Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health: చల్లటి నీరు తాగితే బరువు పెరుగుతారా.? అసలు విషయం ఏంటంటే..

శరీరానికి నీరు ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నేషనల్‌ అకాడమీ ఆఫ్ సైన్సెస్, ఇంజినీరింగ్ అండ్‌ మెడిసిన్ (US) ప్రకారం, 19 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న పురుషులు ప్రతిరోజూ కనీసం 3.7 లీటర్లు నీరు తాగాలి. 19 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న స్త్రీలు ప్రతిరోజూ కనీసం 2.7 లీటర్లు నీరు తాగాలి...

Health: చల్లటి నీరు తాగితే బరువు పెరుగుతారా.? అసలు విషయం ఏంటంటే..
Drinking Water
Follow us
Narender Vaitla

|

Updated on: Jan 08, 2024 | 12:59 PM

ఆరోగ్యం విషయంలో ఎన్ని నమ్మకాలు, మరెన్నో అప నమ్మకాలు ఉంటాయి. వైద్యులు చెప్పే సూచనలు కాకుండా, కొందరు తమ తమ విశ్వాసాల ఆధారంగా కొన్నింటిని నమ్ముతుంటారు. అలాంటి వాటిలో చల్లటి నీరు తాగడం వల్ల బరువు పెరుగుతారు. అయితే కూల్‌ వాటర్‌ తాగితే నిజంగానే బరువు పెరుగుతారా.? నిపుణులు ఏం చెబుతున్నారు.? లాంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

శరీరానికి నీరు ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నేషనల్‌ అకాడమీ ఆఫ్ సైన్సెస్, ఇంజినీరింగ్ అండ్‌ మెడిసిన్ (US) ప్రకారం, 19 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న పురుషులు ప్రతిరోజూ కనీసం 3.7 లీటర్లు నీరు తాగాలి. 19 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న స్త్రీలు ప్రతిరోజూ కనీసం 2.7 లీటర్లు నీరు తాగాలి. గర్భిణీలు, పాలిచ్చే స్త్రీలకు దీని కంటే ఎక్కువ నీరు అవసరం. సరిపడ నీరు తీసుకోవడం వల్ల రోజంతా తాజాగా, శక్తిగా ఉండొచ్చు.

కాగా చల్లటి నీరు తాగితే బరువు పెరుగుతారనే నమ్మకం ఉంది. కానీ జర్నల్ ఆఫ్ క్లినికల్ ఎండోక్రినాలజీ అండ్ మెటబాలిజం ప్రకారం, చల్లని నీటికి బరువు పెరుగుటతో సంబంధం లేదని తేలింది. వాస్తవానికి, నీటిలో కేలరీలు ఉండవు, కాబట్టి అది బరువును పెంచదు. కానీ చల్లని నీరు తీసుకుంటే మాత్రం ఇతర సమస్యలు ఉంటాయని వైద్యులు చెబుతున్నారు.

సాధారణంగా చల్లటి నీరు ఎక్కువగా తీసుకుంటే.. గ్యాస్, మలబద్ధకం వంటి కడుపు సంబంధిత సమస్యలకు కారణమవుతుంది. గొంతులో నొప్పి లేదా వాపు పెరుగుతుంది. తలనొప్పి సమస్య వేధిస్తుంది. పంటి నొప్పి లేదా సున్నితత్వం పెరుగుతుంది. కాబట్టి గది ఉష్ణోగ్రత వద్ద ఉంటే నీటిని మాత్రమే తీసుకోవాలి. మరీ ఎక్కువగా కూల్‌ వాటర్‌ తాగడం వల్ల పైన తెలిపిన సమస్యలు వెంటాడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..

మాస్టర్ బ్లాస్టర్ స్టైల్‌లో కమిన్స్ అప్పర్-కట్
మాస్టర్ బ్లాస్టర్ స్టైల్‌లో కమిన్స్ అప్పర్-కట్
బంగారాన్ని ఎక్కువ కాలం వాడకపోతే తుప్పు పడుతుందా?
బంగారాన్ని ఎక్కువ కాలం వాడకపోతే తుప్పు పడుతుందా?
కాలేజ్‌ క్యాంపస్‌లో తిరుగుతున్న భారీ మొసలి వీడియో వైరల్
కాలేజ్‌ క్యాంపస్‌లో తిరుగుతున్న భారీ మొసలి వీడియో వైరల్
ఇదేం చేస్తుందిలే అని చీప్‌గా చూసేరు.. ఆ సమస్యలకు బ్రహ్మాస్త్రం..
ఇదేం చేస్తుందిలే అని చీప్‌గా చూసేరు.. ఆ సమస్యలకు బ్రహ్మాస్త్రం..
ఆరుగురు హీరోయిన్స్ తర్వాత విజయ్ సినిమాలో ఆమె ఫిక్స్ అయ్యిందా..?
ఆరుగురు హీరోయిన్స్ తర్వాత విజయ్ సినిమాలో ఆమె ఫిక్స్ అయ్యిందా..?
మీ మతిమరుపునకు అసలు కారణం తెలిస్తే.. వీడియో
మీ మతిమరుపునకు అసలు కారణం తెలిస్తే.. వీడియో
సంగారెడ్డిలో ఘోరం..ముగ్గురు పిల్లల‌కు విష‌మిచ్చి తానూ తాగిన తల్లి
సంగారెడ్డిలో ఘోరం..ముగ్గురు పిల్లల‌కు విష‌మిచ్చి తానూ తాగిన తల్లి
ఈ పండు తినాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందే.. వీడియో
ఈ పండు తినాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందే.. వీడియో
అమెరికా వెళ్లాలనుకునే విద్యార్ధులకు షాక్‌.. ట్రంప్ ఏం చేశారంటే?
అమెరికా వెళ్లాలనుకునే విద్యార్ధులకు షాక్‌.. ట్రంప్ ఏం చేశారంటే?
ముల్లును ముల్లుతోనే తీయాలి.. తూర్పు లద్దాఖ్‌లో అధునాతన బలగాలు
ముల్లును ముల్లుతోనే తీయాలి.. తూర్పు లద్దాఖ్‌లో అధునాతన బలగాలు