AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips : గుండెపోటు వస్తుందని చెప్పే 7 సంకేతాలు ఇవే.. పట్టించుకోకపోతే అంతే సంగతులు..

గుండెపోట్లు భయపెడుతున్నాయి. వయసుతో సంబంధం లేకుండా అందరినీ ఇది కబళిస్తుంది. యువకులు, పిల్లలకు గుండెపోట్లు రావడం ఆందోళన కలిగిస్తుంది. అయితే హార్ట్ అటాక్ వచ్చేముందు కొన్ని సంకేతాలు కనిపిస్తాయి. వాటి విస్మరిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోొవలసి ఉంటుంది. అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం..

Health Tips : గుండెపోటు వస్తుందని చెప్పే 7 సంకేతాలు ఇవే.. పట్టించుకోకపోతే అంతే సంగతులు..
Early Symptoms of a Heart Attack
Krishna S
|

Updated on: Sep 10, 2025 | 2:03 PM

Share

ప్రస్తుత కాలంలో మారుతున్న జీవనశైలి, అధిక పని ఒత్తిడి, సరైన ఆహారపు అలవాట్లు లేకపోవడం వల్ల గుండె జబ్బులు సర్వసాధారణంగా మారాయి. గుండెపోటు కేవలం వృద్ధులలోనే కాకుండా యువకులలో కూడా పెరుగుతోంది. చాలామంది గుండె సమస్యలను గుర్తించడంలో ఆలస్యం చేస్తారు. దీనివల్ల తీవ్ర పరిణామాలు ఎదురవుతాయి. గుండెపోటుకు ముందు కనిపించే కొన్ని హెచ్చరిక సంకేతాలను ముందుగా గుర్తించడం ద్వారా ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

లక్షణాలు ఏమిటంటే..?

అలసట

తగినంత విశ్రాంతి తీసుకున్నా కూడా తరచుగా అలసటగా లేదా బలహీనంగా అనిపించడం గుండె సమస్యలకు ఒక సంకేతం. ధమనులు ఇరుకవడం లేదా మూసుకుపోవడం వల్ల గుండె రక్తాన్ని పంప్ చేయడానికి ఎక్కువగా శ్రమించాల్సి వస్తుంది.

తల తిరుగుడు:

రక్త ప్రవాహం తగ్గి మెదడుకు సరిపడా రక్తం అందనప్పుడు తలతిరుగుడు లేదా మూర్ఛ రావచ్చు. అకస్మాత్తుగా తలతిరుగుతున్నట్లు అనిపిస్తే, అది రక్త ప్రసరణ సమస్యకు సంకేతం కావచ్చు.

చెమటలు

శారీరక శ్రమ లేకుండానే అధికంగా చల్లని చెమటలు పడితే దానిని తేలికగా తీసుకోకూడదు. ఇది గుండె జబ్బుల మొదటి సంకేతాలలో ఒకటిగా ఉండవచ్చు.

ఛాతీ నొప్పి

ఛాతీలో ఒత్తిడిగా, బిగుతుగా లేదా బరువుగా అనిపించడం సాధారణంగా ధమనులలో అడ్డంకులు ఉన్నాయని సూచిస్తుంది. ఈ రకమైన నొప్పిని ఆంజినా అని పిలుస్తారు. ఈ లక్షణాన్ని పదేపదే అనుభవిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.

శ్వాస ఇబ్బందులు

కొద్దిపాటి శ్రమతో కూడా ఊపిరి ఆడకపోవడం అనేది గుండెకు తగినంత ఆక్సిజన్ అందడం లేదని సూచిస్తుంది. ఇది ధమనులు మూసుకుపోవడానికి ఒక ముఖ్యమైన సంకేతం.

వికారం లేదా అజీర్ణం

వికారం, కడుపులో అజీర్తి వంటి జీర్ణ సమస్యలు గుండెపోటు లక్షణాలుగా కూడా ఉండవచ్చు. ముఖ్యంగా ఛాతీ నొప్పితో పాటు ఈ లక్షణాలు ఉంటే, వాటిని విస్మరించకూడదు.

పాదాల వాపు

రక్త నాళాలు మూసుకుపోవడం వల్ల శరీరంలోని కింది భాగాలలో ద్రవం పేరుకుపోయి పాదాలు లేదా చీలమండలు వాపుకు గురవుతాయి. ఇది రక్త ప్రసరణ సరిగా లేకపోవడానికి సంకేతం.

ఈ లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యుడిని సంప్రదించి పరీక్షలు చేయించుకోవడం ముఖ్యం. తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా గుండె జబ్బులను నివారించవచ్చు.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..