
ప్రస్తుతం ఇప్పుడు సిల్కీ స్కిన్ ట్రెండ్ నడుస్తుంది. సిల్కీ స్కిన్ కోసం ఇప్పుడు ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. సాధారణంగా వయసు మీద పడే కొద్దీ.. చర్మంలో కొల్లాజెన్ ఉత్పత్తి అనేది తగ్గిపోతుంది. దీంతో ముఖంపై ముడతలు, వృద్ధాప్య ఛాయలు రావడం సహజం. అయితే ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా.. చిన్న వయసులో కూడా వయసున్న వారిలా కనిపిస్తున్నారు. ఇందుకు అనేక కారణాలు ఉన్నాయి. మారిన లైఫ్ స్టైల్, నిద్ర లేకపోవడం, ఒత్తిడి, కాలుష్యం, ఎండ, హార్మోనల్ ఇన్ బ్యాలెన్స్, ఆహారపు అలవాట్లు ఇలా చాలా కారణాలు ఉన్నాయి. వీటి వలన చర్మంపై ముడతలు ఏర్పడి, కాంతి విహీనంగా కనిపిస్తుంది. ముఖంపై ముడతలను పోగొట్టుకునేందుకు ఇప్పటికే ఎన్నో టిప్స్ తెలుసుకున్నాం. అయితే ఇప్పుడు మరిన్ని టిప్స్‌తో మీ ముందుకు వచ్చేశాం. ముఖంపై ముడతలను తగ్గించి.. సిల్కీ స్కిన్ కావాలంటే.. పాలు చక్కగా హెల్ప్ చేస్తాయి. అదెలాగో ఇప్పుడు చూసేయండి.
ఒక గిన్నెలో పచ్చి పాలను తీసుకోండి. ఇందులో కాటన్ బాల్ ముంచి.. ముఖం, మెడపై అప్లై చేసి.. సున్నితంగా మర్దనా చేయండి. ఓ పది నిమిషాల తర్వాత ముఖం వాష్ చేసుకోండి. ఇలా తరచూ చేస్తే.. ముఖంపై ఉండే మురికి, డెడ్ స్కిన్ సెల్స్ పోయి.. చర్మం మెరుస్తుంది.
ఒక గిన్నెలో అవోవెరా జెల్, పాలు తీసుకుని బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మెడ, చేతులు, ముఖంపై అప్లై చేసి.. కాసేపు మర్దనా చేసి ఓ 15 నిమిషాల పాటు పక్కకు ఉంచండి. ఇలా తరచూ చేస్తే.. ముఖం కాంతివంతంగా మెరిసిపోతుంది.
మరో టిప్ ఏంటంటే.. బాగా పండి అరటి పండును మెత్తగా చేసి ఒక బౌల్‌లోకి తీసుకోండి. ఇందులో పచ్చి పాలు వేసి.. పేస్ట్‌లా చేయాలి. అనంతరం దీన్ని ముఖం, మెడ, చేతులకు కూడా అప్లై చేసుకోండి. ఓ 10 – 15 నిమిషా తర్వాత ముఖాన్ని కడిగేయాలి.
ఒక బౌల్‌లో పాలు, తేనె సమానంగా తీసుకోండి. బాగా మిక్స్ చేసి ముఖం, మెడ, చేతులకు అప్లై చేసి.. ఓ 10 నిమిషాలు వదిలేయండి. ఆ తర్వాత నీటితో ముఖాన్ని కడిగేయాలి. ఇలా తరచూ చేస్తే.. సిల్కీ చర్మం మీ సొంతం అవుతుంది.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..