Health: మీరు రాత్రి సరిగ్గా పడుకోవడం లేదా.. వెంటాడే డేంజర్ డిసీజ్ ఇది

నిద్రలేమి ఎన్నో రుగ్మతలకు దారి తీస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి. నిద్రలేమితో మధుమేహం, రక్తపోటు, గుండెజబ్బు, గుండె సంబంధిత వ్యాధులు, ఊబకాయం వంటి దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. కొన్ని రాత్రులు నిద్రలేకుండా ఉంటే కూడా అది మధుమేహానికి దారి తీస్తుందట.

Health: మీరు రాత్రి సరిగ్గా పడుకోవడం లేదా.. వెంటాడే డేంజర్ డిసీజ్ ఇది
Sleepless
Follow us
Ram Naramaneni

|

Updated on: Mar 13, 2024 | 1:35 PM

రోజుకు కేవలం 3 నుంచి 5 గంటలు నిద్రపోయేవారికి  టైప్ 2 డయాబెటిస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని.. స్వీడన్‌లోని ఉప్ప్సల విశ్వవిద్యాలయం ఇటీవల జరిపిన ఒక అధ్యయనంలో వెల్లడైంది. ఆరోగ్యకరమైన డైట్ ఫాలో అవ్వడం ద్వాారా.. నిరంతర నిద్రలేమితో వచ్చే ప్రమాదాలను కొంతమేర తగ్గించవచ్చని ఈ పరిశోధన తెలిపింది. ఉప్ప్సల విశ్వవిద్యాలయంలో ప్రధాన పరిశోధకుడు, అసిస్టెంట్ ప్రొఫెసర్ క్రిస్టియన్ బెనెడిక్ట్ ప్రజలు తగినంత నిద్ర పొందాలని సూచించారు. ముఖ్యంగా రోజంతా పనిచేసే వారు నిద్రకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. అవగాహన, జీవనశైలిని మేనేజ్ చేసుకోవడం కూడా చాలా ముఖ్యమని చెప్పారు. 

తగినంత నిద్ర, టైప్ 2 మధుమేహం మధ్య సంబంధంపై ఈ అధ్యయనంలో క్షుణ్ణంగా పరిశోధన చేశారు. తగినంత నిద్ర లేకపోతే.. చక్కెరను ప్రాసెస్ చేసే సామర్థ్యాన్ని శరీరం కోల్పేయే అవకాశం ఉందని ఈ పరిశోధనలో వెల్లడైంది. ఇది క్రమేణ రక్తంలో అధిక చక్కెర స్థాయిలు, ఇతర దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది. ప్రపంచవ్యాప్తంగా 462 మిలియన్ల మంది వ్యక్తులను ప్రభావితం చేసిన టైప్ 2 డయాబెటిస్.. మున్ముందు తీసుకొచ్చే ఆరోగ్య సవాలును ఈ పరిశోధన నొక్కి చెబుతుంది.

గతంలో చేసిన చాలా పరిశోధనల్లో కూడా తక్కువ రోజువారీ నిద్ర..  మధుమేహానికి దారి తీస్తుందని వెల్లడించాయి. ప్రపంచంలోని అత్యంత విస్తృతమైన జనాభా డేటాబేస్‌లలో ఒకటైన UK బయోబ్యాంక్ నుండి డేటాను పరిశీలిస్తున్న పరిశోధకులు.. ఒక దశాబ్దంలో దాదాపు అర మిలియన్ మంది ఆరోగ్యాన్ని ట్రాక్ చేశారు.  వారు ఇదే విషయాన్ని వెల్లడించారు. 6 గంటల కంటే తక్కువగా నిద్రపోవడాన్ని తక్కువ నిద్ర అంటారు.  నిద్రలేమి, అనారోగ్యం ఒకదానికొకటి ముడిపడి ఉంటాయి. 

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది… ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి

మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
వెలగ పండుతో అద్భుతాలే.. సంతానలేమి సమస్యలు మాయం!
వెలగ పండుతో అద్భుతాలే.. సంతానలేమి సమస్యలు మాయం!
ఐటీ చెల్లింపుదారులకు పండగే.. వచ్చే బడ్జెట్‌లో ట్యాక్స్ తగ్గింపు.?
ఐటీ చెల్లింపుదారులకు పండగే.. వచ్చే బడ్జెట్‌లో ట్యాక్స్ తగ్గింపు.?
ఇలాంటి వాళ్లను ఏం చేయాలి? రేణూ దేశాయ్ సంచలన పోస్ట్.. ఏమైందంటే?
ఇలాంటి వాళ్లను ఏం చేయాలి? రేణూ దేశాయ్ సంచలన పోస్ట్.. ఏమైందంటే?
17 ఏళ్లకే క్రేజీ హీరోయిన్.. రహస్యంగా పెళ్లి, 9 నెలలకే విడాకులు..
17 ఏళ్లకే క్రేజీ హీరోయిన్.. రహస్యంగా పెళ్లి, 9 నెలలకే విడాకులు..
ఐఆర్‌సీటీసీ సైట్‌ డౌన్‌ అయితే రైలు టికెట్లను బుక్‌ చేసుకోవడం ఎలా?
ఐఆర్‌సీటీసీ సైట్‌ డౌన్‌ అయితే రైలు టికెట్లను బుక్‌ చేసుకోవడం ఎలా?
కొత్త ఫీచర్లతో హోండా యూనికార్న్.. అప్‌డేట్ మోడల్ విడుదల
కొత్త ఫీచర్లతో హోండా యూనికార్న్.. అప్‌డేట్ మోడల్ విడుదల
బిచ్చగత్తె చేతిలో అనుమానాస్పద ప్లాస్టిక్ బ్యాగ్.. తెరిచి చూడగా
బిచ్చగత్తె చేతిలో అనుమానాస్పద ప్లాస్టిక్ బ్యాగ్.. తెరిచి చూడగా
హైడ్రాకు ఇప్పటివరకు ఎన్ని ఫిర్యాదులు వచ్చాయో తెలుసా..?
హైడ్రాకు ఇప్పటివరకు ఎన్ని ఫిర్యాదులు వచ్చాయో తెలుసా..?
బక్కగా ఉన్నవారు బరువు పెరగాలంటే ఇలా చేయండి..
బక్కగా ఉన్నవారు బరువు పెరగాలంటే ఇలా చేయండి..