా పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. కరివేపాకులో ఉండే అమినో యాసిడ్స్ జుట్టును మెరిసేలా చేస్తాయి. కరివేపాకులోని ఐరన్, కాల్షియం, ఫాస్పరస్ వంటి పోషకాలు ఉన్నాయి. ఈ పోషకాలు జుట్టును బలోపేతం చేస్తాయి.

ఇవి కూడా చదవండి

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

నిజమైన సంతోషం ఎందులో ఉంది.. 85 ఏళ్ల పరిశోధనలో తేలిన అసలు రహస్యం..
నిజమైన సంతోషం ఎందులో ఉంది.. 85 ఏళ్ల పరిశోధనలో తేలిన అసలు రహస్యం..
87 ఏళ్లకు తండ్రి అయిన కోటీశ్వరుడు.. కట్ చేస్తే..
87 ఏళ్లకు తండ్రి అయిన కోటీశ్వరుడు.. కట్ చేస్తే..
ఇప్పుడే కొనేయండి.. 2026లో బంగారం ధర ఎంత పెరుగుతుందో అస్సలు
ఇప్పుడే కొనేయండి.. 2026లో బంగారం ధర ఎంత పెరుగుతుందో అస్సలు
పొగాకు అలవాటు లేకపోయినా.. వీరికి నోటి క్యాన్సర్ పక్కా!
పొగాకు అలవాటు లేకపోయినా.. వీరికి నోటి క్యాన్సర్ పక్కా!
నావికా స్థావరానికి.. చైనా జీపీఎస్ ట్రాకర్‌ ఉన్న గూఢాచార పక్షి
నావికా స్థావరానికి.. చైనా జీపీఎస్ ట్రాకర్‌ ఉన్న గూఢాచార పక్షి
సినిమాలు హిట్టు.. అయినా సర్జరీ కోసం బలవంతం చేశారు..
సినిమాలు హిట్టు.. అయినా సర్జరీ కోసం బలవంతం చేశారు..
ఈ వాస్తు సూత్రాలు పాటించారంటే.. మీ జీతానికి రెక్కలు వచ్చినట్టే..
ఈ వాస్తు సూత్రాలు పాటించారంటే.. మీ జీతానికి రెక్కలు వచ్చినట్టే..
హైవేపై 100కి.మీ స్పీడ్‌లో ఉన్న కారు బ్రేకులు ఫెయిల్‌ అయ్యాయా?ఎలా?
హైవేపై 100కి.మీ స్పీడ్‌లో ఉన్న కారు బ్రేకులు ఫెయిల్‌ అయ్యాయా?ఎలా?
ఈఎంఐ, క్రెడిట్ కార్డ్ రుణాలు చెల్లించలేకపోతున్నారు? కారణాలు ఇవే..
ఈఎంఐ, క్రెడిట్ కార్డ్ రుణాలు చెల్లించలేకపోతున్నారు? కారణాలు ఇవే..
సుభాష్‌ చంద్రబోస్‌ ప్రయాణించిన రైలు ఇప్పుడు ఎక్కడ నడుస్తుంది?
సుభాష్‌ చంద్రబోస్‌ ప్రయాణించిన రైలు ఇప్పుడు ఎక్కడ నడుస్తుంది?