Sleeping: నిద్రలేమితో బాధపడుతున్నారా? ఐతే వెంటనే మీ మ్యాట్రెస్‌ మార్చాలంటున్న నిపుణులు.. కారణం తెలిస్తే..

|

Dec 04, 2022 | 9:01 PM

రోజు మొత్తం యాక్టివ్‌గా ఉండాలంటే సరిపడా నిద్ర అవసరం. ఐతే నేటి జీవనశైలి కారణంగా ఎంతోమంది నిద్రలేమితో సతమతమవుతున్నారు. మీకు తెలుసా..! నిద్రలేమికి మనం పడుకునే మంచం, దాని మీద వేసే పరుపు (మ్యాట్రెస్‌) కూడా ఓ కారణమేనట..

Sleeping: నిద్రలేమితో బాధపడుతున్నారా? ఐతే వెంటనే మీ మ్యాట్రెస్‌ మార్చాలంటున్న నిపుణులు.. కారణం తెలిస్తే..
sleeping
Follow us on

రోజు మొత్తం యాక్టివ్‌గా ఉండాలంటే సరిపడా నిద్ర అవసరం. ఐతే నేటి జీవనశైలి కారణంగా ఎంతోమంది నిద్రలేమితో సతమతమవుతున్నారు. మీకు తెలుసా..! నిద్రలేమికి మనం పడుకునే మంచం, దాని మీద వేసే పరుపు (మ్యాట్రెస్‌) కూడా ఓ కారణమేనట. రాత్రంతా హాయిగా నిద్రపోవాలంటే సౌకర్యవంతంగా ఉండే మ్యాట్రెస్‌ ఉండాలి. లేదంటే పడుకోగానే నిద్ర పట్టక చాలా సేపు మంచంపై కాలక్షేపం చేయవల్సి వస్తుంది. ఇలా రోజూ ఆలస్యంగా నిద్రపోతున్నట్లయితే, అనతికాలంలోనే వెన్నునొప్పి, ఇతర అనారోగ్య సమస్యలు వెంటాడుతాయి. ఇప్పటికే ఈ సమస్యలున్నవారు వెంటనే మ్యాట్రెస్‌ మార్చడం మంచిది.

మ్యాట్రెస్‌ను ఎన్నేళ్లుగా ఉపయోగిస్తున్నారు? అనే విషయం కూడా ముఖ్యమైనదే. మ్యాట్రెస్‌ను కొని ఇప్పటికే పదేళ్లు దాటినట్లైతే వెంటనే మార్చేయండి. ఒక మ్యాట్రెస్‌ను కనీసం ఏడేళ్ల పాటు ఉపయోగించాలని నిపుణులు అంటున్నారు. ఆ తర్వాత కూడా పాత మ్యాట్రెస్‌ను ఉపయోగిస్తే, అది మీ ఆరోగ్యంపై చెడు ప్రభావాన్ని చూపుతుందట. ఎందుకంటే.. సంవత్సరాలు గడిచేకొద్దీ, మ్యాట్రెస్‌ నాణ్యత క్షీణిస్తుంది. ఇక దీనిపై నిద్రపోతే చేతులు, కాళ్ళలో నొప్పులు ప్రారంభమయ్యి నిద్రలేమికి కారణమవుతుంది. అలాగే శరీరం నుంచి వచ్చే ద్రవాలను గ్రహించిన మ్యాట్రెస్‌లో బ్యాక్టీరియా, దుమ్ము ధూళి పేరుకుపోయి ఇన్ఫెక్షన్ వ్యాప్తి చెందడానికి దారితీస్తుంది.

కొంతమంది స్నానం చేసి, తడి జుట్టుతో నిద్రిస్తుంటారు. ఇలా పడుకున్నప్పుడు దిండు, దుప్పట్లు, మ్యాట్రెస్‌ తడి జుట్టు నీటిని పీల్చుకుంటాయి. ఇది బ్యాక్టీరియా పెరుగుదలకు దారితీస్తుంది. చెమట, మృత చర్మ కణాలు, నూనె కారణంగా దుర్వసన వస్తుంది. వాసనతోపాటు బ్యాక్టీరియా కూడా పేరుకుపోతుంది. అందుకే మ్యాట్రెస్‌ను ప్రతి ఏడేళ్లకోమారు మార్చుకుంటూ ఉండాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి.