
సాధారణంగా అప్పుడప్పుడూ తుమ్ములు రావడం సహాజం. ఒక్కోసారి పోపు వాసనకు, ఘాటు వాసనకు కూడా తుమ్ములు అనేవి వస్తూ ఉంటాయి. అలాగే జలుబు చేసినప్పుడు కూడా తుమ్ములు వస్తాయి. కానీ తుమ్ములు వచ్చేటప్పుడు చాలా మంది ఆపుకుంటారు. అయితే తుమ్ములు తుమ్మితే.. ఆరోగ్యానికి చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. తుమ్ములకు.. ఆరోగ్యానికి ఏంటి సంబంధం అనుకుంటున్నారా.. ఉంది. తుమ్ముల వెనుక మీ ఆరోగ్య రహస్యం దాగి ఉంది. తుమ్ములు రావడం అనేది అసంకల్పిత చర్య. తుమ్ము అనేది ముక్కు, మెదడు, శరీరంలోని వివిధ కండరాల మధ్య సంక్లిష్టమైన చర్య. మరి తుమ్మితే ఆరోగ్యానికి ఎంత మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం.
చాలా మంది బయట ఉన్నప్పుడు.. ఎక్కడైనా ఇతర ప్రదేశాల్లో ఉన్నప్పుడు తుమ్ము వస్తున్నప్పుడు దాన్ని ఆపేసుకుంటారు. కానీ ఇలా చేయడం ఆరోగ్యానికి మంచిది కాదు. తుమ్మినప్పుడు గుండె కొన్ని మిల్లీ సెకన్ల పాటు పని చేయడం అనేది ఆగిపోతుంది. ఈ విషయం చాలా మందికి తెలీదు. అందుకే తుమ్ములు వచ్చేటప్పుడు అస్సలు ఆపకూడదు. ఎంత వేగంగా తుమ్మితే అంత మంచిదని నిపుణులు చెబుతున్నారు.
ఓ వ్యక్తి తుమ్ములు వచ్చేటప్పుడు బలవంతంగా ఆపేవాడు. అయితే ఆ తర్వాత అతని గొంతులో చిన్న రంధ్రం ఏర్పడింది. యూఎస్‌కు చెందిన 30 ఏళ్ల వ్యక్తికి అనుభవం ఎదురైంది. తుమ్ము వచ్చేటప్పుడు ముక్కును, నోరును ఆపేసుకున్నాడు. దీంతో వెంటనే అతనికి గొంతులో నొప్పి వచ్చింది. భయానికి గురై వెంటనే.. డాక్టర్ దగ్గరకు వెళ్లాడు. గొంతులో చిన్న రంధ్రం ఉన్నట్టుగా వైద్యుడు చెప్పాడు. ఆ వ్యక్తిని తుమ్మును ఆపుకోవడంతో గొంతుపై 40 శాతం ఒత్తిడిపి పెరిగింది. దీంతో అతని గొంతులో రంధ్రం ఏర్పడింది. అంతేకాకుండా తుమ్మును ఆపుకోవడం వల్ల ఒక్కోసారి గుండె ఆగిపోయే ప్రమాదం కూడా ఉన్నట్లు వైద్యులు సూచించారు.
అంతే కాదు తుమ్మడం వల్ల నోటిలో ఉండే బ్యాక్టీరియా బయటకు వెళ్లిపోతుంది. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా తుమ్మును అస్సలు ఆపుకోకూడదు. తుమ్మును అస్సలు ఆపుకునే ప్రయత్నం చేయకూడదు. ఇలా చేస్తే అనేక సమస్యలను ఎదుర్కొనాల్సి వస్తుంది. గుండె సంబంధిత సమస్యలు కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..
గమనిక: ఇది నిపుణులు, అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం. అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా నిపుణులను సంప్రదించడం మేలు.