Fan Noise: ఫ్యాన్ తిరిగేటప్పుడు సౌండ్ వస్తుందా? ఇలా చేస్తే సౌండ్ రాదు..

ఇప్పటివరకూ ఫ్యాన్‌తో సరిగ్గా పని ఉండకపోవచ్చు. కానీ ఇకపై ఇంట్లో ఒక్క ఫ్యాన్ ఉన్నా సరిపోదు. ఎందుకంటే ఎండాకాలం మొదలై పోయింది. వేసవి కాలంలో ఉక్క పోత, వేడి అనేవి బాగా తగులుతాయి. దీంతో ఇల్లు నిప్పుల కుంపటిని తలపిస్తాయి. కాబట్టి ఈ సమయంలోనే ఫ్యాన్‌కు బాగా పని పడుతుంది. చలి కాలంలో ఫాస్ట్‌గా తిరిగే ఫ్యాన్స్.. ఎండాకాలం రాగానే ఒక్కసారిగా స్లో అయిపోతాయి. అలాగే సీలింగ్ ఫ్యాన్లు సౌండ్ చేస్తూ ఉంటాయి. ఈ సౌండ్స్ వల్ల […]

Fan Noise: ఫ్యాన్ తిరిగేటప్పుడు సౌండ్ వస్తుందా? ఇలా చేస్తే సౌండ్ రాదు..
Fan Noise

Updated on: Apr 05, 2024 | 4:55 PM

ఇప్పటివరకూ ఫ్యాన్‌తో సరిగ్గా పని ఉండకపోవచ్చు. కానీ ఇకపై ఇంట్లో ఒక్క ఫ్యాన్ ఉన్నా సరిపోదు. ఎందుకంటే ఎండాకాలం మొదలై పోయింది. వేసవి కాలంలో ఉక్క పోత, వేడి అనేవి బాగా తగులుతాయి. దీంతో ఇల్లు నిప్పుల కుంపటిని తలపిస్తాయి. కాబట్టి ఈ సమయంలోనే ఫ్యాన్‌కు బాగా పని పడుతుంది. చలి కాలంలో ఫాస్ట్‌గా తిరిగే ఫ్యాన్స్.. ఎండాకాలం రాగానే ఒక్కసారిగా స్లో అయిపోతాయి. అలాగే సీలింగ్ ఫ్యాన్లు సౌండ్ చేస్తూ ఉంటాయి. ఈ సౌండ్స్ వల్ల నిద్ర సరిగా పట్టదు. అసలే ఎండతో ఉక్కిరిబిక్కిరిగా ఉంటుంది. దానికి తోడు ఈ ఫ్యాన్ సౌండ్‌తో మరింత చిరాకు లేస్తుంది. మీ ఫ్యాన్ కూడా ఇలాగే సౌండ్ వస్తుందా? ఈ చిట్కాలు పాటిస్తే ఇకపై రాకుండా ఉంటుంది. మరి ఫ్యాన్ సౌండ్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ఆయిల్ వేయండి:

ఫ్యాన్ నుంచి శబ్దం వస్తూ ఉందంటే.. అందులో కొద్దిగా ఆయిల్ వేయండి. నూనె వేయడం వల్ల గిర గిర అనే సౌండ్ రాకుండా ఉంటుంది. అంతే కాకుండా ఫ్యాన్ స్పీడుగా, సాఫీగా నడుస్తుంది. నట్లు బిగుసుకు పోయినప్పుడు, తుప్పు పట్టినప్పుడు ఇలా సౌండ్ వస్తుంది. కాబట్టి నూనె వేస్తే ఆ సమస్య పరిష్కారం అవుతుంది.

దుమ్ము, ధూళి:

దుమ్ము, ధూళి కారణంగా కూడా సౌండ్ వస్తూ ఉంటుంది. ఇంట్లో అన్ని వస్తువలున్ని శుభ్రం చేసినా.. ఫ్యాన్‌ని మాత్రం ఏ సంవత్సరానికి ఒకసారి క్లీన్ చేస్తూ ఉంటారు. దీని వల్ల ఫ్యాన్ స్లో అవ్వడమే కాకుండా.. దుమ్ము లోపలికి పోయి.. శబ్దం వస్తుంది.

ఇవి కూడా చదవండి

బ్లేడ్‌లను శుభ్రం చేయాలి:

ఫ్యాన్‌పై దుమ్ము, ధూళి అనేవి చాలా త్వరగా పేరుకు పోతాయి. కాబట్టి బ్లేడ్లు శబ్దం చేస్తూ తిరుగుతాయి. కాబట్టి అప్పుటప్పుడూ బ్లేడ్‌లను క్లీన్ చేస్తూ ఉండాలి.

నట్ బోల్డులు చెక్ చేయండి:

మీరు పైన చెప్పినవన్నీ చేసిన తర్వాత కూడా సౌండ్ వస్తూ ఉందంటే.. ఫ్యాన్‌లో ఏవో నట్టులు లూజ్ అయి ఉండొచ్చు. కాబట్టి ఒకసారి ఫ్యాన్‌ను చెక్ చేసుకోవడం మంచిది.

ఫ్యాన్ బేరింగ్ చెక్ చేయండి:

ఫ్యాన్ల నుంచి శబ్దం మరింత ఎక్కువగా, స్లోగా తిరుగుతున్నాయంటే.. ఫ్యాన్ బేరింగ్ అరిగిపోయి ఉండొచ్చు. కాబట్టి ఒక్కసారి ఎలక్ట్రీషియన్‌ను పిలిపించి చూపించండి.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..