బొప్పాయి బెనిఫిట్స్: ఆరోగ్యంగా ఉండాలంటే ఎన్నో వ్యాయామాలు చేయనవసరం లేదు.. మన ఫుడ్ స్టైల్ మార్చుకోండి.. అవును రోజూ మంచి పండ్లు, కూరగాయలు తింటే దృఢంగా ఉంటారని మీకు తెలుసు.. కానీ శరీరానికి ఏ పండ్లు మంచివో తెలుసా..? ఆరోగ్యకరమైన పండ్లతో మీ రోజును ప్రారంభించడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఇది రోజంతా ఉత్సాహంగా, చురుకుగా ఉండటానికి సహాయపడుతుంది. ఉదయాన్నే ఖాళీ కడుపుతో బొప్పాయి తినడం వల్ల కలిగే అనేక ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఆరోగ్యంగా ఉండాలంటే భోజనంతో పాటు పలు రకాల పండ్లను తినడం అవసరం.. అందులో ముఖ్యమైనది బొప్పాయి.. ఈ పండును ఉదయాన్నే ఖాళీ కడుపుతో తీసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలను పొందవచ్చు. బొప్పాయి మన శరీరానికి అనేక పోషక ప్రయోజనాలను అందిస్తుంది. కాబట్టి, రోజూ ఉదయాన్నే బొప్పాయి తింటే బరువు తగ్గవచ్చు. ఎందుకంటే ఈ పండులో కేలరీలు తక్కువగా ఉంటాయి. ఈ పండులో పీచుపదార్థం ఎక్కువగా ఉండటం వల్ల ఎక్కువ సమయం పాటు కడుపులో ఆకలిని తీరుస్తుంది. అలాగే దీని కారణంగా బరువు నియంత్రణలో ఉంటుంది.
బొప్పాయిలో పపైన్ అనే డైజెస్టివ్ ఎంజైమ్ ఉంటుంది.. ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది. ఇది అపానవాయువు, గ్యాస్, అసిడిటీ వంటి జీర్ణ సమస్యలను నివారిస్తుంది. బొప్పాయి కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. బొప్పాయిని ఖాళీ కడుపుతో తింటే గుండె జబ్బులు తగ్గుతాయి… బొప్పాయిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది.. ఇది మీ రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇన్ఫెక్షన్లు, వ్యాధులను నివారిస్తుంది..
బొప్పాయిని ఉదయాన్నే తింటే శరీరం డిటాక్సిఫై అవుతుంది. బొప్పాయి గింజలు మధుమేహ వ్యాధిగ్రస్తులకు చాలా మేలు చేస్తాయి. బొప్పాయిలో ఉండే ఫైబర్, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, యాంటీఆక్సిడెంట్ లక్షణాలు పూర్తి ఆరోగ్యానికి సహకరిస్తాయి. అలాగే విటమిన్లు ఎ, బి, సి, ఇ ఉంటాయి. ఇవి మాత్రమే కాదు లుటిన్, జియాక్సాంటిన్, కెరోటినాయిడ్స్ వంటి మూలకాలు కూడా బొప్పాయిలో పుష్కలంగా ఉంటాయి.
(గమనిక: ఆరోగ్య నిపుణులు, ఇతర అధ్యాయనాల ద్వారా అందిన సమాచారం మేరకు ఈ వివరాలు అందిస్తున్నాం.. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఏదైనా సందేహాలు,సమస్యలు ఉన్నా వైద్యులను సంప్రదించడమే మంచిదని గమనించగలరు.)
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..