నడక ఆరోగ్యానికి మంచిదని మనందరికీ తెలిసిందే. మెరుగైన ఆరోగ్యం, మంచి శరీర ఆకృతి, బరువు నిర్వహణ కోసం క్రమం తప్పకుండా 10,000 అడుగులు నడవాలని నిపుణులు సలహా ఇస్తున్నారు. కానీ మీరు ఎప్పుడైనా దీనికి విరుద్ధంగా ప్రయత్నించారా..? అంటే నార్మల్ వాకింగ్‌కు బదులుగా రివర్స్‌లో నడవటం..! ఇలా వెనుకకు నడవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చునని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..
వెనుకకు నడవడం వల్ల ఒకటి, రెండూ కాదు.. అనేక ప్రయోజనాలు ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇలా రివర్స్ వాకింగ్ క్రమం తప్పకుండా చేయటం వలన మోకాళ్లు, కాళ్ల వెనుక కండరాల వశ్యత పెరుగుతుంది. అలాగే, శరీర సమతుల్యతను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. వెన్నునొప్పితో బాధపడేవారికి ప్రయోజనకరంగా ఉంటుంది. ముఖ్యంగా రివర్స్ వాకింగ్ వల్ల దృష్టి కేంద్రీకరించే సామర్థ్యం పెరుగుతుంది.
వెనుకకు నడవటం వల్ల శరీరంపై ఎక్కువ అవగాహన కల్పిస్తుంది. స్ట్రెయిట్ వాకింగ్‌తో పాటు, రివర్స్ వాకింగ్ మీ శరీరానికి, మనస్సుకు మరిన్ని ప్రయోజనాలను అందిస్తుంది. ఇది మీ మనస్సు, శరీరానికి మధ్య మంచి సమతుల్యతను సృష్టిస్తుంది. కానీ వెనుకకు నడిచేటప్పుడు మీ చుట్టూ ఉన్న పరిసరాలను దృష్టిలో ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే, రద్దీగా ఉండే ప్రదేశం, జంతువులు, ఇతర వస్తువులు, వాహనాలు మీ వెనుక ఉండకుండా జాగ్రత్త వహించండి.
అలాగే మరో ముఖ్యమైన విషయం ఏంటంటే..శరీర అసమతుల్యత సమస్యలు, పడిపోతామనే విపరీతమైన భయం, తల తిరగడం లేదా వెర్టిగో వంటి సమస్యలు ఉన్నవారు నిపుణుల సహాయం లేకుండా వెనుకకు నడవడానికి ప్రయత్నించకూడదు. ఇది మెరుగైన ఆరోగ్యానికి బదులుగా హాని చేస్తుందని చెబుతున్నారు. కాబట్టి నిపుణుల సలహా తప్పనిసరి అంటున్నారు.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది… ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..