Thyroid cancer: ధైరాయిడ్‌ క్యాన్సర్‌ అంటే ఏంటి.? ఎలా గుర్తించాలి..

ప్రస్తుతం క్యాన్సర్ బాధితుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. థైరాయిడ్ క్యాన్సర్ బారిన పడుతోన్న వారు ఎక్కువుతున్నారు.

Thyroid cancer: ధైరాయిడ్‌ క్యాన్సర్‌ అంటే ఏంటి.? ఎలా గుర్తించాలి..
Thyroid Cancer
Follow us

|

Updated on: Oct 19, 2024 | 10:02 AM

మారుతోన్న జీవన విధానం, తీసుకుంటున్న ఆహారంలో మార్పులు.. కారణం ఏదైనా ఇటీవ క్యాన్సర్‌ బారిన పడుతోన్న వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. ఇలాంటి వాటిలో థైరాయిడ్ క్యాన్సర్‌ ఒకటి. భారత్‌లో థైరాయిడ్ క్యాన్సర్‌ కేసులు ఎక్కువుతున్నాయి. గత 35 ఏళ్లుగా ప్రపంచవ్యాప్తంగా నిర్వహించిన అధ్యయనాలు థైరాయిడ్ క్యాన్సర్ ముప్పు.. మూడు రెట్లు పెరిగింది.

దేశంలో సగటున ఏటా 20,000 కంటే ఎక్కువ మంది థైరాయిడ్‌ క్యాన్సర్ బారిన పడుతున్నారు. వీరిలో సుమారు 4వేల మంది మరణిస్తారు. మహిళల్లో థైరాయిడ్‌ క్యాన్సర్‌ ముప్పు నాలుగు రెట్లు ఎక్కువగా ఉందని గణంకాలు చెబుతున్నాయి. ముఖ్యంగా 30 ఏళ్లులోపు మహిళల్లో థైరాయిడ్ క్యాన్సర్ కేసులు 121% పెరిగాయని ఒక నివేదిక పేర్కొంది. బ్రెస్ట్‌ క్యాన్సర్‌ తర్వాత థైరాయిడ్ క్యాన్సర్‌ బారిన పడుతున్న వారే అధికులు ఉండడం గమనార్హం.

రీసెర్చ్‌గేట్‌లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం 30 ఏళ్లలోపు మహిళల్లో థైరాయిడ్ క్యాన్సర్ కేసులు 121%, 30-44 ఏళ్లలోపు వారిలో 107%, 45-59 ఏళ్లలోపు వారిలో 50% పెరిగాయి. అయితే థైరాయిడ్ క్యాన్సర్‌ను ముందుగానే గుర్తిస్తే.. ప్రాణాలను కాపాడుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. శస్త్రచికిత్స, రేడియేషన్, అయోడిన్‌ వంటి చికిత్సలతో థైరాయిడ్ క్యాన్సర్‌ను పూర్తిగా నయం చేయొచ్చు.

థైరాయిడ్ గంథి మీద కణితిలు అపరిమితంగా పెరగడమే థైరాయిడ్‌ క్యాన్సర్‌కు కారణమని నిపుణులు చెబుతున్నారు. గొంతు అడుగుభాగంలో, శ్వాసనాళానికి (విండ్‌పైప్) దగ్గరగా సీతాకోకచిలుక ఆకారంలో థైరాయిడ్ గ్రంథి ఉంటుంది. శరీర జీవక్రియలలో కీలక పాత్ర పోషించే ఈ గ్రంథి హార్మోన్లను విడుదల చేసే గ్రంథి. థైరాయిడ్ శరీర బరువు, రక్తపోటు, హృదయ స్పందన రేటు, రక్త ప్రవాహం, శరీర ఉష్ణోగ్రతలను నియంత్రించే హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది. థైరాయిడ్ క్యాన్సర్‌ మొత్తం 5 రకాలు ఉంటాయి.

థైరాయిడ్ క్యాన్సర్‌ను ముందుగానే కొన్ని లక్షణాల ఆధారంగా గుర్తించవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఫస్ట్‌ స్టేజ్‌లో ఈ వ్యాధిని గుర్తిస్తే ప్రాణాలతో బయటపడొచ్చు. ముఖ్యంగా తీవ్రమైన అలసట, జుట్ట, గోర్లు, చర్మంలో కొన్ని మార్పుల ఆధారంగా థైరాయిడ్‌ క్యాన్సర్‌ను ఫస్ట్‌ స్టేజ్‌లో గుర్తించవచ్చు. థైరాయిడ్‌ క్యాన్సర్‌ను ముందుగా గుర్తించే లక్షణాల్లో గొంతు బొంగురుపోవడం, మెడ భాగంలో గడ్డ ఏర్పడడం, మింగడంలో ఇబ్బంది తలెత్తడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, లింఫ్‌ నాళాల్లో నొప్పి, వాపు వంటి సమస్యలు కనిపిస్తాయి.

నోట్: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని లైఫ్‌స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..

ధైరాయిడ్‌ క్యాన్సర్‌ అంటే ఏంటి.? ఎలా గుర్తించాలి..
ధైరాయిడ్‌ క్యాన్సర్‌ అంటే ఏంటి.? ఎలా గుర్తించాలి..
ఇవి ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన చేపలు.. చూడగానే నోరూరిపోతుంది..!
ఇవి ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన చేపలు.. చూడగానే నోరూరిపోతుంది..!
గ్యాంగ్‌స్టర్ బిష్ణోయ్ బయోగ్రఫీ సిరిస్‌లో హీరో ఎవరు?
గ్యాంగ్‌స్టర్ బిష్ణోయ్ బయోగ్రఫీ సిరిస్‌లో హీరో ఎవరు?
వైద్యరంగంలో మిరాకిల్స్‌.. అయినా వీణ-వాణిల పరిస్థితి ఇంతేనా..
వైద్యరంగంలో మిరాకిల్స్‌.. అయినా వీణ-వాణిల పరిస్థితి ఇంతేనా..
పేరుకే స్టార్ బౌలర్ భయ్యో.. సెహ్వాగ్ రికార్డ్‌నే ఊడ్చి పడేశాడు
పేరుకే స్టార్ బౌలర్ భయ్యో.. సెహ్వాగ్ రికార్డ్‌నే ఊడ్చి పడేశాడు
'అదేనా చివరి కోరిక'.. బాలీవుడ్‌ బాద్‌షా ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
'అదేనా చివరి కోరిక'.. బాలీవుడ్‌ బాద్‌షా ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
రాజకీయంగా దువ్వాడ కథ ముగిసినట్టేనా? అందుకే ప్రేమలో మునిగిపోయారా.?
రాజకీయంగా దువ్వాడ కథ ముగిసినట్టేనా? అందుకే ప్రేమలో మునిగిపోయారా.?
ప్రభాస్‌తో చేయాల్సిన సినిమా ఎన్టీఆర్‌తో చేశా..
ప్రభాస్‌తో చేయాల్సిన సినిమా ఎన్టీఆర్‌తో చేశా..
విశాఖను టార్గెట్ చేసిన ముఠాలు.. జర జాగ్రత్త సుమీ..
విశాఖను టార్గెట్ చేసిన ముఠాలు.. జర జాగ్రత్త సుమీ..
భక్తుల కోర్కెలు తీర్చే కల్పవల్లి మావుళ్ళమ్మ మండల దీక్షలు ప్రారంభం
భక్తుల కోర్కెలు తీర్చే కల్పవల్లి మావుళ్ళమ్మ మండల దీక్షలు ప్రారంభం