Health: తల్లిగా మారడానికి సరైన సమయం ఏంటి.. ఆలస్యమైతే ఏమవుతుంది.?

|

Jul 29, 2024 | 8:05 AM

తల్లిగా మారడం ప్రతీ మహిళ జీవితంలో కీలకమైన ఘట్టం. తనలాంటి ఓ రూపానికి జన్మనివ్వడం అనే అనుభూతి మాటల్లో వర్ణించలేనిది. అయితే ఒకప్పుడు పెళ్లిల్లు త్వరగా అయ్యేవి త్వరగా పిల్లల్ని ప్లాన్‌ చేసుకునే వారు. కానీ ప్రస్తుతం రోజులు మారిపోయి. పురుషులతో సమానంగా మహిళలు ఉద్యోగాలు చేస్తున్నారు. దీంతో వివాహాలు ఆలస్యంగా అవుతున్నాయి...

Health: తల్లిగా మారడానికి సరైన సమయం ఏంటి.. ఆలస్యమైతే ఏమవుతుంది.?
Pregnancy
Follow us on

తల్లిగా మారడం ప్రతీ మహిళ జీవితంలో కీలకమైన ఘట్టం. తనలాంటి ఓ రూపానికి జన్మనివ్వడం అనే అనుభూతి మాటల్లో వర్ణించలేనిది. అయితే ఒకప్పుడు పెళ్లిల్లు త్వరగా అయ్యేవి త్వరగా పిల్లల్ని ప్లాన్‌ చేసుకునే వారు. కానీ ప్రస్తుతం రోజులు మారిపోయి. పురుషులతో సమానంగా మహిళలు ఉద్యోగాలు చేస్తున్నారు. దీంతో వివాహాలు ఆలస్యంగా అవుతున్నాయి. పిల్లల్ని కూడా లేట్‌గా ప్లాన్‌ చేస్తున్నారు. అయితే తల్లి కావడానికి సరైన వయసు ఏంటి.? ఏ వయసులో గర్భం ధరిస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయి.? లాంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

20 నుంచి 30 ఏళ్ల మధ్య..

ఈ వయసులో మహిళలు శారీరకంగా సామర్థ్యంతో ఉంటారు. వారి అండాల నాణ్యత కూడా బాగుంటుంది. అందుకే ఈ వయసులో గర్భం దాల్చితే సమస్యలు తక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. గర్భస్రావం, పుట్టుకతో వచ్చే లోపాలు కూడా తక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. అలాగే డెలివరీ తర్వాత, మహిళల శరీరం త్వరగా కోలుకుంటుంది త్వరగా సాధారణ స్థితికి చేరుకుంటారు.

30 నుంచి 35 ఏళ్ల మధ్య..

ఈ వయసులో మహిళలు ఆర్థికంగా స్థిరంగా ఉంటారు. కుటుంబ బాధ్యతలను చక్కగా నిర్వహించగలరు. అయితే ఈ వయసులో కూడా గర్భం దాల్చడం వల్ల కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ వైద్యుల సూచనలు పాటించడం, మంచి ఆహారం తీసుకోవడం వల్ల ఆరోగ్యకరమైన బిడ్డకు జన్మనివ్వొచ్చు.

35 ఏళ్ల తర్వాత..

35 ఏళ్ల తర్వాత గర్భం దాల్చడం ఏమాత్రం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. ఈ వయసులో సాధారణంగా అధిక రక్తపోటు, మధుమేహం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే మహిళల్లో అండాల నాణ్యత దెబ్బతింటుంది. ఇది గర్భం దాల్చడంలో ఇబ్బందిని కలిగిస్తుంది. ఈ వయసులో తల్లి కావాలనుకునే వారు నిత్యం వైద్యులను సంప్రదించాల్సి ఉంటుంది. ఇక ఐవీఎఫ్‌ వంటి పద్ధతులను కూడా ఫాలో ఇవ్వొచ్చు.

సరైన వయస్సును ఎలా ఎంచుకోవాలి?

తల్లి కావడానికి సరైన సమయాన్ని స్త్రీ ఆరోగ్య పరిస్థితి ఆధారంగా ఎంచుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా శారీరక, మానసిక ఆరోగ్యం, వృత్తి, ఆర్థిక పరిస్థితిలను పరిగణలోకి తీసుకోవాలి. అయితే వయసు ఏదైనా సరే గర్భం దాల్చాలనుకునే ముందు వైద్యులను సంప్రదిస్తే మంచిది. వైద్యుల సూచన మేరకు ఫోలిక్ యాసిడ్‌ ట్యాబ్లెట్స్‌ వాడుతూ.. మంచి ఆహారం తీసుకుంటే రిస్క్‌ తగ్గుతుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..