అల్జీమర్స్ ను ఇట్టే పొగట్టగల అద్భుతమైన పరిష్కారం

Ravi Kiran

Ravi Kiran | Edited By: Team Veegam

Updated on: Feb 14, 2020 | 1:42 PM

అల్జీమర్స్ వ్యాధిని ధ్వని, కాంతి థెరపీలతో నయం చేయవచ్చని కొంతమంది శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈ వ్యాధి ఎక్కువగా వయసు పైబడిన వారిలో కనిపిస్తుంది. ఇకపోతే జ్ఞాపక శక్తి తగ్గిపోవడం దీనికి ప్రధాన లక్షణం. మరోవైపు పరిచయస్తులు ఎదురుగా ఉన్నప్పటికీ, వారిని గుర్తుపట్టలేని స్థితి. అలాగే, కొన్ని క్షణాలు క్రితమే తమ చేతిలోని వస్తువును ఎక్కడ పెట్టారో కూడా గుర్తు రాకపోవడం, ఇలాంటి లక్షణాలను ఈ వ్యాధి కలిగిన వారు అనుభవిస్తారు. అంతేకాదు ప్రపంచంలో ఎంతోమంది ఈ వ్యాధి […]

అల్జీమర్స్ ను ఇట్టే పొగట్టగల అద్భుతమైన పరిష్కారం

అల్జీమర్స్ వ్యాధిని ధ్వని, కాంతి థెరపీలతో నయం చేయవచ్చని కొంతమంది శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈ వ్యాధి ఎక్కువగా వయసు పైబడిన వారిలో కనిపిస్తుంది. ఇకపోతే జ్ఞాపక శక్తి తగ్గిపోవడం దీనికి ప్రధాన లక్షణం. మరోవైపు పరిచయస్తులు ఎదురుగా ఉన్నప్పటికీ, వారిని గుర్తుపట్టలేని స్థితి. అలాగే, కొన్ని క్షణాలు క్రితమే తమ చేతిలోని వస్తువును ఎక్కడ పెట్టారో కూడా గుర్తు రాకపోవడం, ఇలాంటి లక్షణాలను ఈ వ్యాధి కలిగిన వారు అనుభవిస్తారు. అంతేకాదు ప్రపంచంలో ఎంతోమంది ఈ వ్యాధి బారిన పడుతున్నారు. శాస్త్రవేత్తలు అయితే మాత్రం ఈ అల్జీమర్స్ కు, ఒత్తిడికి అవినాభావ సంబంధం ఉందని అంటున్నారు.

ఇది ఇలా ఉంటే చాలామంది మతిమరుపు వచ్చిందంటే తమకు అల్జీమర్స్ వ్యాధి వచ్చిందని భయపడతారు. నిజానికి మతిమరుపులన్నీ అల్జీమర్స్ వ్యాధికి దారి తీయవు. మతిమరుపు రావడానికి చాలా కారణాలు దోహదం చేస్తాయి. అల్జీమర్స్ వ్యాధి సోకింది అని నిర్ధారణ చేయడానికి ఉన్న లక్షణం మెదడు కుచించుకుపోవడం. అలా జరిగితే మాత్రం దీనిని అల్జీమర్స్ వ్యాధని నిర్ధారణకు రావచ్చు.

మరోవైపు దీనిని నివారించడానికి కొన్ని చర్యలు మనం తీసుకోవచ్చు. అల్జీమర్స్ ఎక్కువగా వంశపారం పర్యంగా సంక్రమిస్తుంది. 60 ఏళ్ళు పైబడిన వారికి, 90 కిలోల బరువు ఉన్న వారికీ ఈ వ్యాధి వస్తుంది. అయితే ఈ వ్యాధి మొదటి స్టేజి లో ఉన్నప్పుడే గుర్తిస్తే మనం దానికి తగిన చర్యలు తీసుకోవచ్చు. అలాంటి వారితో ఎక్కువగా ఆటలు ఆడించి.. సోషల్ యాక్టివిటీస్ చేయించాలి. వారి మనసును ఎంత ఉత్సాహంగా ఉంచితే అంత మంచిది.

ఇక వీటితో పాటు కాంతి, ధ్వని చికిత్స ద్వారా కూడా ఈ అల్జీమర్స్ ను నివారించవచ్చు. ఎక్కువ ఒత్తిడి వల్ల వచ్చే ఈ వ్యాధికి.. మనిషి బ్రెయిన్ మీద ప్రభావం కలుగుతుంది. ఎప్పుడైతే మనిషి ఒత్తిడి చెందుతాడో.. అప్పుడు అతని బ్రెయిన్ తన మాట వినడు. చాలా ప్రమాదాలు కూడా రావడానికి కారణం అవుతుంది. మన మనసును ప్రశాంతం ఉంచుకుంటే.. మనకు తగిన ఆరోగ్యం పొందినట్లే.. దానికోసం మనకు నచ్చిన మ్యూజిక్ గానీ.. మనసుకు వినసొంపైన ధ్వనిని గానీ వింటే చాలు ప్రశాంతంగా ఉండగలం. ఇలా ధ్వని థెరపీ ద్వారా అల్జీమర్స్ ను తగ్గించవచ్చు. అంతేకాదు మనకు కాంతి థెరపీ ద్వారా కూడా ఈ వ్యాధిని నయం చేయవచ్చు. అదేలా అంటే 25 నుంచి 80 మీటర్స్ స్పీడ్ తో కాంతి వేగం మన బ్రెయిన్ కు తగిలితే అక్కడ చచ్చుపడిపోయిన కణాలను నయం చేయగలిగి అల్జీమర్స్ వ్యాధిని అరికట్టగలదు అని శాత్రవేత్తలు అంటున్నారు.

ఏది ఏమైనా మన మనసును, బ్రెయిన్ ను ప్రశాంతంగా ఉంచితే ఇలాంటి ప్రమాదకరమైన రోగాలు మన దరికి చేరవని శాస్త్రవేత్తల అంచనా.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu