Health: మీలో ఈ లక్షణాలున్నాయా.? కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ ఉన్నట్లే..
ముఖ్యంగా కంప్యూటర్ల ముందు గంటల తరబడి కూర్చుని పనిచేసే వారికి కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ అనే సమస్య సర్వసాధారణంగా మారిపోయింది. 2020 డేటా ప్రకారం.. భారత్‌లో సగటున ప్రతి వ్యక్తి ప్రతిరోజూ కనీసం 7 గంటల పాటు స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్, కంప్యూటర్ లేదా టాబ్లెట్ వంటి గాడ్జెట్‌లను ఉపయోగిస్తున్నారు. దీంతో ఈ సమస్య బారిన పడుతోన్న వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. ఇంతకీ ఈ కంప్యూటర్ విజన్ సిండ్రామ్...

మనిషి జీవనశైలి పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు తీవ్ర శారీరక శ్రమ చేసే వారు వర్క్ కల్చర్ మారడంతో ఒళ్లు కదలకుండా గంటల తరబడి కూర్చునే పరిస్థితి వచ్చింది. మరీ ముఖ్యంగా కంప్యూటర్ల ముందు కూర్చొని పనిచేసే వారే ఎక్కువ. ఇక కరోనా మహమ్మారి తర్వాత కేవలం ఉద్యోగులే కాకుండా చిన్నారులు కూడా ల్యాప్‌టాప్‌లకు అతుక్కుపోయే పరిస్థితి వచ్చింది. అయితే స్క్రీన్ టైమ్ పెరిగిన నేపథ్యంలో అనేక రకాల అనారోగ్య సమస్యల తలెత్తుతున్నాయి.
ముఖ్యంగా కంప్యూటర్ల ముందు గంటల తరబడి కూర్చుని పనిచేసే వారికి కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ అనే సమస్య సర్వసాధారణంగా మారిపోయింది. 2020 డేటా ప్రకారం.. భారత్‌లో సగటున ప్రతి వ్యక్తి ప్రతిరోజూ కనీసం 7 గంటల పాటు స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్, కంప్యూటర్ లేదా టాబ్లెట్ వంటి గాడ్జెట్‌లను ఉపయోగిస్తున్నారు. దీంతో ఈ సమస్య బారిన పడుతోన్న వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. ఇంతకీ ఈ కంప్యూటర్ విజన్ సిండ్రామ్ అంటే అంటే ఏంటి.? దీని బారిని పడినట్లు తెలిపే లక్షణాలు ఏంటి.? తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి.? లాంటి పూర్తి వివరాలపై ఓ లుక్కేయండి..
కంప్యూటర్ విజన్ సిండ్రోమ్‌ను డిజిటల్ ఐ స్ట్రెయిన్‌గా కూడా పిలుస్తుంటారు. కళ్లపై అధిక ఒత్తిడి కలిగిస్తుందని కాబట్టి ఇలా కూడా పిలుస్తారు. ఇక ఈ సమస్య బారిన పడిన వారిలో కళ్లలో అలసట, దేన్నైనా చూసేందుకు ఇబ్బందిపడటం, కళ్లలో దురద, కళ్లు పొడిబారడం, అస్పష్టమైన దృష్టి వంటి సమస్యలు వస్తాయి. అంతేకాకుండా బ్లర్ విజన్, దగ్గరి చూపు కనిపించకపోవడం, తలనొప్పి, మెడనొప్పి భుజం నొప్పి వంటి సమస్యలు వస్తుంటాయి. ఇలాంటి లక్షణాలు మీలోనూ కనిపిస్తే వెంటనే అలర్ట్ అవ్వాలని నిపుణులు చెబుతున్నారు.
ముఖ్యంగా స్క్రీన్‌లను చూసే సమయంలో తక్కువ లైటింగ్‌లో స్క్రీన్‌ను వీక్షిస్తే ఈ సమస్య వస్తుంది. అలాగే ఎక్కువ కాంతి వెలువడటం వల్ల కూడా ఈ సమస్య ఏర్పడుతుంది. స్క్రీన్‌కి దగ్గర కూర్చున్నా, విరామం లేకుండా గంటల తరబడి స్క్రీన్‌ను చూసినా ఇలాంటి సమస్య వస్తుంది. ఈ సమస్య నుంచి బయటపడాలంటే.. కంప్యూటర్ ముందు కూర్చునే సమయంలో యాంటీ గ్లేర్ గ్లాసెస్‌ను ఉపయోగించాలి. అలాగే కంప్యూటర్ ముందు కూర్చునే సమయంలో ప్రతి 20 నిమిషాల తర్వాత కనీసం 20 సెకండ్ల పాటు 20 అడుగుల దూరంలో ఉన్న ఏదైనా వస్తువు తదేకంగా చూడాలి. ఇలా చేస్తే కళ్లు రిఫ్రెష్ అవుతాయి. అలాగే కంప్యూటర్ స్క్రీన్‌ను అదే పనిగా చూడకూడదు. మధ్యలో గ్యాప్ ఇవ్వాలి. ఇలా చేస్తే కళ్లలోని తేమ తగ్గకుండా ఉంటుంది.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..