బంధం కలకాలం పటిష్టంగా ఉండాలని భాగస్వాములకు ఒకరిపై ఒకరికి నమ్మకం ఎంత ముఖ్యమో ఒకరిని ఒకరు గౌరవించుకోండం కూడా అంతే ముఖ్యంగా గౌరవం దెబ్బతిన్నప్పుడు ఆ బంధాలు ఎక్కువ కాలం సంతోషంగా ఉండవు. ఇక ఏ బంధమైన గొడవలు అనేది సర్వసాధారణమైన విషయం. ఏ ఇద్దరు వ్యక్తులు ఒక చోట కలిసి ఉన్నా అడపాదడపా గొడవలు జరగడం సహజం. అయితే భార్య, భర్తల మధ్య గొడవ జరిగిన సందర్భాల్లో చాలా మంది కొన్ని తప్పులు చేస్తుంటారు. ఇలాంటి తప్పుల వల్ల బంధం మరింత బలహీన పడే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ ఆ తప్పులేంటంటే..
* గొడవ జరిగిన తర్వాత చాలా మంది తప్పు నీదే అంటూ వాదనకు దిగుతుంటారు. ఇది ఎదుటి వారిని మరింత బాధిస్తుంటుంది. కాబట్టి తప్పు ఎవరిదైనా దానిని మరిచిపోయి ముందుకు వెళ్లడం అలవాటు చేసుకోవాలి. ఆవేశంలో ఏదో జరిగిపోయిందన్న ఆలోచనను అలవాటు చేసుకోవాలి. గొడవకు మీ భాగస్వామే కారణం అనే వాదనను తెరపైకి తీసుకురావద్దు దీని వల్ల గొడవ మరింత పెరిగే అవకాశం ఉంటుంది.
* తొందరపాటులో ఎలాంటి నిర్ణయం తీసుకోకూడదు. గొడవ జరిగ్గానే ఇంటిని వదిలి వెళ్లి పోవడం లాంటివి చేయకూడదు. ఇలా చేయడం వల్ల మీ పాట్నర్‌ను మీరు మరింత దూరం చేసుకున్న వారవుతారు. ఎవరో ఒకరు పట్టువీడి బంధాన్ని బలపర్చుకునేందుకు ప్రయత్నం చేయాలి. తగ్గడంలో తప్పు లేదని, అవమానం అంతకంటే కాదని భావించాలి.
* చాలా మంది గొడవ జరిగిన తర్వాత కూడా దాని గురించే మాట్లాడుతుంటారు. అయితే ఇలా చేయకూడదు. గొడవ సద్దుమణిగిన వెంటనే ఇతర విషయాలపై దృష్టిసారించాలి. పాట్నర్‌తో అలా సరదాగా బయటకు వెళ్లాలి.
* వీలైతే ప్రేమించండి డ్యూడ్ మహా అయితే తిరిగి ప్రేమిస్తారు.. మన డార్లింగ్ ప్రభాస్ చెప్పిన ఈ డైలాగ్ రిలేషన్‌ను కాపాడుకోవడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. మీ భాగస్వామిని మరింత కొత్తగా, మరింత ఎక్కువగా ప్రేమించండి. గొడవ సమయంలో మీపై ఎంత ద్వేషం ఉన్నా ‘ఐ లవ్ యూ’ అని ఓ చిన్న సర్‌ప్రైజ్ ఇవ్వండి ఇట్టే కూల్ అయిపోతారు.
మరిన్ని లైఫ్ స్టైల్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..