వేసవి కాలంలో శరీరానికి చలువనిచ్చే పండ్లను, కూరగాయలను ఆహారంలో తప్పకుండా భాగం చేసుకోవాల్సిందే. కాలానుగుణంగా లభించే పండ్లను అధికంగా తీసుకోవడం వల్ల శరీరంలో నీటి స్థాయులు పెరగడమే కాకుండా కాలక్రమేణా రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది
TV9 Telugu
ఎండ వేడిమి నుంచి శరీరానికి తక్షణ శక్తినందించే పండ్లు ఎన్నో ఉన్నప్పటికీ కర్బూజా ప్రత్యేకత వేరు. ఈ పండులోని వివిధ పోషకాలు శరీరంలో నీటి స్థాయులను పెంచి డీహైడ్రేట్ కాకుండా కాపాడతాయి
TV9 Telugu
వేసవిలో మామిడితో పాటు కర్భూజా పండ్లు కూడా ఎక్కువగా లభిస్తాయి. ఈ రెండు పండ్లు శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచడానికి పనిచేస్తాయి
TV9 Telugu
కర్భూజాలో నీరు పుష్కలంగా ఉండటంతో పాటు విటమిన్ సి, కాల్షియం, ఐరన్, బి6, డైటరీ ఫైబర్, పొటాషియం, మెగ్నీషియం వంటి అనేక పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. కర్భూజా తీసుకోవడం వల్ల శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకోవచ్చు
TV9 Telugu
జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. రక్తపోటును నియంత్రిస్తుంది. కళ్ళకు సైతం ప్రయోజనం చేకూరుస్తుంది. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది
TV9 Telugu
చాలా మంది కర్భూజా లోపల ఉండే విత్తనాలను పడేస్తుంటారు. నిజానికి ఇవి ముఖ్యమైన ఖనిజాలతో నిండి ఉంటాయి. దీని గింజలను కడిగి ఎండబెట్టి, వివిధ వంటలలో ఉపయోగించడమే కాకుండా, వాటిపై పొట్టు తొలగించి నేరుగాతినొచ్చు
TV9 Telugu
కర్భూజా గింజలు తినడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఎందుకంటే ఇందులో మంచి కొలెస్ట్రాల్‌ను ప్రోత్సహించే ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. కంటి చూపును కాపాడుకోవడానికి సహాయపడే అనేక విటమిన్లు, ఇతర పోషకాలు పుష్కలంగా ఉంటాయి
TV9 Telugu
కర్భూజా గింజలలో ఉండే యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షించడంలో సహాయపడతాయి. ఇవి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచి, సహజంగా మెరిపిస్తాయి