Cucumber Bitterness: అలా చేస్తే కీర దోస చేదు నిజంగానే తొలగిపోయి రుచి మారుతుందా? వాస్తవం తెలుసుకోండి..

|

Apr 20, 2023 | 12:08 PM

సలాడ్‌లో కీరదోస లేకపోతే ఆ లోటు మరే వెజిటబుల్‌ తీర్చలేదు. అందరూ దీనిని చాలా ఇష్టంగా తింటుంటారు. కీరదోసలో చలువ చేసే లక్షణాలు ఉంటాయి. అందుకే వేసవిలో దీన్ని ఎక్కువగా తింటారు. ఒక్కోసారి కీర చేదుగా ఉండటం వల్ల వృధాగా పడేయవల్సి ఉంటుంది. కీరదోస పైబాగాలను కట్ చేసి..

Cucumber Bitterness: అలా చేస్తే కీర దోస చేదు నిజంగానే తొలగిపోయి రుచి మారుతుందా? వాస్తవం తెలుసుకోండి..
Cucumber
Follow us on

సలాడ్‌లో కీరదోస లేకపోతే ఆ లోటు మరే వెజిటబుల్‌ తీర్చలేదు. అందరూ దీనిని చాలా ఇష్టంగా తింటుంటారు. కీరదోసలో చలువ చేసే లక్షణాలు ఉంటాయి. అందుకే వేసవిలో దీన్ని ఎక్కువగా తింటారు. ఒక్కోసారి కీర చేదుగా ఉండటం వల్ల వృధాగా పడేయవల్సి ఉంటుంది. కీరదోస పైబాగాలను కట్ చేసి ఆ రెండు భాగాలు ఉప్పుతో రుద్దడం వల్ల చేదు తొలగిపోతుందని చాలా మంది చెబుతుంటారు. ఇలా చేయడం వల్ల కీరదోసలోని చేదు తొలగిపోయి తినడానికి రుచిగా ఉంటుందని చెబుతారు. అలాంటిదేమీ జరగదని మరికొందరు కొట్టి పారేస్తుంటారు. అసలు వాస్తవం ఏంటనేది చాలా మందికి తెలియదు. నిజానిజాలు తెలుసుకుందాం..

కీరదోస కాయలు ఎందుకు చేదుగా ఉంటాయంటే..

అన్ని కీర కాయలు చేదుగా ఉండవు. కొన్ని మాత్రమే చేదుగా ఉంటాయి. ఇది కాయ పరిపక్వతపై ఆధారపడి ఉంటుంది. కీర మిల్క్‌వీడ్ అనే కూరగాయల జాతికి చెందినవి. ఈ జాతికి చెందిన కాయల్లో కుకుర్బిటాసిన్స్ అనే పదార్థం ఉంటుంది. దీని వల్లనే చేదు వస్తుంది. కూరగాయలు పురుగులు, ఇతర కీటకాల నుంచి తమను తాము రక్షించుకోవడానికి రక్షణగా ఈ పదార్థాన్ని ఉత్పత్తి చేస్తాయి.

కీరదోస రుద్దితే చేదు తొలగిపోతుందా?

చేదును తొలగించడానికి కీరదోస పైభాగాలను రుద్దాలని చాలా మంది చెబుతుంటారు. ఇలా చేయడం వల్ల కీర నుంచి నురుగు బయటకు వస్తుంది. ఈ నురుగు ద్వారా చేదు బయటకు పోతుందని నమ్ముతారు. నిజానికి.. కీరదోస మొన భాగాల్లో చేదును కలిగించే కుకుర్బిటాసిన్ అధికంగా ఉంటుంది. అందుకే కీర చివరి భాగాలను కట్ చేసి.. చివరలను రుద్దితే వచ్చే నురుగుతో పాటు దాని చేదు కూడా తొలగిస్తుంది. ఇలా చేయడం ద్వారా కుకుర్బిటాక్టిన్లు కీర లోపలి భాగానికి వ్యాపించదు. అలాగే కీర సహజంగా పక్వతకు వచ్చినప్పుడు దీనిలో కుకుర్బిటాసిన్ కంటెంట్ తగ్గుతుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆరోగ్య వార్తాకథనాల కోసం క్లిక్‌ చేయండి.