Hair Care Tips: మీ జుట్టు కురులు దృఢంగా ఉండాలంటే శీతాకాలంలో ఈ ఆయిల్‌ని వాడండి..
చలికాలంలో చాలామంది జుట్టు రాలిపోవడం, పొడిబారడం వంటి సమస్యలు ఎదురవుతుంటాయి. ఇలాంటి సమయంలో కొన్ని రకాల నూనెలు వినియోగించడం..
చలికాలంలో చాలామంది జుట్టు రాలిపోవడం, పొడిబారడం వంటి సమస్యలు ఎదురవుతుంటాయి. ఇలాంటి సమయంలో కొన్ని రకాల నూనెలు వినియోగించడం ద్వారా ఆ సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. ఈ ఆయిల్స్ మీ జుట్టును బలోపేతం చేయడం అద్భుతంగా సహాయపడుతాయి. జుట్టు పొడిబారకుండా తేమగా ఉంచుతుంది. అలాగే చుండ్రు, దురద సమస్యను నివారిస్తుంది. శీతాకాలంలో జుట్టును ఆరోగ్యంగా ఉంచడానికి ఏ హెయిర్ ఆయిల్‌ని ఉపయోగించవచ్చో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
ఆలివ్ ఆయిల్..
ఆలివ్ ఆయిల్ జుట్టుకు చాలా మేలు చేస్తుంది. జుట్టు పాడవకుండా కాపాడుతుంది. ఇది తలకు పోషణనిస్తుంది. ఆలివ్ నూనెను హెయిర్ మాస్క్‌గా కూడా ఉపయోగించవచ్చు. ఇందుకోసం, ఒక గిన్నెలో గుడ్డు పచ్చసొన తీసుకోవాలి. దానికి తేనె, ఆలివ్ నూనె కలపాలి. వీటన్నింటిని మిక్స్ చేసి జుట్టుకు అప్లై చేయాలి. ఇది జుట్టు డల్నెస్, డ్రైనెస్ ను తొలగిస్తుంది.
నువ్వుల నూనె..
నువ్వుల నూనెలో ఒమేగా 3, 6, 9 ఉంటాయి. జుట్టు సంరక్షణ కోసం నువ్వుల నూనెను కూడా ఉపయోగించవచ్చు. ఇది శిరోజాలను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఇది రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది.
కొబ్బరి నూనే..
చలికాలంలో కొబ్బరి నూనెను వేడి చేయాలి. దానితో తలకు మసాజ్ చేయాలి. ఇది చుండ్రు, పొడిబారే పరిస్థితిని తగ్గించడంలో సహాయపడుతుంది. జుట్టుకు లోతైన పోషణ అందిస్తుంది. దీన్ని హెయిర్ మాస్క్‌గా కూడా ఉపయోగించవచ్చు. ఒక గిన్నెలో ఆపిల్ సైడర్ వెనిగర్, అరటిపండు, అవకాడో కలపాలి. దీన్ని 15 నిమిషాల పాటు తలకు, జుట్టుకు పట్టించాలి. ఆ తర్వాత జుట్టు కడగాలి.
బాదం నూనె..
బాదం నూనెలో కొవ్వు ఆమ్లాలు, విటమిన్ ఇ, మెగ్నీషియం పుష్కలంగా ఉన్నాయి. ఇది స్కాల్ప్ డ్రైనెస్ తొలగించడంలో సహాయపడుతుంది. దురద సమస్య నుండి ఉపశమనం పొందడంలో సహాయపడుతుంది. ఇది జుట్టును మృదువుగా ఉంచడానికి, జుట్టుకు లోతైన పోషణను అందిస్తుంది. బాదం నూనెను హెయిర్ మాస్క్‌గా కూడా ఉపయోగించవచ్చు. ఇందుకోసం, ఒక గిన్నెలో అవకాడోను గుజ్జుగా చేయాలి. అందులో బాదం నూనె, పెరుగు, తేనె, గుడ్డు కలపాలి. ఈ పేస్ట్‌ని జుట్టు, తలకు పట్టించాలి. 20 నిమిషాలు అలాగే ఉంచి.. ఆ తరువాత జుట్టును కడగాలి.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..