AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Smartphone: మీ స్మార్ట్‌ఫోన్ మీ బాడీ షేప్‌ను మార్చేస్తోందా? ఫోన్ బాడీ అంటే ఏంటో తెలుసా?

Smartphone: గంటల తరబడి స్మార్ట్‌ఫోన్లు, టాబ్లెట్లు వాడటం వల్ల మన శరీరంలో వచ్చే భౌతిక మార్పులను సూచించడానికి నిపుణులు వాడుతున్న పదం ఇది. నిరంతరం స్క్రీన్ వైపు వంగి చూడటం వల్ల మన శరీరం ఒక నిర్దిష్టమైన, అనారోగ్యకరమైన భంగిమకు అలవాటు పడిపోతుంది..

Smartphone: మీ స్మార్ట్‌ఫోన్ మీ బాడీ షేప్‌ను మార్చేస్తోందా? ఫోన్ బాడీ అంటే ఏంటో తెలుసా?
Smartphone
Yellender Reddy Ramasagram
| Edited By: |

Updated on: Jul 07, 2026 | 12:21 PM

Share

Smartphone: పొద్దున లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు మీ చేతిలో స్మార్ట్‌ఫోన్ ఉండాల్సిందేనా? రీల్స్ స్క్రోల్ చేయడం, మెసేజ్‌లు పంపడం, గంటల తరబడి వెబ్‌సిరీస్‌లు చూడటం మీ దినచర్యగా మారిందా? అయితే జాగ్రత్త..మీ ఫోన్ మీ శరీర ఆకృతిని సైలెంట్‌గా మార్చేస్తోంది. దీనినే అంతర్జాతీయ నిపుణులు ఫోన్ బాడీ అని పిలుస్తున్నారు. ఇది ఏదో అధికారిక వైద్య పరిభాష కాదు. కానీ, గంటల తరబడి స్మార్ట్‌ఫోన్లు, టాబ్లెట్లు వాడటం వల్ల మన శరీరంలో వచ్చే భౌతిక మార్పులను సూచించడానికి నిపుణులు వాడుతున్న పదం ఇది. నిరంతరం స్క్రీన్ వైపు వంగి చూడటం వల్ల మన శరీరం ఒక నిర్దిష్టమైన, అనారోగ్యకరమైన భంగిమకు అలవాటు పడిపోతుంది. రెగ్యులర్ గా ఫోన్ యూస్ చేయడం వల్ల శరీరంలో వచ్చే 5 ముఖ్యమైన మార్పులు. నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం..

  1. టెక్స్ట్ నెక్.. సాధారణంగా మన తల బరువు 4.5 నుండి 5.5 కేజీలు ఉంటుంది. కానీ, మనం ఫోన్ చూసేందుకు తలను 60 డిగ్రీల కోణంలో ముందుకు వంచినప్పుడు, మన మెడపై దాదాపు 27 కేజీల ఒత్తిడి పడుతుందని, దీనివల్ల మెడ నొప్పులు, స్పాండిలైటిస్ సమస్యలు వస్తాయని నిపుణులు సూచిస్తున్నారు.
  2.  వంగిపోయిన భుజాలు..గంటల తరబడి ఫోన్ స్క్రీన్‌పై చేతులు పెట్టి కూర్చోవడం వల్ల భుజాలు ముందుకు వంగిపోతాయి. వెన్నుముక ఆకృతి దెబ్బతింటుంది.
  3. కండరాల అలసట.. నిరంతరం ఒకే పొజిషన్‌లో కూర్చోవడం వల్ల నడుము, వీపు కండరాలు బిగుసుకుపోయి తీవ్రమైన నొప్పులు వస్తాయి.
  4. స్మార్ట్‌ఫోన్ తంబ్.. కేవలం బొటనవేలితోనే స్క్రీన్‌ను నిరంతరం స్క్రోల్ చేయడం వల్ల ఆ వేలి కండరాలు, నరాలు దెబ్బతిని విపరీతమైన నొప్పి పుడుతుంది.
  5. కంటి సమస్యలు.. నిరంతరం బ్లూ లైట్ స్క్రీన్‌ను చూడటం వల్ల కళ్లు పొడిబారడం, చూపు మసకబారడం వంటి సమస్యలు వస్తాయి.

ఈ ఫోన్ బాడీ మార్పులను ప్రారంభంలోనే గుర్తిస్తే సులభంగా సరిదిద్దుకోవచ్చు. అందుకోసం ఈ క్రింది జాగ్రత్తలు పాటించలి.

  1. ఐ-లెవెల్ పొజిషన్..ఫోన్ వాడేటప్పుడు ఎప్పుడూ తల వంచకుండా, ఫోన్‌ను మీ కంటి చూపునకు సమానమైన ఎత్తులో ఉంచుకోండి.
  2. 20-20-20 రూల్.. ప్రతి 20 నిమిషాల స్క్రీన్ టైమ్ తర్వాత, 20 సెకన్ల పాటు, 20 అడుగుల దూరంలో ఉన్న వస్తువును చూడండి. దీనివల్ల కంటిపై ఒత్తిడి తగ్గుతుంది.
  3. స్ట్రెచింగ్ ఎక్సర్‌సైజెస్..ప్రతి గంటకు ఒకసారి సీట్లో నుంచి లేచి భుజాలు, మెడను స్ట్రెచ్ చేయండి.
  4. డిజిటల్ డిటాక్స్..రాత్రి పడుకునే కనీసం గంట ముందు ఫోన్‌ను పక్కన పెట్టేయండి. వారంలో కనీసం కొన్ని గంటలైనా ఫోన్‌కు దూరంగా ఉండటానికి ప్రయత్నించండి.
  5. టెక్నాలజీ మన జీవితాన్ని సులభతరం చేయాలి కానీ, మన శరీరాన్ని రోగాల పాలు చేయకూడదు. కాబట్టి ఇప్పటికైనా అలర్ట్ అవ్వండి.. మీ ఫోన్ వాడే విధానాన్ని మార్చుకోండి, ఆరోగ్యాన్ని కాపాడుకోండి.

మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
శుక్రుడితో ఆ రాశుల వారికి కష్టనష్టాలు..కాస్త జాగ్రత్త..!
శుక్రుడితో ఆ రాశుల వారికి కష్టనష్టాలు..కాస్త జాగ్రత్త..!
మీ స్మార్ట్‌ఫోన్ మీ బాడీ షేప్‌ను మార్చేస్తోందా? ఫోన్ బాడీ అంటే ?
మీ స్మార్ట్‌ఫోన్ మీ బాడీ షేప్‌ను మార్చేస్తోందా? ఫోన్ బాడీ అంటే ?
ఇంట్లో కోతులు,బయట కుక్కలు! అధికారుల చర్యల కోసం ఎదురుచూస్తున్న జనం
ఇంట్లో కోతులు,బయట కుక్కలు! అధికారుల చర్యల కోసం ఎదురుచూస్తున్న జనం
ప్రభుత్వ ఆఫీసులో ఇదేం పని.. రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిన తహశీల్దార్
ప్రభుత్వ ఆఫీసులో ఇదేం పని.. రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిన తహశీల్దార్
మహిళలకు గుడ్‌న్యూస్‌.. బంగారం, వెండి ధరల్లో కీలక మార్పులు..!
మహిళలకు గుడ్‌న్యూస్‌.. బంగారం, వెండి ధరల్లో కీలక మార్పులు..!
రూమ్‌లోకి చొరబడిన భారీ ఎలుగుబంటి.. హోటల్ గెస్ట్‌కు ఊహించని షాక్..
రూమ్‌లోకి చొరబడిన భారీ ఎలుగుబంటి.. హోటల్ గెస్ట్‌కు ఊహించని షాక్..
క్యాన్సర్ లక్షణాలపై అవగాహన, వైద్యుల సలహా తప్పనిసరి
క్యాన్సర్ లక్షణాలపై అవగాహన, వైద్యుల సలహా తప్పనిసరి
తెలంగాణలో కిచెన్.. మహారాష్ట్రలో బెడ్‌రూమ్.. ఈ వింత ఇల్లు..
తెలంగాణలో కిచెన్.. మహారాష్ట్రలో బెడ్‌రూమ్.. ఈ వింత ఇల్లు..
ఈ సీనియర్ హీరోయిన్ మహేష్ బాబు బంధువా.!!
ఈ సీనియర్ హీరోయిన్ మహేష్ బాబు బంధువా.!!
ఫుల్లుగా తాగించి భర్తను శాశ్వతంగా పడుకోబెట్టింది..
ఫుల్లుగా తాగించి భర్తను శాశ్వతంగా పడుకోబెట్టింది..